newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

లెస్బియన్ గా 'అంజలి'.. ఆమె గట్సే వేరంటోన్న నెటిజన్స్..!

05-12-202005-12-2020 19:50:01 IST
Updated On 05-12-2020 21:38:46 ISTUpdated On 05-12-20202020-12-05T14:20:01.856Z05-12-2020 2020-12-05T14:19:55.922Z - 2020-12-05T16:08:46.976Z - 05-12-2020

లెస్బియన్ గా 'అంజలి'.. ఆమె గట్సే వేరంటోన్న నెటిజన్స్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొన్ని పాత్రల్లో నటించాలంటే ఎన్నో గట్స్ ఉండాలి..హీరో అయినా..హీరోయిన్ అయినా ఇదే రూల్ వర్తిస్తుంది. హీరోల సంగతి పక్కన పెడితే హీరోయిన్స్ మాత్రం తమకి వచ్చే పాత్రల విషయంలో ఎన్నో ఆలోచనలతో పాటు..నలుగురి సలహాలు తీసుకుని చేస్తుంటారు..బాలీవుడ్ మాట పక్కనపెడితే మన తెలుగులో మాత్రం తెలుగు హీరోయిన్స్ కొన్ని రూల్స్ ని పాటిస్తూ ఓ పద్దతిలో వెళుతుంటారు. కొంతమంది మాత్రం వీటికి విరుద్ధంగా తమకు నచ్చిన విధంగా నడుచుకుంటుంటారు. వారిలో ముందుంటుంది తెలుగమ్మాయి అంజలి. ఈమెకి చాలా డేర్..ఎటువంటి పాత్రకైనా సిద్ధం అంటోంది ఈ బ్యూటీ.

ఈ మధ్యే బొద్దుతనం నుండి స్లిమ్మ్ లుక్ లోకి మారిపోయింది ఈ భామ. ఇకపోతే ప్రస్తుత రోజుల్లో ఓ పాత్ర రావడం అనేది కష్టతరంగా మారుతోంది. దానికి తోడు ఆ పాత్రలో మనం నటించలేమనే భావనని నేటి యంగ్ జనరేషన్స్ హీరో..హీరోయిన్స్ పక్కనపెడుతున్నారు. ఎటువంటి పాత్రలోనైనా నటించగలం అని నిరూపిస్తున్నారు. దాంతో మన హీరోయిన్లకు ఛాలెంజింగ్ రోల్స్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. ముఖ్యంగా తెలుగమ్మాయిలు అయితే మేం ఎందులోనూ తక్కువ కాదంటున్నారు. అవసరం అనుకుంటే హాలీవుడ్ భామలు కూడా చేయలేని రొమాన్స్ చేస్తామని ఓపెన్‌గానే ఆఫర్స్ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే యంగ్ హీరోయిన్ తేజస్వి మదివాడ లాంటి ముద్దుగుమ్మలు పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు హీరోయిన్ కూడా ఏకంగా లెస్బియన్ పాత్రలో నటిస్తుంది. ఆమె ఎవరో కాదు.. అంజలి. ఫోటో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సినిమాతో ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే అంటూ వచ్చింది. ఇక్కడ కూడా కొన్ని సినిమాలు చేసినా ఊహించినంత గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో తమిళనాటే తన లక్ టెస్ట్ చేసుకుంటుంది అంజలి. ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఓ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటిస్తుంది. పావ కదైగాల్ అనే సినిమా కోసం లెస్బియన్‌గా మారిపోయింది అంజలి. నలుగురు అగ్ర దర్శకులు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాలుగు భిన్నమైన కథలను ముడిపెడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్.. గౌతమ్ మీనన్.. సుధ కొంగర.. వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు. ఎంతనా అంజలి గట్స్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే అంటున్నారు నెటిజన్స్.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle