newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. ఎవరితో తెలుసా..?

30-09-202030-09-2020 20:03:33 IST
2020-09-30T14:33:33.420Z30-09-2020 2020-09-30T14:33:29.943Z - - 20-10-2020

యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. ఎవరితో తెలుసా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలుగు బుల్లి తెర పాపులర్ యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్ అయ్యింది అనే వార్త బయటకు వచ్చింది. యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ప్రదీప్ ని అడిగిన ప్రతిసారీ ఇంకా టైమ్ రాలేదు. టైమ్ వచ్చినప్పుడు అదే జరుగుతుంది. మా ఇంట్లో పెళ్లి పెళ్లి అంటూ కంగారు పెడుతున్నారు అంటూ సమాధానం చెప్పేవాడు కానీ.. పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేవాడు కాదు. దీంతో ప్రదీప్ పెళ్లి ఎప్పుడు అనేది టీవీలు చూసే వీక్షకులకు ఓ సమాధానం లేని ప్రశ్నగా మారింది.

ప్రదీప్ కి ఉన్న క్రేజ్.. అతని పెళ్లి గురించి అందరిలో ఉన్న క్యూరియాసిటీ గమనించే స్టార్ మా ఏకంగా ప్రదీప్ కి స్వయంవరం అంటూ ఓ రియాల్టీ షో కూడా స్టార్ట్ చేసారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ప్రదీప్ పెళ్లి ఎప్పటి నుంచో వార్తల్లో ఉందో. ఇదిలా ఉంటే... ఇప్పుడు నిజంగానే ప్రదీప్ పెళ్లి వార్తల్లో నిలిచింది. ప్రదీప్ కి పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే ప్రదీప్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని.. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చిందని తెలిసింది.ఇంతకీ పెళ్లి కూతురు ఎవరంటే.. రాయలసీమకు చెందిన ఒక పొలిటీషియన్ కుమార్తె అని సమాచారం. దీని పై ప్రదీప్ ఇంకా స్పందించాల్సి ఉంది.

సినిమాల విషయానికి వస్తే.. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేసాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle