newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

నా కొడుకు మాట‌ల‌తో ఏడుపొచ్చింది-అన‌సూయ‌

19-10-202019-10-2020 11:48:02 IST
Updated On 19-10-2020 13:12:18 ISTUpdated On 19-10-20202020-10-19T06:18:02.298Z19-10-2020 2020-10-19T06:17:55.540Z - 2020-10-19T07:42:18.285Z - 19-10-2020

నా కొడుకు మాట‌ల‌తో ఏడుపొచ్చింది-అన‌సూయ‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అందాల యాంక‌ర్ అనసూయ ఫ్యామిలీలో ఏం జ‌రిగినా అది కాస్త ఇంట్ర‌స్టింగ్ గానే ఉంటుంది. టాప్ లిస్ట్ లో ఉన్న యాంక‌ర్ల‌లో అన‌సూయ ఉండ‌డంతో పాటు.. ఆమె అందానికి ఫుల్లు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక త‌న జోవియ‌ల్ నెస్ కి కూడా ఫ్యాన్స్ అయ్యారు. అలాంటి అన‌సూయ ఎప్పుడో కానీ ఎమోష‌న‌ల్ గా మాట్లాడ‌దు. మ‌రి త‌న కొడుకు మాట‌ల‌తో ఎమోష‌న‌ల్ అయిన యాంకర్ అన‌సూయ బ‌య‌టికి చెప్పేస్తే.. ఫ్యాన్స్ మ‌న‌సు క‌రిగిపోదా చెప్పండి. ఇప్పుడు ఎగ్జాట్ గా అదే జ‌రిగింది. 

అన‌సూయ తొమ్మిదేళ్ల కొడుకు అన్న మాట‌లు త‌న గుండె క‌రిగేలా చేసింద‌ట‌. ఛాన్స్ కానీ ఉంటే నేను పాత రోజుల్లోకి వెళ్తా అమ్మా.. అప్పుడైతే క‌రోనా లేదు. ఈ వ‌ర‌ద‌లూ లేవు. క‌రోనాతో ఈ భ‌యాలు లేవు. వ‌ర‌ద‌ల్లో ఈ బాధ‌లు లేవు. స్కూల్స్ ఉండేవి. ఫ్రెండ్స్ తో ఆడుకునే వాడిని అని బాధ ప‌డ్డాడ‌ట‌. మ‌రి తొమ్మిదేళ్ల కొడుకు అలా బాధ ప‌డితే ఏ త‌ల్లికైనా బాధ ఉండ‌దా చెప్పండి. అదే విష‌యాన్ని త‌న ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది అన‌సూయ‌.

దీంతో అంద‌రూ నిజ‌మే క‌దా అనుకుంటున్నారు. అన‌సూయ కొడుకులాగే ఎంత మంది చిన్న పిల్ల‌లు ఎంత కుమిలి పోతున్నారో. పెద్దోళ్లంటే సిచ్చువేష‌న్స్ తెలుసు.. చేసేదేం లేదు అనే క్లారిటీ ఉండి స‌ర్దుకుంటారు. కానీ.. ప‌సి ప్రాయంలో ఉన్న పిల్ల‌ల‌కి ఏం తెలుసు చెప్పండి. ఎప్పుడూ ఉండే స్కూల్స్ ఎందుకు లేవో తెలీదు. ఎప్పుడు ఆడుకునే ఆట‌లకి ఎందుకు దూరంగా ఉండాల్సి వ‌స్తుందో తెలీదు.

బ‌ళ్లో అంద‌రితో స‌ర‌దాగా, తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆడుకుంటూ చ‌దువుకునే పిల్ల‌లు ఒక్కసారిగా ఇళ్ల‌ల్లో ఎందుకు లాక‌య్యారో తెలీదు. ఇళ్ల‌కి చుట్టాలు ఎందుకు రావ‌డం లేదు తెలీదు.. చుట్టాలిళ్ల‌కి ఎందుకు వెళ్ల‌డం లేదో తెలీదు. ఇలా ఎన్ని ఆలోచ‌న‌లో క‌దా. కాస్త వ‌య‌సొచ్చిన పిల్ల‌లు ఓకే కానీ.. ప‌సి ప్రాణాల‌కైతే.. ఏమీ అర్దం కాక‌.. లోలోప‌ల మ‌ద‌న ప‌డిపోతున్నాల అనేది నిజంగా నిజ‌మే.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle