newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

ఏఎంబీ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్.. వీ ఆర్ ఆల్ సెట్ టు ఓపెన్

01-12-202001-12-2020 12:30:56 IST
Updated On 01-12-2020 12:49:34 ISTUpdated On 01-12-20202020-12-01T07:00:56.343Z01-12-2020 2020-12-01T07:00:51.486Z - 2020-12-01T07:19:34.295Z - 01-12-2020

ఏఎంబీ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్.. వీ ఆర్ ఆల్ సెట్ టు ఓపెన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రజలకి వినోదం ఏంటంటే సినిమా అనే చెప్పాలి.. పండగలయినా.. పబ్బాలయినా థియేటర్ కి వెళ్ళి సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్ప..ఎంతసేపని టీవీ రిమోట్ మార్చి మార్చి చూసినా రొటీనే అనిపిస్తుంది..అదే ఫ్రెండ్స్ తోనో.. ఫ్యామిలీతోనో..అదికూడా కాదంటే లవర్ తో అయినా థియేటర్ కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరనిపిస్తుంది. కానీ కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా సినిమా థియేటర్స్ మూత పడ్డాయి. థియేటర్స్ తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చింది.

మరి థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి..అయినా ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి ఇలా పలు ప్రశ్నలు ఉన్నాయి సినీ లవర్స్ కి. వాటన్నింటికి చెక్ పెట్టింది ఏఎంబి సంస్థ. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా అని సినీ ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. డిసెంబర్ 4 నుంచి మల్టీప్లెక్స్ థియేటర్లు రీఓపెన్ కాబోతున్నాయి. తొలిగా ఏఎంబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం హాట్ టాపిక్ గా మారింది.

మొదటిసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు భాగస్వామిగా వ్యవహరిస్తున్న మల్టీప్లెక్స్ గ్రూప్ థియేటర్స్ ఏఎమ్.బీ సినిమాస్ ముందుకొచ్చింది. ఈ క్రైసిస్ కాలంలో గత ఎనిమిది నెలలుగా మూతపడిన ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ గ్రూప్ డిసెంబర్ 4 నుంచి రీఓపెన్ అవుతున్నట్టు థియేటర్స్ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. `ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్.. వీ ఆర్ ఆల్ సెట్ టు ఓపెన్ డిసెంబర్ 4` అంటూ ఓ ప్రకటనని మీడియాకు విడుదల చేసింది. దీంతో గత కొంత కాలంగా థియేటర్ల రీఓపెన్ పై నెలకొన్ని సందిగ్ధతకు తెరపడుతున్నట్టు అయింది.

ఈ ప్రకటన రాగానే యంగ్ హీరో విశ్వక్ సేన్ సహా పలువురు స్టార్లు హర్షాన్ని వ్యక్తం చేశారు. మనం మళ్లీ వస్తున్నాం అంటూ విశ్వక్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏఎమ్ బీ సినిమాస్ మంగళవారం నుంచి బుకింగ్స్ స్టార్ట్ చేసినట్టు తెలిపారు. థియేటర్స్ రీఓపెన్ పై నెలకొన్న ప్రతిష్టంభన తాజా ప్రకటనతో తొలగిపోయి సాధారణ స్థితి నెలకొంటుందని ఆశిద్దాం. కనీసం ఈ క్రిస్మస్ మొదలు సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో సాధారణ స్థితి వస్తుందనే ఇండస్ట్రీ వర్గాలు సహా ఆడియెన్స్ కూడా కోరుకుంటున్నారు. సినీ ప్రియులకు ఇక పండగే పండగ.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle