newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

పుష్ప ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనా..?

19-10-202019-10-2020 16:41:34 IST
Updated On 19-10-2020 18:13:11 ISTUpdated On 19-10-20202020-10-19T11:11:34.392Z19-10-2020 2020-10-19T11:10:17.701Z - 2020-10-19T12:43:11.514Z - 19-10-2020

పుష్ప ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుంది. బన్నీ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నారు. చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడడం కోసం బన్నీ, రష్మిక ట్రైనింగ్ తీసుకున్నారు. అయితే... కేరళలో షూటింగ్ ను మార్చి నెలలో ప్రారంభించాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది.

కరోనా కాస్త తగ్గిన తర్వాత ఇటీవల షూటింగ్ లు స్టార్ట్ అయ్యాయి కానీ.. పుష్ప మాత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ లేదు. దీంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కిస్తారు అంటూ బన్నీ మరియు సుక్కు ఫ్యాన్స్ పదే పదే వారిని సోషల్ మీడియా వేదికగా అడుగుతూనే ఉన్నారు. ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటంటే... ఈ సినిమాలో కీలమైన పాత్రకు మొదట విజయ్ సేతుపతిని అనుకున్నారు. ఆయన తప్పుకోవడంతో ఆ పాత్ర కోసం నటుడిని ఎంపిక చేసే పక్రియ జరుగుతుందని.. ఆ కారణం వల్ల కూడా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తుంది.

పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తుండడంతో ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి.. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ కానుందో త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.

మారేడు మిల్లి ఫారెస్ట్ లో 'పుష్ప' షూట్..రిసార్ట్స్ కూడా బుక్ చేశారట..


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle