newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

అల్లరి నరేశ్ 57వ చిత్రంగా 'నాంది'..షూటింగ్ కంప్లీట్

29-10-202029-10-2020 18:37:51 IST
Updated On 30-10-2020 08:13:37 ISTUpdated On 30-10-20202020-10-29T13:07:51.407Z29-10-2020 2020-10-29T13:07:46.413Z - 2020-10-30T02:43:37.213Z - 30-10-2020

అల్లరి నరేశ్ 57వ చిత్రంగా 'నాంది'..షూటింగ్ కంప్లీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓ పక్క హీరోగా..మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నటనని నిరూపించుకుంటున్నాడు హీరో అల్లరి నరేష్. షూటింగ్ లు స్టార్ట్ అయిన నేపథ్యంలో నాంది మూవీ కంప్లీట్ అయిందట. మహర్షి చిత్రంలో మహేశ్ బాబు ఫ్రెండ్ గా మెరిసిన నరేష్ రీసెంట్ గా నాంది చిత్రంలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కామెడీ చిత్రాలతో వెండితెరపై నవ్వులు పంచిన అల్లరి నరేష్ తన పంథా మార్చుకొని నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ''నాంది''. ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

కాగా అల్లరి నరేశ్ కెరీర్ లో 57వ చిత్రంగా రూపొందింది 'నాంది' చిత్రం - ఎ న్యూ బిగినింగ్’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ టీజర్ అన్ని వర్గాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'నాంది' షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి న్యూ పోస్టర్ విడుదల చేశారు.

'నాంది' కొత్త పోస్టర్ లో అల్లరి నరేష్ కిటికీ దగ్గర నిలబడి గట్టిగా అరుస్తూ తన బాధను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ ఇంతకుముందు ఎప్పుడూ పోషించనటువంటి వైవిద్యమైన పాత్రలో నటిస్తున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రంలో తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ - నవమి - హరీష్ ఉత్తమన్ - ప్రియదర్శి - ప్రవీణ్ - దేవి ప్రసాద్ - వినయ్ వర్మ - నర్సింహారావు - శ్రీకాంత్ అయ్యంగార్ - రమేష్ రెడ్డి - చక్రపాణి - మణిచందన ప్రమోదిని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సిద్ జే సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేసారు. ప్రముఖ రచయిత అబ్బూరి రవి సంభాషణలు అందించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించనుందో చూడాలి.

బాలయ్య - బోయపాటి స్టార్ట్ చేసేసారుగా..


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle