newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

హిందీలో అల.. వైకుంటపురములో.. హీరో ఎవరంటే..

14-06-202114-06-2021 15:40:13 IST
2021-06-14T10:10:13.743Z14-06-2021 2021-06-14T10:10:09.869Z - - 25-07-2021

హిందీలో అల.. వైకుంటపురములో.. హీరో ఎవరంటే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ పై టాలీవుడ్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదట చేసిన జులాయితో ట్రెండ్ సెట్ చేసి ఆ తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో మరొక బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం  అల..వైకుంఠపురములో కూడా బిగెస్ట్ హిట్ గా నిలిచింది. అల.. వైకుంఠపురములో దాదాపు 260కోట్ల వరకు బిజినెస్ చేసి నిర్మాతలకు బయ్యర్లకు మంచి లాభాలను అందించింది. కేవలం థియేట్రికల్ గానే కాకుండా డిజిటల్ రైట్స్ లలో కూడా నిర్మాతకు మంచి లాభాలు గడించింది. అయితే సినిమాను రీమేక్ చేయాలని బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు గత ఏడాది చర్చలు బాగానే జరిపారు. స్టోరీ హక్కుల కోసం పోటీ పడినప్పటికి గీతా ఆర్ట్స్ ఎవరికి దక్కనివ్వలేదు.

తాజాగా అల.. వైకుంటపురములో అల్లు అర్జున్ చేసిన పాత్రకు ఎవరు న్యాయం చేస్తారని అనుకుంటున్నతరుణంలో గతంలో చాలా పేర్లు వినిపించాయి. ఇక ఫైనల్ గా కార్తిక్ ఆర్యన్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. తెలుగులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఇప్పుడు హిందీలో కృతి సనన్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ లోని ఒక బడా బాలీవుడ్ ప్రొడక్షన్ తో కలిసి గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నాడట. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఎంత సూపర్ హిట్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి హిందీలో కూడా తమన్ కి అవకాశం ఇస్తారా అన్నది చూడాలి.

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

   9 hours ago


నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

   10 hours ago


హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

   a day ago


Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

   a day ago


ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

   24-07-2021


రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

   24-07-2021


ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

   24-07-2021


తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

   23-07-2021


బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

   23-07-2021


నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle