newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

08-04-202108-04-2021 16:48:03 IST
2021-04-08T11:18:03.686Z08-04-2021 2021-04-08T11:17:54.793Z - - 11-04-2021

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలు తాను నటించిన తలైవి సినిమా ట్రైలర్‌ను ప్రశంసిస్తూ రహస్యంగా తనకు కాల్స్ చేస్తున్నారని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్య చేశారు. అలియా భట్, దీపికా పడుకొనే వంటి హీరోయిన్ల సినిమాల విడుదల సమయంలో బహిరంగంగా ప్రశంసలు అందించే అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్లు బాలీవుడ్ మూవీ మాఫియా టెర్రర్ కారణంగా తన సినిమాలను బహిరంగంగా ప్రశంసించలేకపోతున్నారని తెలిపారు.

బాలీవుడ్ ఎంత శత్రుపూరిత మనస్తత్వంతో ఉంటోందంటే నన్ను ప్రశింసించే వ్యక్తులను సైతం ఇబ్బంది పెడుతున్నారు. తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా నేను నటించిన తలైవి సినిమా ట్రైలర్ చూసి అక్షయ్ కుమార్ వంటి బడా స్టార్ హీరోలు నాకు రహస్యంగా కాల్స్ చేస్తూ సందేశాలు పంపుతున్నారు. అలియా భట్, దీపికా పడుకొనే సినిమాలకు మల్లే నా సినిమాను బహిరంగంగా ప్రశంసించలేకపోతున్నారు.  దీనంతటికీ మూవీ మాఫియా టెర్రరే కారణం అని తలైవి సినీ హీరోయిన కంగనా రనౌత్ పేర్కొన్నారు.

ఒక కళారంగ పరిశ్రమ ఎవరి కళాత్మక సృష్టి పైన అయినా వస్తుగతంగానే వ్యవహరించాలని కోరుకుంటాను. సినిమా విషయంలోనూ అధికార రాజకీయాలు, పవర్ ప్లే వంటివి జోక్యం చేసుకోకూడదు. నా రాజకీయ అభిప్రాయాలు, ఆధ్యాత్మకత నన్ను వేధింపులకు, ఒంటరితనానికి గురి చేస్తూ దాడి చేయకూడదు. ఒకవేళ అలాంటి పిచ్చిపనులకు ఎవరైనా పాల్పడితే దాంట్లో కూడా నేనే విజయం సాధిస్తాను అని కంగనా పేర్కొన్నారు.

సినిమాల నుంచి రాజకీయాల దాకా పయనించిన దివంగత జయలిలత ప్రయాణమే తలైవి సినిమా. దీంట్లో అరవింద్ స్వామి ఎంజీఆర్‌గా, ప్రకాష్ రాజ్ కరుణానిధిగా, జిష్షు సేన్ గుప్తా శోభన్ బాబుగా, భాగ్యశ్రీ.. జయలలిత తల్లి సంధ్యగా నటించారు.

విష్ణు వర్దన్, శైలేష్ ఆర్ సింగ్ నిర్మించిన ఈ బహు భాషా చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ రచయిత. పూర్ణ, మధో ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle