newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

లవ్ స్టోరీపై ఫైర్ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్!

25-10-202025-10-2020 21:39:34 IST
Updated On 26-10-2020 09:15:50 ISTUpdated On 26-10-20202020-10-25T16:09:34.331Z25-10-2020 2020-10-25T16:09:22.063Z - 2020-10-26T03:45:50.263Z - 26-10-2020

లవ్ స్టోరీపై ఫైర్ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. మజిలీ, వెంకీమామ చిత్రాల తర్వాత చైతన్య నటిస్తున్న సినిమా కావడం.. దీనికి శేఖర్ కమ్ముల దర్శకుడు కావడంతో లవ్ స్టోరీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చైతు - సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తయ్యింది. పాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తవ్వడంతో డిసెంబర్ లో కానీ జనవరిలో కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే... దసరా సందర్భంగా లవ్ స్టోరీ మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఏమాత్రం కొత్తదనం లేదు. గత కొన్ని రోజులుగా లవ్ స్టోరీ సినిమాకి సంబంధించి రిలీజ్ చేస్తున్న పోస్టరే మళ్లీ రిలీజ్ చేసారు. అదే డ్రెస్.. అదే స్టిల్. అంతే.. ఈ పోస్టర్స్ స్టిల్స్ చూసి ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. సినిమా అంతా అదే డ్రెస్ లో ఉంటారా..? లేక నిర్మాణ సంస్థ డబ్బులు ఖర్చు పెట్టకూడదని ఒకే డ్రెస్ తో సినిమా తీసేసారా..? ఇలా తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.

పండగ సందర్భంగా రిలీజ్ చేసే పోస్టర్ అంటే కొత్త పోస్టర్ రిలీజ్ చేయాలి కానీ.. రిలీజ్ చేసిన పోస్టర్ నే మళ్లీ మళ్లీ రిలీజ్ చేస్తే... ఇలాగే ఉంటుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుకుంటుంది. నవంబర్ కి షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేస్తారని.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలాఖరున ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. ఈసారైనా పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు కాస్త ఆలోచించి.. కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle