newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

హిందీలో 'ఖైదీ' రీమేక్.. 'అజయ్ దేవగన్' కి జోడీగా రియల్ వైఫ్

19-10-202019-10-2020 18:20:22 IST
2020-10-19T12:50:22.920Z19-10-2020 2020-10-19T12:50:19.689Z - - 29-11-2020

హిందీలో 'ఖైదీ' రీమేక్.. 'అజయ్ దేవగన్' కి జోడీగా రియల్ వైఫ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక మూవీ హిట్ అయిందంటే ఆ మూవీకి సీక్వెల్ ని తీయడం మామూలే. తమిళంలో గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఖైదీ చిత్రం. ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ నటించాడు. ఖైదీలో కార్తీ అద్భుతమైన నటనతో అటు తమిళ..ఇటు తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుని ఆ పాత్రకి న్యాయం చేశాడనిపించుకున్నాడు. కాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వర్షన్ కు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.అయితే ఈ సినిమా కథ నేపథ్యంలో హీరోయిన్ ఎవరు లేరు. ఈ  సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉండవు. సాంగ్స్ అసలే లేవు అయినా కూడా సినిమా మంచి విజయం సాధించింది.

అదే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే మరింతగా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకునేది అంటూ అప్పట్లో కొందరు కామెంట్స్ చేశారు. అందుకే హిందీ ఖైదీ కి కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడిస్తున్నారట. తమిళ ఖైదీ స్క్రీప్ట్ లో పలు మార్పులు చేర్పులు చేసి కమర్షియల్ గా ఉండేలా చేశారట. హీరోగా నటించబోతున్న బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కోసం జోడీగా నటి..అజయ్ దేవగన్ భార్య  కాజోల్ ను ఎంపిక చేయడం జరిగిందట.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమాను డిసెంబర్ లో పట్టాలెక్కించి ఏకధాటిగా షూటింగ్ జరిపి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ చివరిలో  ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారట. కాజోల్ మరియు అజయ్ దేవగన్ ల కాంబోకు ఖచ్చితంగా మంచి మార్కులు పడుతాయనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. కాజల్ తమిళ..తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. కాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.., కాజోల్ జోడీ బాలీవుడ్ లో ఎప్పటికీ  హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle