newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

మా ఎన్నికల ఎఫెక్ట్.. శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు.. ఎవరిని ఉద్ద్యేశించో..?

14-10-202114-10-2021 07:33:09 IST
Updated On 14-10-2021 12:48:50 ISTUpdated On 14-10-20212021-10-14T02:03:09.812Z14-10-2021 2021-10-14T02:02:51.604Z - 2021-10-14T07:18:50.697Z - 14-10-2021

మా ఎన్నికల ఎఫెక్ట్.. శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు.. ఎవరిని ఉద్ద్యేశించో..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మా ఎన్నికలు ముగిసిన తర్వాత తామంతా ఏకతాటిపైకి వస్తామని, భుజం భుజం రాసుకుంటూ తిరుగుతామని సినీ పెద్దలు అన్న మాటలు నీటి మూటలే అయ్యాయి. మా లో ఎన్ని లుకలుకలు ఉన్నాయో మీడియా సాక్షిగా బయట పడుతున్నాయి. ‘మా’ ఫలితాలు వచ్చిన తరువాత అసలు ఆట మొదలైందంటూ కొత్త కొత్త ‘ఆత్మ’లు.. ఆత్మఘోషలు బయటకు వస్తున్నాయి. ప్రకాష్ ప్యానల్ మొత్తం.. గెలిచిన ఆయా పదవులకు రిజైన్ చేయగా.. అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణు ఆట మొదలుపెట్టేశారు. ఈ సినీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘మా’ మాజీ ప్రెసిడెంట్ శివాజీ రాజా సంచలన కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘ఇన్నేళ్లలో నేను ఎవరికీ భయపడలేదు.. ఎందుకంటే తప్పు చేసిన తప్పుడు నా కొడుకులు భయపడతారు.. నేను తప్పు చేయలేదు కాబట్టి భయపడను. నేను అందరూ బాగుండాలనే కోరుకుంటాను. శివాజీ రాజా అనేవాడు ఇప్పుడే కాదు.. ఎప్పుడూ భయపడడు.. ఆ తప్పుడు నా కొడుకులే భయపడతారు. కొన్ని దెబ్బలు తిన్నాక నేను ఈ మాట చెప్తున్నా.. నన్ను భయపెట్టే మగాడు తెలుగు ఇండస్ట్రీలో ఎవడూ లేడు. నేను షూటింగ్‌లకు లేటుగా వెళ్లను.. నాకు క్యారెక్టర్ వస్తే చేస్తా లేదంటే లేదు.. క్యారెక్టర్ ఇవ్వమని నేను ఒకడి దగ్గరకు పోను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే.. ఈ మాట ఒకడికి గట్టిగా తగలాలనే. వీడు నా గురించే అన్నాడని వాడికి తెలియాలి. వాడికి నేను డైరెక్ట్‌గానే చెప్పాను.. నీలాంటి బొగడా గాళ్లని చాలామందిని చూశా.. బ్యాగ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నావ్ రా అని వాడికి చెప్పా. నా దగ్గర పావలా లేనప్పుడు కూడా ఎవడి దగ్గరా చేయి చాపలేదు.. భయపడలేదు. ఈ బొకడా గాడికి భయ పడతానా? వాడేమంత గొప్పోడు కాదు.. కానీ నేను తిట్టానంటే నన్నే తిట్టాడని వాడు అనుకుంటాడు.. అందుకే చెప్తున్నా. ఇలాంటి వాళ్లని బోలెడు మందిని చూశా. ఇండస్ట్రీలో చాలా మంది వెధవలు పక్కపక్కనే ఉంటారు.. మనం ఓడిపోతే పక్కకు వెళ్లి డాన్స్‌లు చేసే వెధవలు కూడా ఉంటారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు శివాజీ రాజా. ఇంతకీ శివాజీ రాజా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు అని ఇండస్ట్రీలో ఎవరికి వారు ఎవరెవరినో ఊహించుకుంటున్నారు. ఏదేమైనా శివాజీ రాజా మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో వారికి మాత్రం సూటిగా గుచ్చుకున్నాయని టాలీవుడ్ టాక్. 

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

   an hour ago


వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

   5 hours ago


ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

   6 hours ago


ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్  ట్రైలర్ విడుదల

ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్ ట్రైలర్ విడుదల

   8 hours ago


ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

   8 hours ago


సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

   21 hours ago


ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

   06-12-2021


అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

   02-12-2021


నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

   01-12-2021


సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

   01-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle