అక్కినేని దసరాబుల్లోడుకి 50ఏళ్ళు..
13-01-202113-01-2021 17:26:00 IST
2021-01-13T11:56:00.892Z13-01-2021 2021-01-13T09:56:54.456Z - - 21-01-2021

దసరాబుల్లోడు ఇది అప్పట్లో ట్రెండ్ సృషించిన చిత్రమనే చెప్పాలి..ఈ చిత్రంలో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు..హీరోయిన్ గా వాణిశ్రీ నటించారు. ఈ చిత్రాన్ని జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ తెరకెక్కించారు. ఈ చిత్రం రిలీజ్ అయి నేటికి అంటే జనవరి 13కి 50ఏళ్లు పూర్తిచేసుకుంది. 1971వ సంవత్సరంలో రిలీజ్ అయిందీ మూవీ. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో తొలి స్వర్ణోత్సవం చిత్రం ఇది. కాగా ఈ మూవీ సంక్రాంతి పండుగకు సరికొత్త శోభని తీసుకొచ్చింది. ఈ సినిమా సంవత్సరం పాటు ప్రదర్శితమై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి మాటలు-పాటలు ఆచార్య ఆత్రేయ రాయగా, కేవీ మహదేవన్ స్వరకల్పన చేశారు. పాటలు సైతం శ్రోతలని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
30 కేంద్రాలలో విడుదలైన ఈ చిత్రం 29 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. అప్పట్లో ఓ ఊపు ఊపిన ఈ చిత్రం ఎన్నో చిత్రాలకు ఆదర్శంగా కూడా నిలిచింది. వి.బీ రాజేంద్రప్రసాద్ తొలిసారి ఏయన్నార్‌తో ఆరాధన అనే చిత్రం చేశారు. ఆ తరువాత ఏయన్నార్ తోనే "ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు, అక్కాచెల్లెలు" వంటి చిత్రాలను నిర్మించారు. అయితే ఏయన్నార్ ప్రోత్సాహంతో రాజేంద్రప్రసాద్ మెగా ఫోన్ పట్టుకోగా, దర్శకుడిగా దసరా బుల్లోడు అనే చిత్రం చేశారు. ఇది ఆయనకు తొలి చిత్రం అయినప్పటికీ ఎంతో పరిణితీతో ఈ సినిమాని రూపొందించారు.
గ్రామీణ వాతావరణంలో సాగే సంబరాలు, వరసైన వాళ్ళను ఆటపట్టించే బావలు, మరదళ్ళు, మావయ్యలను వేళాకోలం చేసే అల్లుళ్ళు ఇలా అనేక రకాల పాత్రలను సినిమాలో చూపించి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించారు. 'దసరాబుల్లోడు' చిత్రంలో ఏయన్నార్, వాణిశ్రీ, చంద్రకళ, ఎస్వీరంగారావు, గుమ్మడి, నాగభూషణం, అంజలీదేవి, సూర్యకాంతం, పద్మనాభం, రావి కొండలరావు, రాధాకుమారి తదితరులునటించారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు ఆచార్య ఆత్రేయ రాయగా, కేవీ మహదేవన్ స్వరకల్పన చేశారు. పాటలు సైతం శ్రోతలని ఎంతగానో ఆకట్టుకున్నాయి. 30 కేంద్రాలలో విడుదలైన ఈ చిత్రం 29 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. అప్పట్లో ఓ ఊపు ఊపిన ఈ చిత్రం ఎన్నో చిత్రాలకు ఆదర్శంగా కూడా నిలిచింది.

తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్
3 hours ago

ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్
4 hours ago

వదలం బొమ్మాళీ వదలం.. దండాలు పెట్టినా వదలం డ్రగ్స్ బేబీ
5 hours ago

అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్
16 hours ago

మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'
17 hours ago

నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న పిట్టకథలు టీజర్
15 hours ago

పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్
20 hours ago

'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ
19 hours ago

కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్
a day ago

తమన్ తానా తందానా.. కాపీ ఘాటు బానే తగిలినట్లుంది
a day ago
ఇంకా