బాలయ్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి
బాలయ్య అంటే అంతే. ఓకే అంటే ఓకే. కాదంటే కాదు. రెండో మాట ఉండదు. కానీ.. ఆయన గురించి తెలిసిందేగా. చిన్న పిల్లాడి కంటే.. మెత్తటి మనసు అంటారు కదా. అందుకే.. ఆయన్ని మాత్రం వదలడం లేదట.. ఓ హీరో. యంగ్ హీరోగా.. ఓ స్టార్ క్రేజ్ ఉన్న హీరోకి ఇప్పుడు బాలయ్య బాబుతో అవసరం వచ్చింది. తను చేస్తేనే ఆ పాత్రకి న్యాయం జరుగుతుందని తపన పడుతున్నాడట. బాలయ్య బాబే కావాలి అని.. డైరెక్టర్ కూడా పట్టు పట్టుకుని కూర్చున్నాడట.
ఇంతకీ ఎవరూ అనుకుంటున్నారా. చలో సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు కదా నాగశౌర్య. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ మాస్ హీరో కావాలని ట్రై చేస్తున్నాడు శౌర్య. ఆల్రెడీ అరడజను సినిమాలు రెడీగా ఉన్నాయి. నడుస్తున్నాయి కూడా. ఇదే టైంలో.. ఓ యంగ్ క్రియేటర్ వచ్చి.. ఓ స్టోరీ చెప్పాడట. అంతే.. నేన్ రెడీ అనేశాడట. కానీ.. అందులో ఉన్న ఓ బలమైన పాత్రకి.. బాలయ్య బాబే కావాలి అని డైరెక్టర్, శౌర్య అనుకుంటున్నారట. ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ వెంటనే నేను కలిసొస్తా అన్నారట. స్టోరీ విన్న బాలయ్య బాబు.. వాహ్.. సూపర్ ఉంది అన్నాడట. సరే సార్.. మరి డేట్స్ ఎప్పుడిస్తారు ఏం కతా అంటే మాత్రం.. ఏం మాట్లాడలేదట. కథ నచ్చింది అన్నాడు కానీ.. యాక్టింగ్ చేయడానికి మాత్రం ఓకే చెప్పలేదట.
బాలయ్య, బోయపాటి సినిమాకి భారీ డిమాండ్.. కోట్లకి కోట్లు
ఇక మూవీ టీమ్ ఆగుతుందా చెప్పండి.. పదండి నాగార్జున గారి దగ్గరికి వెళ్దాం అని.. హీరో, నిర్మాత ఇద్దరూ వెళ్లారట. నాగ్ కూడా కథ విని.. బావుంది అని.. నేను కాస్త బిజీగా ఉన్నా కదా.. సినిమాలు ఉన్నయ్.. బిగ్ బాస్ ఉంది. నేను ఇప్పుడు చేయలేనులే అన్నాడట నాగ్. ఇంకేం చేస్తారు చెప్పండి. బండి మళ్లీ బాలక్రిష్ణ దగ్గరికి తిరిగింది. సార్ ప్లీజ్ ఒప్పుకోండి అంటూ.. రిక్వస్టులు చేస్తున్నారట మూవీ టీమ్ వాళ్లు. బాలయ్య నుంచి మాత్రం రెస్పాన్స్ రావడం లేదట. సో.. బాలయ్య ఓకే చేస్తే.. నాగశౌర్య సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. మరి బాలయ్య బాబు ఏమంటారా అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది.
హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యారవ్యాన్ లో ఏం జరుగుతోంది
వింటానికి విడ్డూరంగా ఉంది అనే వాళ్లు ఉంటారు. ఇందులో ఏముందిలే.. ఇది కామనే కదా అనే వాళ్లూ ఉంటారు. ఇలాంటివి పట్టించుకుంటే ఎట్టా చెప్పండి అనే వాళ్లూ ఉంటారు. కానీ.. గుస గుసలు ఆగుతాయా చెప్పండి.
ఓ స్టార్ హీరో.. ఏజ్ 50. అంటే.. ఓ రేంజ్ ఉంటుంది. అఫ్ కోర్స్ క్యారవ్యాన్ కూడా ఉంటుంది. మరి ఆ సినిమాకి హీరోయిన్.. ఏజ్ 20. అంటే ఆమెకీ క్యారవ్యాన్ ఉంటుంది కదా. షూటింగుల్లో బిజీ బిజీ అయిపోతుంటారు. తప్పేముంది. కష్టపడితేనే కదా ఫలితం దక్కుతుంది. ఎండని కూడా లెక్క చేయకుండా పని చేయాలి. పొద్దంతా సెట్ లో ఉండాలి. తప్పేముంది.. తప్పేదేముంది. కానీ.. గ్యాప్ లు దొరుకుతుంటాయి కదా.. ఆ టైంలో మాత్రం క్యారవ్యానుల్లో దూరి పోతున్నారట హీరో హీరోయిన్లు. సరే.. చెరో క్యారవ్యాన్ ఉంది.. షాట్ గ్యాపుల్లో క్యారవ్యాన్ లలో దూరి పోతారు. అందుకే కదా.. వారికి క్యారవ్యాన్ లు పెట్టింది అనుకుంటాం అంతా.
కానీ.. ఇక్కడే మెలిక ఉంది. వారిద్దరూ చెరొక క్యారవ్యాన్ లో దూరితే.. ఎవరికీ ఏ గోలా ఉండదు. కానీ.. ఒకే క్యారవ్యాన్ లో దూరిపోతున్నారట. అదీ మేటర్. మరి ఇద్దరూ ఒకే క్యారవ్యాన్ లో దూరితే.. బయట ఉన్న జనాల పరిస్థితి ఏంటి చెప్పండి. అసలు అందరూ ఉండే పబ్బుల్లోకి వెళ్తేనే వంద అనుకుంటున్నారు. ఇక క్యారవ్యానుల్లో మీటింగులు చాటింగులు అంటే ఏమనుకుంటారు చెప్పండి. ఆ హీరోకి మంచి పేరుంది. అలాంటి వారు కదా అనే టాక్ ఉంది. కానీ.. ఏం చేస్తున్నారబ్బా అంటూ డిస్కషన్లు.
అన్నకి వ్యతిరేకంగా తమ్ముడు..
ఏమోలే.. నెక్స్ట్ సీన్ ఎలా చేద్దాం.. కెమెస్ట్రీ ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారేమో.. సారు వారు సీనియర్ కదా.. జూనియర్ పాపకి.. పాటాలు ఏమైనా చెబుతున్నారేమో.. ఎలా చేయాలి.. ఎలా ఉండాలి.. ఎలా ఉంటే కంఫర్ట్ గా ఉంటుంది.. ఎలా ఉంటే క్రేజ్ వస్తుంది.. ఎలా ఉంటే ఫేమ్ వస్తుంది అని లెక్చర్లు ఇస్తున్నారేమో అంటూ.. అబ్బో.. ఇక గుస గుసలకి అడ్డూ అదుపూ ఏం ఉంటుంది చెప్పండి. ఆ హీరోగారి కెరీర్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. బుద్ధిమంతుడిలాగే ఉన్నారు కాబట్టి.. పెద్దగా అనలేక పోతున్నారట. సారేమో.. ఏంటి మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వరా.. ఏది పడితే అది ఎందుకు అనుకుంటున్నారు.. గప్ చుప్ గా ఉండండి అని.. అందరికీ సైలెంట్ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారట. అదండీ మేటర్.. పేర్లు.. డీటెయిల్స్ కాస్త బయటికి వస్తే..ఇంకాస్త ఘాటుగా ఉంటుంది ఎవ్వారం.
పవన్ సినిమా అయితే.. అంత చిన్న పాత్ర చేయాలా..?
ఎవరైతే ఏంటి. నేనంటూ హీరోయిన్ ని అని గుర్తుందా. నా రేంజ్ ఏంటో తెలుసా. ఏదో పవన్ కల్యాణ్ సినిమా అయినంత మాత్రాన.. చిన్న చిన్న పాత్రలు చేస్తానా. నేను ఏ రేంజ్ పర్ఫార్మర్ నో తెలుసు కదా. నా పర్ఫార్మెన్స్ తోనే సినిమాలు రికార్డులు కొడుతున్నయ్. నేనుంటే చాలు.. ఎంత స్టార్ హీరో సినిమాకి రాని క్రేజ్ వస్తుంది. నేను డాన్స్ చేస్తే.. కొరియోగ్రాఫర్లు కూడా ఫిదా అవుతుంటారు. అలాంటిది ఓ చిన్న పాత్ర చేయాలా. పవన్ కల్యాణ్ అయినంత మాత్రాన.. ఎలా ఒప్పుకుంటా అని అనుకుంటున్నారు.
ఇవండీ సాయి పల్లవి మాటలు. ఇంత రేంజ్ లో అన్నదా.. అసలు పవన్ కల్యాణ్ గురించి ఆమె అలా కామెంట్స్ చేస్తుందా అనేది వేరే పాయింట్. టాలీవుడ్ లో మాత్రం ఇలాంటి మాటలు తిరుగుతున్నయ్. యాక్చువల్ గా అయితే.. సాయి పల్లవి ఇలా అనదు. ఎందుకంటే.. ఆమె చాలా డీసెంట్. అడిగారు.. నచ్చలేదు.. దట్సిట్ అంటుంది. పైగా పవన్ కల్యాణ్ సినిమా అంటే.. ఇంట్రస్టింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ భార్యగా నటించే ఛాన్స్ దొరికితే సాయి పల్లవి మాత్రం ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. పైగా అయ్యప్పనుమో కోషియమ్ మూవీ రీమేక్ లో పవన్ వైఫ్ గా అంటే.. అస్సలు ఛాన్సే లేదు. ఆ పాత్రలో ఎంత పవర్ ఉంటుందో తెలుసు కదా.
పాత్ర చిన్నదే అయినా.. ఒక ఉద్యయకారిణి పాత్ర.. నాలుగైదు సీన్లే ఉన్నా.. ఓ రేంజ్ ఉంటుంది. ఆమె పాత్రలో కూడా పవర్ ఉంటుంది. సో.. అలాంటి పాత్రల్ని వదులుకునే ఛాన్సే లేదు. కాకపోతే.. పాత్ర మరీ చిన్నది అనే ఫీలింగ్ లో మాత్రం ఉందంట సాయి పల్లవి. పైగా డేట్స్ కూడా దొరకడం లేదట. లేదంటే.. విరాట పర్వం కూడా నక్సలైట్ బ్యాగ్రౌండ్ మూవీనే కదా.. అందుకే.. మళ్లీ అలాంటి ఫీల్ ఉన్న పాత్రలో ఏం చేస్తాం లే అనుకుంది కావచ్చు. లేదంటే.. నిజంగానే డేట్స్ అడ్జస్ట్ కావడం లేదేమో. అయినా.. అయ్యప్పనుమ్ కోషియమ్ పాత్ర కోసం సాయి పల్లవిని ఆ మూవీ టీమ్ ఎప్పటి నుంచో రిక్వస్ట్ చేస్తోంది. ఆ చిన్న పాత్రకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోతుందా.. ఓ నాల్రోజులు డేట్స్ సర్దుబాటు చేస్తానంటే.. అదీ కాక పవన్ సినిమాకి డేట్స్ సర్దుకుంటా అంటే.. ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి.. అవతల మూవీ వాళ్లు కూడా అడ్జస్ట్ అవుతారు కదా. బట్.. ఏవేవో అంటున్నారు.
సన్నీలియోన్ కి మళ్లీ పెళ్లి.. గుంటూరు కుర్రాడు
హాట్ బేబీ సన్నీలియోన్ మళ్లీ పెళ్లికి రెడీ అవుతుంది అంటే ఉత్తి ముచ్చట్నా చెప్పండి. పైగా తనే పెళ్లికి రెడీ అంటే మామూలు మేటరా చెప్పండి. పోర్న్ స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్న.. లక్షల మంది కుర్రాళ్లు.. బిజినెస్ మేన్ లు.. స్టార్లు అంతా రెడీ అవుతుంటారు. ఓ లక్ష మంది అయినా.. మనస్పూర్తిగా మేం రెడీ అంటారు. ఎందుకంటే.. సన్నీ లియోన్ అంత మంచిది. అంత డిగ్నిటీ మేన్ టేన్ చేస్తుంది. భర్త పట్ల అంత ప్రేమగా ఉంటుంది. మనం నమ్మే భారతీయ స్త్రీలకి ఏ మాత్రం తగ్గకుండా బతుకుతుంది. అఫ్ కోర్స్ తను గతంలో పోర్న్ సినిమాలు తీసింది. అది ఆమె ప్రొఫెషన్.. అంతే కానీ.. సాటు సాటుగా మొగుడికి తెలియకుండా.. మూన్నాలుగు అఫైర్లు మేన్ టేన్ చేసే టైప్ కాదు. తన ప్రొఫెషన్ లో తాను బతికింది. తర్వాత వదిలేసి.. సినిమాలు చేసుకుంటోంది. ఇప్పుడు ఉన్నత విలువలు ఉన్న స్త్రీగా బతుకుతోంది.
మరి అలాంటి సన్నీలియోన్ పెళ్లికి రెడీ అవుతుంది అంటే ఊరికే ఉంటారా జనాలు. పైగా నన్ను పెళ్లి చేసుకుంటారా అంటూ పోస్ట్ కూడా పెట్టేసింది. వెడ్డింగ్ డ్రెస్ కూడా డిజైన్ చేయించుకుని రెడీగా ఉంది. మరి ఊరుకుంటారా. ఎగబడుతున్నారు అంటే నమ్మండి. అదేంటీ.. విడాకులిచ్చేస్తున్నవా నీ మొగుడికి.. ఆల్రెడీ ఇచ్చేశావా.. అప్రూవల్ అయ్యాయా అంటూ అడిగేవారూ ఉంటారు. కానీ.. తను మాత్రం రియల్ గా అనలేదు. జస్ట్ ఫన్నీగా అనేసింది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టేసింది. తనేం చీట్ చేయలేదు. జస్ట్ తను సరదాగా అన్న విషయం తెలిసేలాగే అనేసింది. ఏదో వెడ్డింగ్ డ్రెస్ తీసుకొచ్చి ఉంటారు.. డిజైనర్లు. ప్రమోషన్ గట్రా చేయమన్నారో.. ఏదైనా షూట్ కి సంబంధించిన డ్రస్సో కానీ.. అమృతం తాగిన దేవ కన్య లా ఉంది. వైట్ డ్రెస్ లో దేవతల్ని తలపించింది. మరి అందాల దేవత అలా ఉంటే ఆగుతారా చెప్పండి. గుంటూరు కుర్రాడు నేన్ రెడీ అంటూ.. రిప్లై ఇచ్చాడు. ముందు ఇండియాకి రా.. తర్వాత ఆంధ్రప్రదేశ్ రా.. అక్కడి నుంచి మా గుంటూరు కి వచ్చేయ్.. పెళ్లి చేసుకుందాం అన్నాడు. అంతే.. తను ఆ స్క్రీన్ షాట్ పెట్టేసింది. ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా. అందరూ మేం రెడీ మేం రెడీ అంటున్నారు. అదీ.. సన్నీ ఫన్నీ కహానీ.
కంగనాకు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిత్యం వివాదాలతో సావాసం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఆమె చేసిన వ్యాఖ్యలకు పెద్ద దుమారమే రేగింది. పలు కేసులు కోర్టుల్లో ఉన్నాయి. ముంబై కోర్టు మార్చి 1న ఆమెపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సినీ రచయిత జావెద్ అఖ్తర్ కొన్ని నెలల క్రితం కంగనపై పరువునష్టం దావా వేశారు. గత నెల 1న ఈ కేసును అంధేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారించింది. మార్చి 1వ తేదీలోగా తమ ముందు హాజరు కావాలంటూ కంగనను కోర్టు ఆదేశించింది. కోర్టు ఇచ్చిన గడువు ముగిసినా.. కోర్టుకు కంగన హాజరు కాలేదు. ఈ చర్యను కోర్టు ధిక్కరణగా భావించిన న్యాయస్థానం కంగనకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. కంగనకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంపై ఆమె లాయర్ రిజ్వాన్ సిద్ధికీ స్పందించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలను బాంబే హైకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో జావెద్ అఖ్తర్ తరపు లాయర్ స్పందిస్తూ పైకోర్టుకు వెళ్లినప్పటికీ కోర్టు ముందు హాజరు కావడం నుంచి కంగన తప్పించుకోలేరని అన్నారు. కాబట్టి కంగనా కోర్టుకు హాజరు కావాల్సిందేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈమెయిల్స్ వేధింపుల విషయంలో కంగనపై కేసు నమోదు చేసిన హృతిక్ రోషన్.. తాజాగా ఈ కేసుకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు. పోలీసులు హృతిక్ రోషన్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. తన పేరుతో నకిలీ ఈమెయిల్ ద్వారా వందలాది మెయిల్స్‌ను పంపుతున్నారని, తనను విపరీతంగా వేధింపులకు గురి చేస్తున్నారని హృతిక్ రోషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కంగన పాత్ర ఉందంటూ హృతిక్ తన ఫిర్యాదులో ఆరోపించారు. దాంతో పోలీసులు కంగనాపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో స్టేట్మెంట్ రికార్డ్ కోసం కమిషనర్ కార్యాలయానికి రావాల్సిందిగా హృతిక్ రోషన్‌కు పోలీసులు నోటీసులు పంపారు. ఆ నోటీసులను అందుకున్న హృతిక్ ఇటీవలే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసు కమిషనర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి.. తన స్టేట్మెంట్ను ఇచ్చారు.
నెట్ ఫ్లిక్స్ కి నాగ్ షాక్..అంత నమ్మకం ఏంటి..డేర్ స్టెప్ ఏంటి
సినిమా ఇండస్ట్రీలో నాగార్జున లెక్క వేరే. మొదట్లో అంటే కేవలం హీరోగానే ఉన్నా.. తర్వాత మాత్రం బిజినెస్ మేన్ అయిపోయాడు. సినిమాలు చేస్తూనే.. తీస్తూ ఉంటాడు నాగార్జున. అన్న పూర్ణ స్టూడియోస్ తో పాటు.. ఎన్నో బిజినెస్ లలో ఉంటాడు. తనకి అలా కుదిరింది. ఇప్పుడు కూడా అంతే.. సినిమా హీరోగానే కాక.. మంచి బిజినెస్ మేన్ గా లెక్కలేసి.. నెట్ ఫ్లిక్స్ కే షాక్ ఇచ్చాడు. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీల్లో ఇదో హాట్ టాపిక్ అయింది.
ఎప్పుడూ ఒకేలా ఉండడం నాగ్ కి వీలు కాదు. కాస్త కొత్తగా థింక్ చేస్తాడు. అందుకే.. వైల్డ్ డాగ్ అనే మూవీ చేశాడు. గతంలో కూడా చాలా సినిమాలే ఉన్నయ్. ఇదే దారిలో.. గగనం కూడా సూపర్ హిట్ అయింది. ఇక వైల్డ్ డాగ్ మూవీపై కూడా నాగ్ చాలా అంచనాలు పెట్టుకున్నాడట. కానీ.. ప్రొడ్యూసర్లేమో.. ముందుగానే నెట్ ఫ్లిక్స్ తో బేరం కుదుర్చుకున్నారు. థియేటర్స్ లోకి రాకుండా.. నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసుకునే ప్లాన్ చేసుకున్నారు. కానీ.. ఫస్ట్ కాపీ చూసే దాకా.. నాగ్ కూడా సైలెంట్ గానే ఉన్నాడట. తర్వాత అక్కడికక్కడే.. నెట్ ఫ్లిక్స్ తో ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడట. మనం సినిమాని నెట్ ఫ్లిక్స్ లో కాదు.. థియేటర్స్ లో రిలీజ్ చేయాల్సిందే అని డిసైడ్ అయ్యాడట. ఇక ప్రొడ్యూసర్లు కూడా నాగ్ మాటని నమ్మి.. థియేటర్స్ లో రిలీజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి.. నెట్ ఫ్లిక్స్ తో అగ్రిమెంట్ బ్రేక్ చేసుకున్నారు.
మరి ముందే అగ్రిమెంట్ చేసుకుని.. నెట్ ఫ్లిక్స్ ఎలా క్యాన్సిల్ చేసుకుంటుంది అంటే.. ఆ లెక్కలు వేరే ఉంటయ్. మరి అగ్రిమెంట్ ఎలా ఉంది అనేదీ... నాగ్ కి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పవర్ లాంటివి ఎఫెక్ట్ చూపిస్తాయి కదా. ఏమోలే క్యాన్సిల్ చేసుకుందాం అంటున్నారు కదా.. అలాగే కానివ్వండిలే అన్నారు కావచ్చు. లేదంటే.. అగ్రిమెంటే ఏదీ డిసైడ్ కాకుండా ఉంది కావచ్చు. మొత్తానికైతే.. వైల్డ్ డాగ్ మూవీని.. నెట్ ఫ్లిక్స్ బడా ఆఫర్ ని బ్రేక్ చేసుకుని మరీ.. థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
అన్నకి వ్యతిరేకంగా తమ్ముడు
అన్నా దమ్ముళ్లు అంటే ఆ అనుబంధం వేరు. చిన్నప్పటి నుంచీ ఇద్దరూ కలిసే తిరుగుతారు. కలిసే పెరుగుతారు. హీరోలు విజయ్ దేవరకొండ.. తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అంతే. ఒక్కోసారి.. నా తమ్ముడే నన్ను ఆదుకున్నాడు అంటే.. ఆనంద్ దేవరకొండ గురించి ఎంతో ఆనందంగా చెప్పాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ హీరోగా ట్రయల్స్ వేసే టైంలో.. జాబ్ చేస్తూ అన్నని సపోర్ట్ చేశాడట ఆనంద్ దేవరకొండ. వీళ్లు కూడా అందరు అన్న దమ్ముల్లాగే పెరిగిన వాళ్లే. అన్నదమ్ములు అంటే.. ఆటేస్టులు అవీ ఒకేలా ఉంటుంటాయి కదా మామూలుగా. చిన్నప్పుడు ఒకే రంగు చొక్కాలు వేయడం చూస్తుంటాం. కానీ..పెద్దయ్యాక మాత్రం.. చిన్నప్పటిలా ఒకే మోడల్ చొక్కలు వేయడం లేదు.
అన్న దేవర కొండ స్టైల్ తెలిసిందే కదా. వాట్సాప్ వాట్సాప్ రౌడీస్ అనుకుంటూ వెరైటీ డ్రస్సింగ్ వేస్తుంటాడు. ఎక్కడా కనిపించని మోడల్స్ కోసం.. తనే డిజైనింగ్ మొదలు పెట్టాడు. రౌడీ బ్రాండ్ తో.. డ్రస్సులు డిజైన్ లు చేయించుకుంటున్నాడు. కానీ..తమ్ముడు ఆనంద్ దేవరకొండ అలా కాదు. కొత్త డిజైన్ లు ఎందుకు.. అసలు ఇప్పటి మోడ్రన్ స్టైల్ ఎందుకు అంటూ.. ఓల్డ్ స్టైల్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. దొరసానిలో అంతే.. మిడిల్ క్లాస్ మెలొడీస్ లో అంతే.. ఇప్పుడు పుష్పక విమానంలో కూడా అంతే. అన్న స్టైల్ వేరు.. అగ్రెసివ్. తమ్ముడి స్టైల్ వేరు.. చాలా సింపుల్ అండ్ కామ్. కేవలం డ్రస్సింగ్, బిహేవియరే కాదు.. సినిమాలు కూడా అంతే. అన్న అల్ట్రామోడ్రన్ స్టోరీస్ చూజ్ చేసుకుంటుంటే.. తమ్ముడు మాత్రం సింపుల్ ఫ్యామిలీ టైప్ గా వెళ్తున్నాడు. అన్న ఎక్కడా లేని కొత్త దనం కోరుకుంటుంటే.. తమ్ముడు మాత్రం.. ఉన్న దాంట్లోనే కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతన్నా.. అన్న దమ్ములు ఇద్దరూ కొత్తదనం కోసం ట్రై చేస్తూ.. వేరే వేరే దారుల్లో కలిసి ప్రయాణిస్తున్నారు.
ప్రభాస్ 'సలార్' రిలీజ్ డేట్ ఫిక్స్
కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా 'సలార్'. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ తాజాగా వచ్చింది. 2022 ఏప్రిల్ 14న సాలార్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. కన్నడ యాక్టర్ మధు గురుస్వామి విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల కొద్ది రోజుల పాటు తెలంగాణలోని రామగుండం బొగ్గు గనల్లో ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు.
'రాధే శ్యామ్' విడుదల తేదీని ప్రకటించిన ప్రభాస్.. తాజాగా ఆయన నటిస్తున్న 'సలార్' సినిమా థియేట్రికల్ రిలీజ్ తేదీని ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టుగా చిత్రబృందం తెలిపింది. అన్నట్లుగానే చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ( 14-04-2022) విడుదల కానుంది.
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బొగ్గుగనుల్లో పనిచేసే యువకుడి పోరాటమే 'సలార్' చిత్ర కథాంశం అని ప్రచారం జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆలిండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడం, కేజీఎఫ్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ భారీ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో... ఈ కాంబోలో వస్తున్న 'సలార్' పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్-2 కూడా భారీ హిట్ అవ్వబోతోందనే కాన్ఫిడెన్స్ అందరిలోనూ ఉన్నాయి.. ఇక ఆ తర్వాత రాబోయే సినిమా సలార్ కావడంతో ఇక అంచనాలు ఆకాశాన్ని తాకబోతున్నాయి. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ కూడా ఈ ఏడాది విడుదల కాబోతోంది. ఈ సినిమా మీద కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభాస్ సినిమాలు సినిమా ప్రియులకు ఫుల్ మీల్స్ అందించనున్నాయి. రాధే శ్యామ్ పీరియాడిక్ లవ్ స్టోరీ కాగా.. సలార్ పక్కా మాస్ కమర్షియల్ సినిమా..!
ప్లే బ్యాక్ మూవీలో ఏదో ఉన్నట్లుందే
అవును. అదే కనిపిస్తోంది. ప్లే బ్యాక్ అంటూ.. సింపుల్ గా పాస్ట్ లోకి తీసుకెళ్తోంది ప్లే బ్యాక్ మూవీ. పాస్ట్ లోకి తీసుకెళ్లడం అనేది చాలా రెగ్యులర్. అన్ని సినిమాల్లో చూసేదే. కానీ.. ఇక్కడ ప్రజెంట్ కూడా ఉంటోంది. అలా కూడా రెగ్యులరే కదా.. స్క్రీన్ ప్లేలో.. పాస్ట్ ని కాసేపు.. ప్రజెంట్ ని కాసేపు చూపిస్తూ నాన్ లీనియర్ గా చెప్పడం.. రెగ్యులర్ సినిమాల్లో చూసేదే అనుకుంటారా. అయితే.. ప్లే బ్యాక్ మూవీలో అలా కాదు. ప్రజెంట్ నీ.. పాస్ట్ నీ మిక్స్ చేస్తున్నారు. అదే ఇక్కడ సమ్ థింగ్ ఇంట్రస్టింగ్ పాయింట్. దేవ లోకాన్నీ, భూ లోకాన్నీ మిక్స్ చేసే సినిమాల్ని చూశాం.. ఒక్కసారిగా పాత రోజుల్లోకి వెళ్లిపోయే టైం ట్రావెల్ మూవీస్ ని చూశాం. కానీ.. రెండు కాలాల్నీ మిక్స్ చేసి.. ఒకేసారి చూపించే సినిమా మాత్రం మనకి కొత్తే. హాలీవుడ్ సైడ్ ఉంటే ఉండే ఉండొచ్చు కానీ.. ఇండియన్ మూవీస్ లో మాత్రం చాలా కొత్తగా ట్రై చేస్తున్నాడు.. డైరెక్టర్ హరిప్రసాద్ జక్కా.
సుకుమార్ ఫ్రెండ్ గా పేరున్న హరిప్రసాద్ జక్కా.. తనతో పాటు కలిసి వర్క్ చేశాడు. వన్ నేనొక్కడినే లాంటి.. కన్ ఫ్యూజ్డ్ బెస్ట్ స్క్రీన్ ప్లే స్టోరీ రైటర్.. హరిప్రసాద్ జక్కానే. తన పెన్ను ఎప్పుడూ.. ఒంకరి టింకరగానే తిరుగుతుంది. అలా స్క్రీన్ ప్లేని రన్ చేస్తూ.. లాస్ట్ లో కంప్లీట్ క్లారిటీస్ ఇవ్వడం తనకిష్టం. ఇక సుకుమార్ ఫ్రెండ్ అంటే ఆ మాత్రం తిక్క ఉంటుంది కదా. హరిప్రసాద్ జక్కా రైటింగ్ లో కూడా అదే తిక్క కనిపిస్తుంది. ఆ విషయం.. ప్లే బ్యాక్ టీజర్లు ట్రైలర్లు చూస్తే అర్దం అవుతూనే ఉంది కదా. పాస్ట్ ని ప్రజెంట్ ని మిక్స్ చేస్తూ.. ఏదో సోది డ్రామా కొట్టడం అంటే.. పెద్ద కష్టం ఏమీ కాకపోవచ్చు. ఇక్కడ ఆ విషయంలో కూడా రిస్క్ చేస్తున్నాడు హరిప్రసాద్. మాంచి క్రైమ్ థ్రిల్లర్ ట్రై చేస్తున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ ఫుల్ గా కనిపిస్తోంది. ఓ ఫోన్ లింకప్ తో.. రెండు కాలాల్నీ కలుపుతూ.. మర్డర్ మిస్టరీని చేధించే ప్లానేదో చేస్తున్నాడు. ట్రైలర్ స్పీడ్ చూస్తుంటే... మాంచి యాక్షన్ థ్రిల్లర్ చూసిన ఫీల్ కనిపిస్తోంది.
నిన్ననే రిలీజ్ అయిన ట్రైలర్ కి మొదట్లో పెద్దగా రెస్పాన్స్ లేకున్నా.. ఇప్పుడిప్పుడే స్పీడ్ పెరిగింది. పెద్దగా పేరున్న ఆర్టిస్టులు కాకపోవడం.. పేరున్న డైరెక్టర్ కాకపోవడంతో... ఇమీడియట్ బజ్ రాలేదు. బట్.. కంటెంట్ మేటర్స్ అంటారు కదా. ఇప్పుడు ప్లే బ్యాక్ రెస్పాన్స్ చూస్తే అదే కనిపిస్తోంది. మూవీ లవర్స్ మొత్తం ఇంట్రస్టింగ్ మ్యాన్ అంటూ.. షేర్లు చేసుకుంటున్నారు. కంటెంట్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులు వచ్చాయి కదా.. ఈ టైంలో ప్లే బ్యాక్ కి మంచి రెస్పాన్స్ రావడం గ్యారంటీ. టీజర్, ట్రైలర్ లలో ఉన్న స్పీడ్ అలాగే ఉండి.. రెండు కాలాల్నీ మిక్స్ చేసే ప్రాసెస్ లో కిచిడీగానీ కాకుంటే.. మాంచి కిక్కిచ్చే ట్రీట్ దొరకొచ్చు.
తాగేసి యాక్సిడెంట్లు.. కెరీర్ కి హెల్ప్ అవుతుందా
అవును. ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ అంటే కాస్త డిఫరెంట్. ఎప్పుడు ఎలా క్రేజ్ వస్తుందో ఎవరికీ తెలీదు. ఆ మధ్య ఓ యంగ్ స్టర్ ఎవరికీ తెలీడు. తప్పతాగి.. రోడ్డు మీద పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు. గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా.. రాదు.. రాదు రాదు అంటూ ట్రోల్ అయ్యాడు. అందరూ రాదూ రాదూ అంటూ.. ట్రోలింగ్ చేశారు. ఇంకోచోట మచ్చా అనే ఇంకో తాగుబోతు ఫేమస్ అయ్యాడు. సినిమా ఆఫర్లు.. ప్రోగ్రామ్స్ ఆఫర్లు వస్తూ ఉంటయ్. తాగి వాగడమో.. ఇంకో రకంగానో కాస్త ఫేమస్ అయిపోతుంటారు. ఎంత గలీజ్ గా హైలైట్ అయినా సరే.. టీవీ ప్రోగ్రామ్స్ వాళ్లు వాళ్ల క్రేజ్ ని వాడేసుకుంటారు. సినిమాల వాళ్లు కూడా లాగేసుకుంటారు.
కానీ.. ఇప్పుడు షణ్ముక్ జస్వంత్ ఎవ్వారం వేరు. షణ్ముక్ అంటే యూ ట్యూబ్ స్టార్. దీప్తీ సునయనా జోడీగా ఫుల్ ఫేమస్ అయ్యాడు. తర్వాత కూడా వేరే అమ్మాయిలతో సాంగ్స్ చేస్తూ.. ఇంకాస్త పాపులర్ అయ్యాడు. ఈ మధ్య వెబ్ సిరీస్ లతో ఇంకాస్త ఫేమస్ అయ్యాడు. అరె ఏంట్రా ఇది అంటూ.. ఫుల్లు ట్రోలింగ్ లు. ఇప్పుడు కూడా అరె ఏంట్రా ఇది అంటూ.. అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ సారువాడు.. ఫుల్లుగా తాగేసి.. రెండు మూడు కార్లకి యాక్సిడెంట్ చేసి.. ఇంకో బండికి కూడా డ్యాష్ ఇచ్చాడు. జనాలకి దెబ్బలు కూడా తగిలాయి. పట్టుకున్న పోలీసులు.. లోపలేశారు. ఆ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
యాక్చువల్ గా అయితే.. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా షణ్ముక్ కెరీర్ స్వింగులో ఉంది. ఇప్పుడే మెల్లి మెల్లిగా యూ ట్యూబ్ నుంచి టీవీల్లో కనిపిస్తున్నాడు. అదో ఇదో ప్రోగ్రామ్స్ లో మెరుస్తున్నాడు. త్వరలో బిగ్ బాస్ లో కూడా కనిపిస్తాడు అని టాక్ ఉంది. ఈ టైంలో.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాక్సిడెంట్ చేశాడు. ఈ కేసు.. షణ్ముక్ కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుందా లేదా అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది. ఆ మధ్య యాంకర్ ప్రదీప్ కూడా ఇలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. కాకపోతే.. తను యాక్సిడెంట్ చేయలేదు కాబట్టి.. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మరి షణ్ముక్ పరిస్థితి ఏంటి. కోర్టులకి గట్రా తిరగాల్సి వస్తే.. బిగ్ బాస్ హౌజ్ లో మూడు నెలలు ఉండగలడా లేదా అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది. ఎందుకంటే.. ఐదో సీజన్ అతి త్వరలోనే స్టార్ట్ అవుతుందనే టాక్ ఉంది కదా.
సుకుమార్ కి ఉప్పెనలా వచ్చిన 20 కోట్లు
అవును. ఉప్పెన ఏంటో కానీ.. తెలుగు ఇండస్ట్రీలో ఓ ఉప్పెన క్రియేట్ చేస్తుంది. మామూలు టాక్ రాలేదు. ఎవరికీ నెగటివ్ మార్కులు పడలేదు. మెగా హీరోల్లో ఎంట్రీతోనే ఇంత పేరు తెచ్చుకున్న హీరో అంటై.. వైష్ణవ్ తేజ్ తర్వాతనే ఎవరైనా. సో.. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ చూశారు. మిగతా వాళ్లు కూడా సినిమా లవర్స్ అంతా చూసేసినట్లే.. వాళ్ల రివ్యూలతో మిగతా వాళ్లు కూడా ఇంట్రస్టింగ్ గా మూవీ చూస్తున్నారు.
సో.. ఎక్కడా తగ్గడం లేదు. ఆల్రెడీ.. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు.. మళ్లోసారి రెమ్యునరేషన్లు ఇచ్చారు. ముందే చేసుకున్న అగ్రిమెంట్లు కాకుండా ఎక్స్ ట్రా గా కూడా భారీ రెమ్యునరేషన్ ఇచ్చారంటే ఆలోచించండి ఎత లాభాల్లో ఉందో ఉప్పెన. ఇదంతా ఒక ఎత్తైతే.. ఉప్పెన కోసం.. సుకుమార్ ఎంత కష్టపడుతున్నాడో చూస్తూనే ఉన్నాం కదా. తన శిష్యుడ్ని డైరెక్టర్ గా చేయడం కోసం.. సుకుమార్ ఎక్కని మెట్టు లేదు దిగని మెట్టులేదు. విజయ్ సేతుపతి లాంటి వాళ్లతో కూడా తనే మాట్లాడి.. బతిమాలి.. కోప్పడి ఒప్పించాను అంటున్నాడు కదా. అంత కష్టపడ్డాడు సుకుమార్. అర్రే.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కోసం.. ఒక డైరెక్టర్ ఎంత కష్టపడుతున్నాడో కదా అనుకుంటున్నాం. సరే అదంతా నిజమే. కాకపోతే.. ఇక్కడ సొంత లాభం కూడా బానే ఉంది.
సొంత లాభాం బానే ఉండడం కాదు.. చాలా బావుంది. ఎందుకంటే.. సుకుమార్ కి ఈ మూవీ లాభాల్లో 50 శాతం వాటా ఉందంట. ఇప్పటికే 50 కోట్లు వచ్చాయట మూవీకి. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి పెట్టుబడులు పెట్టిన సుకుమార్.. వచ్చిన 40 కోట్ల లాభంలో.. 20 కోట్ల లాభం తీసుకోబోతున్నాడట. అంటే.. సగం లాభం సుకుమార్ సొంతమే కదా. మామూలుగా సుకుమార్ ఓ సినిమా చేస్తే.. 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్ ఉంది. ఆ లెక్కన తన శిష్యుడి సినిమాకి కూడా సుకుమార్ కి 20 కోట్లు లాభం వచ్చింది. ఏది ఏమైనా.. ఉప్పెన అనే పేరు బలమో ఏమో కానీ.. అంతా ఉప్పెనలా మారిపోయింది ఎవ్వారం.
ఆదా చేసుకున్న అందాలకి ఐదు ఆఫర్లు
ఒంపులూ వయ్యారాలూ ఉన్నప్పుడే.. ఆఫర్లు వస్తుంటయ్. వాటిని అందుకోవాలి. లేదంటే.. దసరాకి ఓ ఆఫరు.. సంక్రాంతికి మరో ఆఫరు అంటూ.. ఎప్పుడో ఒకటి వస్తుంటే.. వెతికి తెచ్చుకోవాలి. అప్పటి వరకూ ఏదీ రాదు. అసలు అవి కూడా రాకపోవచ్చు. అలా ఉంటుంది.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి.
ఇక డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ హార్ట్ అటాక్ ఉంది కదా. అది ఆడియన్స్ ఫుల్ గా నచ్చేసింది. పెద్ద సినిమా కాకపోయినా.. సింపుల్ గా చిన్న సినిమా తీశాడు పూరీ జగన్నాథ్. ఆ మూవీలో ఆదా శర్మ అందాలతో పిచ్చెక్కించింది. క్యూట్ లుక్ తో మత్తులో పడేసింది.
కానీ.. తర్వాత ఏంటో.. ఈ బేబీకి ఆఫర్లు పెద్దగా రాలేదు. మరి ఆ హార్ట్ అటాక్ లో అందాలు ఆరబోయక పోవడం వల్లనో.. మరీ చిన్న పిల్లలా ఉందనే ఫీలింగ్ వల్లనో.. పెద్దగా హాట్ ఫిగర్ కాదు అనుకున్నారో కానీ.. ప్రొడ్యూసర్లు పిలవలేదట. క్రియేటర్లు కాల్ చేయలేదట. పాపం బేబీ.. ఏవో రెండు మూడు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసి.. తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడికెళ్లాక విశ్వరూపం చూపించింది బేబీ. ఆల్రెడీ అందాల ప్రదర్శనకి అడ్డుచెప్పే టైప్ కాదు తను. కానీ.. పూరీ ఏమో.. సినిమా యాంగిల్ లో అందాల ప్రదర్శన అవసరం లేదు అనుకున్నాడు. క్యూట్ గా అందంగా చూపించాడు.