ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో లొల్లి.. పొంగులేటి వ్యాఖ్యలు ఎవరిపై?
తెలంగాణలో ఖమ్మం పాలిటిక్స్ ఇప్పుడు హీట్ పెంచాయి. పొలిటికల్ గా తెలంగాణ లీడర్లు మొత్తం ఖమ్మం వైపు చూసేలా చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఈ మధ్య పెరుగుతున్న మాట నిజమే కదా. వాటిలో ఇప్పుడు ఖమ్మం టీఆర్ఎస్ గ్రూపు తగాదాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. సీనియర్ లీడర్లు.. బలమున్న లీడర్లు ఒకే పార్టీలో, ఒకే జిల్లాలో ఉంటే ఎలా ఉంటుందో కనిపిస్తోంది. బడా బడా లీడర్ల ఫైటింగ్ కావడంతో.. ఖమ్మం పాలిటిక్స్ ఇంకాస్త ఇంట్రస్టింగ్ గా మారాయి.
ఒకరేమో.. మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్, రెండో లీడర్ ఏమో.. సీనియర్ లీడర్ తుమ్మల నాగేశ్వరరావు, మూడో నేత ఏమో.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ముగ్గురు బడా లీడర్లే. ముగ్గురికీ ఏ మాత్రం ఫ్రెండ్షిప్ వర్కవుట్ కావడం లేదట. జిల్లాలో ఆధిపత్యం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గ్రూపు తగాదాలు, ఒకరి వర్గంపై ఒకరు కక్ష సాధింపులు బానే ఉన్నాయట. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లోగా బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారట. అందుకే ఇప్పుడు ఖమ్మం జిల్లా ఆఫీసర్ల పై కూడా ఒత్తిడి పెరిగిందంట. ముగ్గురు లీడర్లూ ఒకే పార్టీ వాళ్లూ కావడం, ఒకరు మినిస్టర్, ఇద్దరు సీనియర్ లీడర్స్ కావడంతో ఎవరి మాటా కాదనలేక పోతున్నారట. ఎవరి మాట వింటే ఏమవుతుందో.. వినకపోతే ఇంకేం అవుతుందో అని ఇబ్బందులు పడుతున్నారట.
ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయంలో ఏ మాత్రం మొహమాటం లేకుండా బయట పడ్డారు. ఏ పదవీ శాశ్వతం కాదు. ఇవ్వాళ లేని పదవి రేపు రాదు అనేదేం లేదు. పదవి వచ్చే నాడు ఎవరూ ఆపలేరు. ఉన్న పదవి పోతుంటే.. కాంక్రీట్ గోడలు కట్టినా ఆగదు అంటూ పబ్లిక్ గానే కామెంట్స్ చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నా వర్గం లీడర్లని, నా వర్గం కార్యకర్తల్ని కాపాడుకోలేని అసమర్దుడ్ని కాదు నేను. వారి పై కక్ష పూరితంగా ఎన్ని కుట్రలు చేసినా ఊరుకునేదే లేదు. టైం చూసి ఆన్సర్ ఇస్తాం. ఇప్పుడు చేసేదానికి వడ్డీకి వడ్డీ కట్టి తీరతారు. ఆ విషయంలో వెనకడుగు వేసేదే లేదు అన్నారు. ఈ కామెంట్స్ తో ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా.. హాట్ హాట్ గా ఉంది రాజకీయం.
కేసీఆర్ ఇంట్లో కోల్డ్ వార్.. అందుకే యువరాజుకు పట్టాభిషేకం?
తెలంగాణకి కాబోయే సీఎం ఎవరు అంటే.. కేటీఆర్ అంటారు. ఎందుకంటే.. ఎలాగూ కేసీఆర్ దిగిపోయేలోగా.. కేటీఆర్ ని సీఎం ని చేస్తారు అనే విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. కేసీఆర్ మైండ్ లో ఏదో టైం ఉండే ఉంటుంది. కానీ .. బయటికి చెప్పడం లేదు. జస్ట్ హింట్స్ ఇచ్చి వదిలేస్తున్నారు. దాన్ని పట్టుకుని పొలిటీషియన్లు హడావిడి చేస్తున్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నదే అనే విషయంలో చాలా మందికి క్లారిటీస్ ఉన్నయ్. ఎలాగైనా సరే.. ఈ టర్మ్ లోనే సీఎం కేసీఆర్.. తన కుమారుడు కేటీఆర్ ని సీఎంగా చేస్తారు అనే విషయంలో ఎవరికీ డౌట్స్ లేవు.
కానీ.. ఇప్పుడు కొత్త విషయం తెరపైకి వచ్చింది. నెక్స్ట్ సీఎం కేటీఆర్ అవుతారా.. లేదంటే కవిత అవుతారా. ఇదే డౌట్ ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ లో ఉంది. ఇన్నాళ్లూ కేటీఆర్ సీఎం అవుతారు అనుకున్నాం. రేపో మాపో.. టైం గ్యాప్ తప్ప.. సీఎం కావడం వరకు కన్ఫామ్ అనుకున్నాం. అదే నమ్ముతున్నాం. కానీ.. ఇప్పుడు కవిత పేరు తెరపైకి ఎందుకు వచ్చింది అంటూ.. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో పార్టీలకి సంబంధం లేకుండా తిరుగుతోన్న వార్త.
కవిత సీఎం కేసీఆర్ ని పట్టుబడుతున్నారు. తనని సీఎం ని చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీలో ఇదో గొడవగా మారిందంట అంటూ.. తలో మాటా అనుకుంటున్నారు. కానీ.. వాస్తవానికి మాత్రం అలాంటిదేం కాదు. సీఎం కేసీఆర్ కి ఉన్న నమ్మకాల వల్లనే కవితను సీఎం చేయాలనుకుంటున్నారు. కానీ.. కేటీఆర్ ఒప్పుకోవడం లేదు. అందుకే.. సీఎంని చేసే ప్రాసెస్ లేట్ అవుతుంది అనే టాక్ కూడా వస్తుంది. మరి నమ్మకాల మాటేమిటయ్యా అంటే.. పండితులు మేథావులు చెప్పిన మాటల వల్లనే ఇదంతా జరుగుతుంది అంటున్నారు. యాగాలు.. పూజలు పురోహితుల విషయంలో సీఎం కేసీఆర్ ఎంత నిక్కచ్చిగా ఉంటారో తెలిసిందే కదా. నమ్మకాలు.. గౌరవాలు.. మర్యాదలు అన్నీ ఎక్కువే కదా. అలాగే.. కేటీఆర్ కంటే, కవితని సీఎంని చేస్తే పార్టీ భవిష్యత్ బంగారు భవిష్యత్ అవుతుంది అని ఎవరో పెద్దాయన చెప్పారట. కవిత జాతకం బావుందని చెప్పారా.. కేటీఆర్ జాతకం బాలేదు అని చెప్పారా అనేది వదిలేస్తే.. పార్టీ జాతకంలో మాత్రం.. కవిత సీఎం అయితే.. మంచిది అన్నారట. అందుకే కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు అనేది టాక్. ఇన్ని డౌట్స్ ఎందుకులే.. త్వర త్వరగా కేటీఆర్ ని సీఎం ని చేస్తే ఏ గోలా ఉండదు అనే థాట్స్ లో కూడా ఉన్నారట సీఎం కేసీఆర్. ఇక ఇంట్లో కూడా ఇదే డిస్కషన్ నడుస్తోందంట. సో.. ఏది నిజం ఏది అబద్దం అనేది వదిలేస్తే.. తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్ తో పాటు.. పాలిటిక్స్ తెలిసిన ప్రతి వారూ ఇదే మాట్లాడుకుంటున్నారు.
కేటీఆర్‌కు పట్టాభిషేకం.. ముహూర్తం ఫిక్స్ చేసిన కేసీఆర్?
తెలంగాణ రాజకీయాల్లో కీలక వార్త చక్కర్లు కొడుతుంది. తెరాస నేతలు, ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న సమయం రాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను త్వరలో సీఎంను చేయబోతున్నారని ప్రచారం సాగుతుంది. అయితే గత ఎన్నికల సమయంలోనే ఈ వార్త చెక్కర్లు కొ్ట్టింది. సీఎం కేసీఆర్ పదేపదే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ఇక కేటీఆరే తెలంగాణ సీఎం అని అందరూ భావించారు. అందుకు తగ్గట్లు మంత్రులు, ఆ పార్టీ కీలక నేతలుసైతం కేటీఆర్‌ను సీఎం చేయాలని ఇదే సరైన సమయం అని కేసీఆర్ వద్ద ప్రస్తావించినట్లు వార్తలు వినిపించాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తరువాత సీఎంగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించినప్పటికీ అది ఆలస్యమవుతూ వస్తుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ పలుసార్లు ముహూర్తంసైతం ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ వెనక్కు తగ్గినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. గత ఏడాది కాలంగా కేటీఆర్ సీఎం కాబోతున్నారన్న వార్తలు వస్తున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ దఫా ఖచ్చితంగా సీఎంగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించబోతున్నారంటూ తెలంగాణ వ్యాప్తంగా చర్చసాగుతుంది. ఇందుకు సీఎం కేసీఆర్ ముహూర్తం పిక్స్ చేశారట. ఫిబ్రవరి 18న సీఎంగా కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయబోతున్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు తెరాస పార్టీకి అంతగా అనుకూలించటం లేదు. ఇటీవల జరిగిన దుబ్బా ఉప ఎన్నికతో పాటు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టిషాక్ తగిలింది. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో వంద కార్పొరేటర్లను గెలుస్తామని కేటీఆర్ ప్రచార సమయంలో పదేపదే చెప్పారు. కానీ ఊహించని రీతిలో కేటీఆర్ అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ దూసుకురావటంతో కేవలం 55మంది మాత్రమే తెరాస కార్పొరేటర్లు గెలుపొందారు. జీహెచ్ ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకోవటం ఆ పార్టీకి కష్టంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ వేగంగా దూసుకొస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ విస్తరిస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ నిజంగానే సీఎంగా కేటీఆర్‌కు పగ్గాలు అప్పగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక తరువాత కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు సీఎం కేసీఆర్ వేచిచూస్తున్నారనే ప్రచారం సాగుతుంది. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమిస్తే.. కేటీఆర్‌కు సీఎంగా పట్టాభిషేకం ఖాయమనే వాదన ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడటంతో.. త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నాటికి సీఎం కుర్చీపై కేటీఆర్‌ను కూర్చోబెట్టేందుకు కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 18న కేసీఆర్ ఇందుకు ముహూర్తం ఖరారు చేశారనే వార్త తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గతంలో పలుమార్లు ఈ వార్తలు అవాస్తవమని తేలినప్పటికీ.. ప్రస్తుతం వెలువడుతున్న వార్తలు నిజమవుతాయో లేదో వేచిచూడాల్సిందే.
సాగర్ బైపోల్.. కాంగ్రెస్ ప్లాన్స్ జనారెడ్డికి కలిసి వస్తాయా..?
కాంగ్రెస్ అంటే అంతే. అదో లెక్క. ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. ఏ ప్లాన్స్ వేసి ముందుకు వెళ్లాలి అంటే దానికో ప్లాన్ వేయాలి. ఆ ప్లాన్ వేయడానికి ముందుగా ఇంకో ప్లాన్ వేయాలి. ఇవన్నీ అమలు చేయడానికి మరో ప్లాన్ వేయాలి. ఇలా ప్లాన్స్ వేయడం మ్యాప్ లు గీయడంతోనే సరిపోతుంది. మరి కేడర్ ఏం అనుకుంటుంది. జనంలోకి ఎలా వెళ్లాలి అనే విషయాలపై తీరిగ్గా లెక్కలు వేస్తుంటారు. ఈ లోగా.. పార్టీలో లీడర్లు ఎడమొహం పెడమొహం అవుతారు. ఒకరికి ఒకరు సహకరించుకోరు.
ఇలాంటి ప్రాబ్లమ్స్ మధ్యలోనే దుబ్బాక బై పోల్ వచ్చింది. బీజేపీ దుమ్ముదులిపింది. కాంగ్రెస్ చేతులెత్తేసింది. ఏందయ్యా అంటే.. ముందు నుంచీ అక్కడ మా హస్తం గుప్పిట్లో ఏమీ లేదు అన్నారు. ఇప్పుడు సాగర్ లో అలా అంటే నడవదు. సాగర్ ఏరియా మొత్తం కాంగ్రెస్ హస్తగతంలోనే ఉంది. మొన్నటి దాకా అదే జరిగింది. ఇప్పుడు కానీ.. గెలవలేదు అంటే.. మొత్తం రివర్స్ అవుతుంది. పైగా పోటీ చేసేది సీనియర్ లీడర్ జానారెడ్డి. ఏడు సార్లు గెలిచారు ఆ ఏరియాలో.. సో.. గెలిచి తీరాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.
కానీ.. అందరి డౌటూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ పైనే. ఆయన ఏం చెప్పినా వినాలి. లేదంటే హైకమాండ్ కి కంప్లయింట్ వెళ్తుంది. పోయిన సారి ఆయన మాట వింటేనే అంతా ఎడ్డెం తెడ్డెం అయింది. పెద్ద పెద్ద మ్యాపులేసి.. మూడో ప్లేస్ కి పడేశారని.. లీడర్లు తెగ ఇదై పోయారు. ఇప్పుడు సాగర్ లో కానీ.. ప్లాన్స్ బెడిసి కొడితే.. చాలా ప్రాబ్లమ్ వస్తుంది. జానారెడ్డి పొలిటికల్ కెరీర్ కి పులిస్టాప్ పడుతుంది. కాంగ్రెస్ కి తెలంగాణలో నల్గొండ సైడ్ పట్టు ఉంది అని చెప్పుకునే పరిస్థితి ఉండదు. సో.. ఏం జరుగుతుంది అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది. ప్రస్తుతానికైతే భారీ భారీ ప్లాన్స్ వేస్తున్నారట. మరి అవి జానారెడ్డికి కలిసి వస్తాయా.. దుబ్బాకలో వచ్చిన రిజల్టే వచ్చి.. బిస్కెట్ అవుతుందా అని టెన్షన్ లో ఉన్నారంట జానారెడ్డి.
వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
భారతదేశంలో నేటి నుండి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. తొలి వ్యాక్సిన్ తానే వేయించుకుంటానంటూ తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ ను పారిశుద్ధ్య కార్మికురాలు కర్మచారి కృష్ణమ్మకు ఇచ్చారు. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈటల రాజేందర్ ప్రారంభించారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను తొలి వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదో ఈటల తెలిపారు. డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోనాపై యుద్ధం చేస్తున్నారని, ప్రాణ త్యాగాలు కూడా చేశారని చెప్పారు. వారికే ముందు వ్యాక్సిన్ వేయాలని ప్రధాని మోదీ కూడా సూచించారని అందుకు కర్మచారి కృష్ణమ్మకే తొలి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. అందుకే తాను ఈరోజు వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు. ప్రారంభంలో ప్రతి కేంద్రంలో 30 మందికి మాత్రమే టీకాలు వేస్తామన్నారు. వైద్యారోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు. తొలివిడతలో పారిశుద్ధ్య సిబ్బందికి టీకా ఇవ్వాలని ప్రధాని చెప్పారని.. వ్యాక్సిన్ కోసం ఎవరూ తొందర పడొద్దు అని సూచించారు. ప్రాధాన్యక్రమంలో అందరికీ కోవిడ్ టీకాలు ఇస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ సామర్థ్యంపై ప్రజలు అనుమానాలు పెట్టుకోవద్దని శుక్రవారం నాడు మంత్రి ఈటల చెప్పారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు మొదటి టీకాను తానే తీసుకోనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. తెలంగాణలో మొదటి టీకాను మంత్రి ఈటల తీసుకుంటారని అంతా భావించారు. అయితే తొలి టీకాను కృష్ణమ్మకు ఇచ్చారు. తొలి టీకా వేయించుకుంటానని చెప్పిన ఈటల ఎందుకు తీసుకోలేదని చర్చ ప్రారంభమైంది. గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మ కరోనా టీకా తీసుకున్నారు. ఈమెనే కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కారు. టీకా తీసుకున్న తర్వాత ఆమెతో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆమెను అబ్జర్వేషన్ గదికి తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 139 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది.
కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక విషయాలను పోలీసులు తెలుసుకున్నారా..? ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ చుట్టూ ఈ కేసు తిరుగుతూ ఉండగా.. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను మాత్రం పరారీలో ఉన్నారు. ఈ కేసులో భార్గవ్‌రామ్ తల్లి కిరణ్మయితో పాటు ఆయన సోదరుడు చంద్రహాస్లకూ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ సోదరుడి ప్రమేయంపై విచారణ జరుపుతున్నారు.
పోలీసుల విచారణలో ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ అఖిలప్రియ చెప్పినట్లు తెలుస్తోంది. తాను జైల్లో ఉంటే లాభం లేదని.. బోయిన్ పల్లి కిడ్నాప్‌కు సూత్రధారిని తానేనంటూ ప్రచారం చేస్తున్నారని, అలాంటప్పుడు తాను బయట ఉంటేనే మిగిలిన నిందితులకు నచ్చజెప్పి పోలీసుల ముందు లొంగిపోయేలా చేస్తానని అఖిలప్రియ చెప్పినట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఆ భూములు తన తండ్రివని ఆమె తెలిపినట్లు కూడా చెబుతూ ఉన్నారు. అరెస్టయిన నిందితులు సంపత్‌కుమార్, మల్లికార్జునరెడ్డి, బాలచెన్నయ్యలను కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు.
పోలీసులు మాత్రం అఖిలప్రియ కిడ్నాపర్లతో ఫోన్ లో మాట్లాడినట్టు పోలీసులు ఆధారాలు సేకరించామని అంటున్నారు. తన పర్సనల్ ఫోన్ కాకుండా, కిడ్నాప్ సమయంలో ఆమె ప్రత్యేకంగా మరో ఫోన్ ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన రోజున అఖిలప్రియ విజయవాడ నుంచి హైదరాబాదులోని కూకట్ పల్లి వచ్చేవరకు రెండు సెల్ ఫోన్లలో మాట్లాడినట్టు తెలుసుకున్నారు. ఆ రెండు ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు న్యాయపరమైన అనుమతుల కోసం వేచిచూస్తున్నారు. అఖిలప్రియను అరెస్ట్ చేసిన సమయంలో రెండు ఫోన్లు ఆమె నివాసంలోనే ఉండిపోయాయి. అఖిలప్రియ ఇంటికి తాళం వేసి ఉండడంతో, తెరిచేందుకు న్యాయస్థానం అనుమతి కోరాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.
ఈ కిడ్నాప్ వ్యవహారం మొదట్లో చాలా మలుపులు తిరిగినా చివరికి అఖిలప్రియ చుట్టూ ఉచ్చు బిగించుకుంటూ ఉంది. ఈ కేసులో తెర మీదకు మరో కొత్త పేరు వచ్చి చేరింది. ఈ కేసులో విజయవాడకు చెందిన సిద్ధార్థ కీలక సూత్రధారి అని గుర్తించారు పోలీసులు. ఈ కిడ్నాప్ కు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కు సిద్ధార్థ మనుషులను సరఫరా చేసినట్లు గుర్తించారు. సిద్ధార్థ విజయవాడ కేంద్రంగా బౌన్సర్ లను ఈవెంట్లకు సప్లై చేసే వ్యక్తి అని గుర్తించారు పోలీసులు. అఖిల ప్రియ, భార్గవ్ విజయవాడ, విశాఖపట్నం వైపు పర్యటనలకు వెళ్లినప్పుడు వీరికి సిద్ధార్థ పర్సనల్ గార్డ్ గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.
వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
ఏంది తేలేది. కేసీఆర్ గానీ ఈ మాట వింటే ఊరుకుంటారా చెప్పండి. మొత్తం గాయ్ గాయ్ అవుద్ది తెలంగాణ అర్జంట్ గా వీళ్లు ఆ సర్వే రిపోర్టులు కాస్త పక్కన పెడితే మంచిది. హవ్వా..... కేసీఆర్ ని వరస్ట్ సీఎం అంటారా. అది కూడా టాప్ లిస్ట్ లో పెడతారా. వరస్ట్ సీఎంలలో నాలుగో ప్లేస్ అంటే ఏంటి చెప్పండి. ఏమన్న ఇజ్జత్ ఉంటదా. అస్సల్కే కేసీఆర్ సార్ అంటే.. తెలంగాణ జాతిపిత లెక్క. రాంగోపాల్ వర్మ లెక్కల్లో చెబితే.. సూపర్ బ్యూటిఫుల్ సీఎం. ఒక పవర్ అంటే.. సీఎం కేసీఆర్ అంటాడు వర్మ. అలాంటి వర్మ అభిమానించే సీఎం కేసీఆర్ ని పట్టుకుని.. వరస్ట్ సీఎం అంటే ఎట్టా చెప్పండి. అందులో కూడా నాలుగో ప్లేస్ ఇస్తే.. తెలంగాణ ఇజ్జత్ ఏం కావాలె. బంగారు తెలంగాణ చేయాల్సిన సీఎం ని పట్టుకుని అంత మాట అంటుందా ఆ సర్వే. ఇంతకీ ఆ సర్వే ఎవరు చేశారు ఏ ఉద్దేశంతో చేశారు. ఇన్ని మాటలు ఎన్నో అనుమానాలు.
అయితేనేం.. మొత్తానికైతే న్యూస్ బయటికి వచ్చేసింది. నేషనల్ వైడ్ గా ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ హడావిడి చేస్తుంది. తెలుగు రాష్ట్రాల సీఎం లు ఇద్దరికీ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సీఎం జగన్ కేమో మంచి సీఎంలలో మూడో ప్లేస్ వచ్చింది. కేసీఆర్ కేమో వరస్ట్ సీఎంలలో నాలుగో ప్లేస్ వచ్చింది. ఈ సర్వే చేసింది ఎవరో కాదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు.. దేశ ప్రజలు అందరూ ఎక్కువ గా నమ్మే సర్వేనే. ఆ సర్వే పేరే.. ఏబీపీ-సీ ఓటర్ సర్వే. మామూలుగా ఎన్నికల టైంలో ఈ సర్వేకి ఫుల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వీళ్లు కానీ.. ఎన్నికల అంచనా సీట్లు ఇవి అంటూ రిలీజ్ చేస్తే.. పక్కాగా ఉంటాయి. అంత నిక్కచ్చిగా లెక్కలేస్తారు.
ఇప్పుడు ఇదే ఏబీపీ-సీ ఓటర్ సర్వే.. సీఎం కేసీఆర్ వరస్ట్ సీఎం అని చెబుతోంది. అందుకే.. ఇప్పుడు ఈ సర్వే ఇంత హైలైట్ అయింది. బిలీవబులిటీ ఉన్న సీఓటర్ - ఏబీపీ సర్వే కావడంతో అంతా నమ్మేస్తున్నారు. నిజమే అయి ఉంటుందిలే అని.. దేశ వ్యాప్తంగా ఒక టాక్ అయితే వెళ్లింది.
దేశ వ్యాప్తంగా మోడీ తీరు ఎలా ఉంది. పరిపాలన ఎలా ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు. ఎవరి వర్క్ నచ్చింది అంటూ.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీ నియోజక వర్గాల్లో.. 30 వేల మందిపై ఈ సర్వే చేసింది ఏబీపీ-సీ ఓటర్ సర్వే. బెస్ట్ సీఎంలలో.. నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ తర్వాత.. థర్డ్ ప్లేస్ లో జగన్ ఉన్నారు. ఇక వరస్ట్ సీఎంల ప్లేస్ లో మాత్రం మన సీఎం కేసీఆర్ నాలుగో ప్లేస్ లోకి వెళ్లారు. అదీ తెలంగాణ పరిపాలన అంటూ.. దేశ వ్యాప్తంగా టామ్ టామ్ అయింది ఇప్పుడు.
మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
మై హోం ఇండస్ట్రీస్ గురించి.. తెలంగాణలో తెలియని లీడర్ లేరు. మై హోం నారాయణ అంటే కూడా తెలంగాణలో తెలియని పొలిటీషియన్ లేరు. రాజకీయంగా కాస్తో కూస్తో నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికీ.. మై హోం ఇండస్ట్రీస్ గురించీ.. ఆ సామ్రాజ్యం గురించీ తెలిసిందే. ఆ మధ్య మీడియాలో కూడా బాగా హైలైట్ అయింది మై హోం. ఇప్పుడు కూడా హైలైట్ అవుతోంది. సీఎం కేసీఆర్ కి బ్యాక్ బోన్ ఉన్నది మైహోమే అనే టాక్ కూడా అందరికీ తెలిసిందే.
కానీ.. తెలంగాణ వచ్చిన స్టార్టింగ్ లో అంతా మై హోమ్ కే చెల్లుతోంది. మై హోమ్ కి ఎదురే లేదు అనుకున్నారు. మీడియా సంస్థల్లో కూడా మైహోమ్ వాళ్లు ఇన్వాల్వ్ కావడంతో.. ఒక సామ్రాజ్యం స్థాపిస్తున్నారు అనే టాక్ వచ్చింది. ఇప్పుడు మాత్రం అంతా రివర్స్ అయింది. మై హోం కి టైం బాలేనట్లుగా మారిపోయింది. మై హోం కి కూడా బెదిరింపులు తప్పడం లేదు. కేసీఆర్ వెనకాల నిలబడడమే బలం అనుకున్న దగ్గర్నుంచి.. అదే బలహీనత అయ్యే దాకా వెళ్లింది. మై హోం అక్రమాలూ అదీ ఇదీ అంటూ రోజూ ఎన్నో వార్తలు చూస్తున్నాం. అయితే.. ఇదంతా సీఎం కేసీఆర్ టార్గెట్ గా నడుస్తున్న పనే అనే టాక్ అయితే ఫుల్ గా ఉంది. సీఎం కేసీఆర్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే ప్రాసెస్ లో మై హోమ్ ని టార్గెట్ చేస్తున్నారు అనే విషయం పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది.
మరి మై హోం సడన్ గా ఎందుకు టార్గెట్ అయింది.. ఎవరు టార్గెట్ చేస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెట్టే.. ఎందుకంటే.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గురించి తెలిసిందే కదా. ఆయన అస్తమానం మై హోం పై పడుతున్నారు. కేంద్రానికి కంప్లైంట్స్ ఇస్తున్నారు. సెంట్రల్ మినిస్టర్ లకి కూడా కంప్లైంట్స్ ఇస్తున్నామని బయటికి చెబుతున్నారు. రీసెంట్ గా తెలంగాణ చీఫ్ సెక్రటరీని కలిసి కూడా మై హోమ్ గురించి కంప్లైంట్ చేశారు.
మరి ఎంపీ ధర్మపురి అరవింద్ కి ఎందుకంత కసి అంటే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేయాలంటే.. ముందుగా మై హోమ్ ని టార్గెట్ చేయాలి అనేది.. పాయింట్ గా అనుకుంటున్నారు. అటు నుంచి ఇటు టర్న్ చేయాలి అనే ప్లాన్ కావచ్చు. ఎందుకంటే.. మై హోం ఇండస్ట్రీస్ పై తెలంగాణ గవర్నమెంట్ లో కంప్లైంట్స్ చేసినా.. ఎలాంటి నష్టమూ ఉండదు. ఎందుకంటే..మై హోం కి తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్. ఆ విషయంలో తెలంగాణలో అందరికీ తెలిసిందే. కానీ.. కేంద్రం ద్వారా సీబీఐలు గట్రా వేయించి దర్యాప్తులు చేయించ వచ్చు.. లేదంటే ప్రూఫ్స్ పట్టుకుని కోర్టుకెళ్తే వాళ్లే దర్యాప్తు చేస్తారు. కానీ.. ఎంపీ ధర్మపురి అరవింద్ హడావిడే చేస్తున్నారు. దీని ఉద్దేశం బెదిరించడమే కదా అనే విషయం అందరికీ అర్దం అవుతోంది. మరి ఎంపీ హడావిడి చేసినంత మాత్రాన.. మై హోం లెక్క చేస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ అయింది.
బోయనపల్లి కిడ్నాప్.. 11 మంది నిందితులు రహస్య ప్రాంతంలో బందీ?
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత హడావిడిగా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. ఈ కేసులో ఏ అప్డేట్ అయినా.. ఇంట్రస్టింగే. ఇక పోలీసులు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. టీమ్ లు టీమ్ లు గా ఏర్పడి.. గాలించేస్తున్నారు. ప్రతి విషయాన్ని పక్కా సమాచారంతో పట్టేస్తున్నారు. అదే ప్రాసెస్ లో 17 టీమ్ లు గా ఏర్పడి.. 11 మంది కిడ్నాపర్లను పట్టుకున్నారట.
ఈ పదకొండు మందిని.. మూడు రాష్ట్రాల్లో గాలించి పట్టుకున్నారట. బెంగళూరు, పూణే, చెన్నై లాంటి సిటీస్ లో ఫుల్ గా ఎంక్వైరీలు చేసి.. పక్కా ఇన్ఫర్మేషన్ తో పట్టేసుకున్నారట. కాకపోతే.. వారిని మాత్రం ఇంకా పబ్లిక్ లోకి తీసుకురాలేదు. వాళ్లు దొరికిన విషయాన్ని కూడా సీక్రెట్ గానే ఉంచుతున్నారు. యాక్చువల్ గా చూస్తే కూడా.. ఇది మామూలు కిడ్నాప్ కేసు కాదు. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దలు.. సీనియర్ అధికారులు అంతా రికమండేషన్లు చేస్తూ.. కేసుల్ని తారు మారు చేసే వాళ్లు ఉన్నారు. రెండు పక్కలా పొలిటికల్ ఇన్ ఫ్లుయెన్సులు ఉండడం కూడా పోలీసులు సీక్రసీ మేన్ టేన్ చేయడానికి రీజన్ అయింది.
అందుకే.. పోలీసులు కూడా ఈ విషయాన్ని ఎక్కడా లీక్ కానివ్వడం లేదు. మరి అప్డేట్స్ ఎవరికి ఇస్తున్నారో ఏమో కానీ.. ఈ 11 మందిని అదుపులోకి తీసుకుని.. సీక్రెట్ ప్లేస్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట. ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కిడ్నాప్ ఎలా చేశారు. ఎందుకు చేశారు. చేసి ఏం చేద్దాం అనుకున్నారు. తెలిసిన వాళ్లేనా.. ఇంకా బయటికి రాని పెద్దలు ఇంకెవరైనా ఉన్నారా అని కూడా ఎంక్వైరీ చేస్తున్నారట. మొత్తం 11 మందిని ఇన్వెస్టిగేట్ చేసి.. తర్వాత అఫీషియల్ గా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట. మరి వాళ్లు ఎక్కడ ఉన్నారు. ఏం చెబుతున్నారు. ఎంత మందిని ఇరికించబోతున్నారు లాంటివి.. ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారాయి. తెరపై కనిపించే వారేనా.. ఇంకా సీక్రెట్ హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా.. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్.. గుంటూరు శీనుల స్టేటస్ ఏంటి అన్నీ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట పోలీసులు.
పీఆర్సీపై సీఎం కేసీఆర్ డెసిషన్.. 30 శాతం ఫిట్మెంట్ ఫైనల్
పీఆర్సీ ఇస్తున్నారు అని తెలిసిన తర్వాత.. ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎంత ఇస్తున్నారు. ఏం కతా అంటూ.. ఎన్నెన్నో లెక్కలు వేస్తున్నారు. పీఆర్సీ రిపోర్ట్ లో ఏం ఉంటుంది.. సీఎం మనసులో ఏముంది.. ఫైనల్ గా ఏం బయటికి వస్తుంది అంటూ లెక్కలేస్తున్నారు. ఇప్పటికీ ఆ కన్ ఫ్యూజన్స్ అలాగే ఉన్నయ్.
అయితే.. పీఆర్సీపై సీఎం కేసీఆర్ ఓ డెసిషన్ కి వచ్చేశారట. పోయిన పీ ఆర్సీ లా కాకుండా ఈసారి కాస్త తక్కువే ఉంటుంది అనేది బయటికొచ్చిన న్యూస్. ఎగ్జాక్ట్ గా 30 శాతం మాత్రమే ఫిట్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఇది ఫైనల్ అయిందనే వార్త కూడా ఉంది. కాకపోతే.. అఫీషియల్ గా ప్రకటన చేసే టైంకి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా.. చిన్న చిన్న మార్పులే తప్ప.. పెద్దగా అయితే ఉండవు అనే విషయంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా క్లారిటీకి వచ్చాయట. సంక్రాంతి తర్వాత పీ ఆర్సీపై జీవో వస్తుండడంతో.. ఉద్యోగులు ఉద్యోగ సంఘాల్లో ఇంట్రస్ట్ ఇంకాస్త పెరిగింది. పీఆర్సీ.. ఫిట్ మెంట్ పై చాలా తక్కువ రోజుల్లోనే జీవో విడుదల కానుంది. అందులో.. కచ్చితంగా 30 శాతం ఉంటుంది అనేది ఇంట్రస్టింగ్ న్యూస్.
మామూలుగా అయితే.. పీఆర్సీ ఫిట్ మెంట్ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మీటింగ్ లు.. సలహాలు సూచనలు గట్రా చాలానే ఉంటయ్. వాళ్లతో మాట్లాడిన తర్వాతనే ఇలాంటి వాటిపై డెసిషన్స్ ఉంటయ్. కానీ.. ఈసారి మాత్రం అలాంటి డిస్కషన్లు ఏం ఉండనట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపితే అవి ఏ మాత్రం తెగవు ముడిపడవు.. వారి డిమాండ్లు తీర్చే పొజిషన్ లేదు కాబట్టి.. చర్చలు జరపకుండానే జీవో రిలీజ్ చేయాలని చూస్తోందంట సర్కార్. ఫిట్ మెంట్ ప్రకటించిన తర్వాత.. బెన్ ఫిట్స్ వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ చర్చిస్తారని తెలుస్తోంది. కరోనా టైంలో.. ఇంతకు మించి ఇవ్వడం వీలుకాదు అనే సంకేతాలు ముందుగానే చేరవేసి.. తర్వాత డిస్కషన్లు చేస్తారట. సో.. ఫైనల్ గా అయితే.. ఉద్యోగులు ఓ థర్టీ పర్సంట్ ఫిట్మెంట్ లెక్కలు వేసుకోవచ్చు అనే క్లారిటీ అయితే వస్తోంది.
సాయం చేయండి ప్లీజ్.. ప్రధాని మోడీకి నిజాం మనవడి లేఖ!
నిజాం పాలకులు.. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరు సంపాదించిన కుటుంబం అది. కానీ ఆ కుటుంబం సాయం చేయమని భారత ప్రధానిని కోరుతోంది. నిజాం కుటుంబం కీలకంగా భావిస్తోన్న నిజాం జువెలరీ ట్రస్ట్ ఆదాయ, సంపద పన్నుకు సంబంధించిన వివాదం భారత్ లో 26 ఏళ్లుగా కొనసాగుతూ ఉండగా.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆదాయ పన్ను శాఖ దగ్గర ఫైల్ పెండింగ్‌లో ఉంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, తమ బాకీలు ఇప్పించాలంటూ చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నజఫ్ అలీ ఖాన్ కేంద్రానికి లేఖ రాశాడు. నిజాం జువెలరీ వివాదాన్ని పరిష్కరించాలంటూ చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నజఫ్ అలీ ఖాన్ రాసిన లేఖ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలనలో ఉంది. ట్రస్టుకు సంబంధించి మొత్తం 114 లబ్ధిదారుల్లో ఇప్పటికే 39 మంది చనిపోయారని, మిగిలిన వాళ్లలో చాలా మంది ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని ఆ లేఖలో నజఫ్ అలీ ఖాన్ చెప్పారు.
1950లలో చివరి నిజాం కొన్ని ట్రస్ట్‌లను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి నిజాం జువెలరీ ట్రస్ట్. ఇందులోని నగలను అమ్ముకోవడానికి ట్రస్టీలైన ప్రిన్స్ ముఫఖమ్ జా, ప్రభుత్వం నామినేట్ చేసిన అధికారికి అధికారం ఇచ్చారు. 1995లో ఈ నగలను రూ.206 కోట్లకు కొనడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మొత్తాన్ని నిజాం కుటుంబానికి చెందిన 114 మంది లబ్ధిదారులకు సమానంగా పంచారు. అయితే నగలను అప్పగించే సమయంలో తమకు రూ.30.50 కోట్ల ఆదాయ, సంపద పన్ను బాకీ ఉన్నదంటూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఆ మొత్తాన్ని ఆ రూ.206 కోట్ల నుంచే చెల్లించారు. ఈ మొత్తంలో రూ.15.45 కోట్లను బకాయిల కోసం చెల్లించగా.. వీటిలో చాలా వరకు రీఫండ్స్ రూపంలో వెనక్కి వచ్చింది. కానీ ఈ మొత్తాన్ని తప్పుడు అకౌంట్లలో వేశారు. ఇక మిగిలిన రూ.14.05 కోట్లను భవిష్యత్తులో పన్ను చెల్లించడం కోసం అప్పటి ఎస్బీహెచ్లో జమ చేశారు. ఆ బకాయిలు రీఫండ్స్‌కు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఆ రీఫండ్‌తో పాటు బ్యాంక్‌లో ఉంచిన రూ.14.05 కోట్లు కూడా నిజాం కుటుంబ లబ్ధిదారులకు పంచాల్సి ఉంది. ఆదాయ పన్ను శాఖ మాత్రం ఆ పని చేయడం లేదని నజఫ్ తెలిపారు. తాము క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాత్రం ఇంకా రూ.8.54 కోట్ల పన్ను బాకీ ఉన్నట్లుగా చెబుతున్నదని ఆయన అన్నారు. ఇన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని నజఫ్ ఆ లేఖలో కోరారు. ఆ లేఖపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.
అఖిలప్రియకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
హఫీజ్ పేట కిడ్నాప్ వ్యవహారంలో ఏ1 నిందితురాలిగా ఉన్న టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు మూడు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణలో ఆమె నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తొలుత దాటవేత ధోరణిని అవలంబించిన అఖిలప్రియ ఆ తర్వాత కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. సాంకేతిక ఆధారాలను కూడా ఆమె ముందు ఉంచారు.. కొన్నింటిని ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అఖిలప్రియను నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీల బృందం ప్రశ్నించింది. ఆమెను దాదాపు 300 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. మొత్తం 19 మందిని ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మొత్తం వ్యవహారం అఖిలప్రియ కనుసన్నలలోనే జరిగిందని పోలీసులు అంటున్నారు. మొబైల్ ఫోన్ కాల్స్ ద్వారానే మొత్తం అఖిలప్రియ మేనేజ్ చేశారని పోలీసులు అంటున్నారు. మొదట ఆమెను ఏ2 అని చెప్పిన పోలీసులు.. ఆ తర్వాత ఏ1గా ప్రకటించారు.
మూడు రోజుల కస్టడీ అనంతరం పోలీసులు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.అఖిలప్రియను ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. కరోనా పరీక్షలతో పాటు, ఈసీజీ, గైనకాలజీ పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగెటివ్ రాగా, ఆమెను విచారణ నిమిత్తం న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లారు. విచారణ పూర్తయిన తర్వాత మళ్లీ చంచల్ గూడ జైలుకు తరలించారు. అఖిలప్రియకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 16న విచారణ జరపనున్నారు. ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ భర్త భార్గవరామ్, గుంటూరు శ్రీనుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు జరుగుతోంది. అసలైన వ్యక్తులను పట్టుకోకుండా ఏ మాత్రం సంబంధం లేని తమపై కక్ష సాధిస్తూ ఉన్నారని అఖిలప్రియ బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020