పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
పీకే పీకే పీకే. ఎన్నికల టైం వస్తే.. ఈ పేరు బలంగా వినిపిస్తుంది. ఆ మధ్య ఏపీలో కూడా ఈ పేరు బానే వినిపించింది కదా. ఇక ఈ మధ్య పశ్చిమ బెంగాల్ లో కూడా పీకే పేరు బానే వినిపిస్తోంది. ఎందుకంటే.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఎలాగైనా గెలిచి తీరాలి.. హ్యాట్రిక్ సీఎం కావాలి.. బీజేపీ అటాక్ ని తిప్పి కొట్టాలి. బెంగాల్ లోకి బీజేపీని రానివ్వకూడదు అంటూ.. రాజకీయ వ్యూహ కర్తగా పీకేను ఫిక్స్ చేసుకున్నారు. ఆయన చెప్పినట్లుగానే వెళ్తున్నారు.
కానీ.. సడన్ గా ఏం జరిగిందో ఏమో తెలీదు. ఓ బీజేపీ లీడర్ ఓ వీడియోను లీక్ చేశాడు. అందులో.. ప్రశాంత్ కిశోర్.. మమత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో బీజేపీదే పై చేయిగా ఉంది. ఈసారి బీజేపీ బెంగాల్ లో ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. మమత పార్టీ ఓడిపోతుంది అనే వ్యాఖ్యలు చేశాడు. మమతా బెనర్జీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న పీకే.. ఇలా హ్యాండివ్వడం ఇంట్రస్టింగ్ గా మారింది.
బీజేపీ కొనేసిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయినా.. పీకే వ్యూహ కర్తగా పేరు తెచ్చుకున్నాడు అంటే.. అది తన క్రెడిబులిటీపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక వేళ.. రాజకీయ వ్యూహంలో భాగంగా.. బీజేపీ తరపున రాజకీయ వ్యూహకర్తగా ఉన్న పీకే.. వ్యూహంలో భాగంగా మమతా వైపు చేరాడా అనే టాక్ కూడా బయటికి వచ్చింది. ఇవన్నీ హాలీవుడ్ మూవీస్ లో జరుగుతుంటాయి. మరి పీకే కూడా అదే ఫార్మాట్ ని వెస్ట్ బెంగాల్ లో అమలు చేశాడా ఏంటి అంటున్నారు.
అయితే.. ఈ వీడియో లీక్ పై పీకే కూడా నెగటివ్ గా మాట్లాడలేదు. కౌంటర్ ఇవ్వలేదు. పైగా.. తన మాటల వీడియోని ఫుల్ గా రివీల్ చేయమని కోరడం మరో ట్విస్ట్. ఇదేంట్రా బాబూ.. నాలుగో విడత ఎన్నికలు జరుగుతున్న టైంలో.. పీకే ఇలా ట్విస్టులు ఇస్తున్నాడేంటి అనుకుంటున్నారు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం.. నిజంగానే వెస్ట్ బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందా.. మమతా బెనర్జీ పాలనపై ఉన్న వ్యతిరేకతే.. ఆమె పార్టీని ఓడిస్తుందా అనే లెక్కల్లోకి వెళ్లారు జనాలు.
ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
ఎన్నికల కమిషన్ పదిసార్లు నాకు షోకాజ్ నోటీసు పంపినా సరే మతప్రాతిపదికన ఓటర్లను చీల్చే రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడి తీరుతానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. మతప్రాతిపదికన ఓట్లు గంపగుత్తగా తనకే వేయాలంటూ మమత మైనారిటీలను కోరారని తన దృష్టికి వచ్చిన ఆరోపణలపై ఈసీ స్పందించి రెండు రోజుల్లోగా సమాధానం చెప్పకపోతే మమతపై చర్య తీసుకుంటానని ఎన్నికల కమిషన్ హెచ్చరించిన నేపథ్యంలో ఒకటి కాదు.. పది నోటీసులు పంపుకోండి అంటూ మమత ధిక్కార స్వరం వినిపించారు.
ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో పదే పదే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా స్పందించని ఈసీ తనకు నోటీసులమీద నోటీసులు పంపుతోందంటూ మమత దుయ్యబట్టారు. నరేంద్రమోదీ వివాదాస్పద ప్రకటనలపై ఎందుకు నోటీసు పంపలేదని ఈసీని మమత ప్రశ్నించారు. తానెన్నడూ మతపరంగా ఓటర్ల విభజనను ప్రోత్సహించలేదని మమత చెప్పారు.
మీరు నాకు పది షోకాజ్ నోటీసులు పంపించవచ్చు. కానీ నా సమాధానం ఒక్కటే. హిందూ, ముస్లిం అనే విభజన ప్రాతిపతిపదికన ఓట్లను చీల్చడానికి వ్యతిరేకంగానే నేను ఎల్లప్పుడూ మాట్లాడుతూ వచ్చాను. మత ప్రాతిపదికన ఓటర్ల విభజనను నేను ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూ వచ్చాను అని మమత వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతి రోజూ హిందూ, ముస్లిం ఓటు బ్యాంకు గురించి మాట్లాడుతుంటే ఎందుకు తనపై ఫిర్యాదును ఈసీ స్వీకరించలేదు? నందిగ్రామ్ ప్రచారంలో మినీ పాకిస్తాన్ అంటూ పదే పదే వ్యాఖ్యానించిన వారిపై ఎందుకు ఫిర్యాదులను తీసుకోలేదు అంటూ తన ప్రత్యర్థి సువేందు అధికారిని ప్రస్తావిస్తూ మమత ఈసీని ప్రశ్నించారు.
కాగా ఏప్రిల్ 3న హుగ్లీలో మమత ప్రచారం చేస్తున్న సందర్భంగా మత ప్రాతిపదికన ఓట్లు వేయాల్సిందిగా మైనారిటీలను డిమాండ్ చేశారంటూ వచ్చిన ఆరోపణపై ఈసీ స్పందించి ఆమెకు షోకాజ్ నోటీసు పంపిన విషయం తెలిసిందే.
షోకాజ్ నోటీసుకు సమాధానం పంపకపోతే ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై ఐపీసీ 186, 189, 505 సెక్షన్ల కింద చర్య తీసుకుంటానని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.
పశ్చిమబెంగాల్లో 27 శాతం ముస్లిం ఓట్లు ఉన్నప్పటికీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎమ్ఐఎమ్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్లు ముస్లిం ఓట్లను చీలుస్తాయని, అది బీజేపీకే మేలు కలిగిస్తుందని ఆందోళనం చెందిన దీదీ ముస్లిం ఓట్లు చీలిపోకుండా అందరూ నాకే ఓటేయండి అని పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది.
బెంగాల్ చేజారింది.. వారణాసికి రండి దీదీ.. ప్రధాని మోదీ ఎద్దేవా
మతం పేరుతో ఓట్లు ఎలా అడుగుతారు.. మమతకు షాక్ ఇచ్చిన ఈసీ
మతప్రాతిపదికన గంపగుత్తగా ఓట్లు వేయాలని ఎలా డిమాండ్ చెస్తారంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నిగ్గదీసింది. ఈ విషయమై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా బెంగాల్ సీఎంకి ఈసీ నోటీసు పంపింది. ఏప్రిల్ 3న హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ప్రచారం చేస్తున్న సందర్భంగా మత ప్రాతిపదికన మమత ఓట్లు వేయాలిసిందిగా కోరిందని వచ్చన వార్తలపట్ల ఈసీ తీవ్రంగా స్పందించింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి 66 సంవత్సరాల వయస్సున్న మమతా బెనర్జీ 48 గంటల్లోపు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని లేకుంటే తదుపరి నోటీసు కూడా ఇవ్వకుండా ఆమెపై చర్యలు తీసుకుంటానని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం చేసిన ఆరోపణను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ మమతకు తీవ్ర హెచ్చరిక చేసింది.
ఏప్రిల్ 3న తారకేశ్వరం ప్రాంతంలో ముస్లిం ఓటర్లను ఉద్దేశించి మమత ప్రసంగించారు. నా మైనారిటీ సోదరసోదరీమణులకు చేతులెత్తి మొక్కుతున్నా. బీజేపీ నుండి డబ్బు తీసుకున్న దెయ్యాల మాటల విని దయచేసి మైనారిటీ ఓట్లను చీల్చవద్దు. అతగాడు హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు రెచ్చగొట్టడానికి అనేక మతపరమైన వ్యాఖ్యలు చేశాడు. సీపీఎం, ఎంఐఎం నేతలు బీజేపీ ఇచ్చిన డబ్బు పుచ్చుకుని మైనారిటీ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఓటు వేయండి అంటూ మమత పిలుపనిచ్చారు.
మమత చేసిన ఈ వ్యాఖ్యలు ఆర్పీ చట్టం మరియు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
మమతకు మద్దతుగా నిలిచిన తృణమూల్ ఫైర్ బ్రాండ్ మహువా మోయిత్రా ఈసీ నోటిసుపై మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు పంపిన డజన్ల కొద్దీ నోటీసులను పక్కన బెట్టిన ఈసీ బీజేపీ పంపిన ఒక నోటీసుకే ఇంత రాద్దాంతం ప్రకటించడం ఏమిటన్న ఆమె ప్రశ్నించారు. బీజీపే అభ్యర్థులు డబ్బులు పంచుతున్న వీడియోలు, ఆ పార్టీ క్యాష్ కూపన్లు సాక్ష్యాధారాలతో సహా పంపించినా ఈసీ లెక్క చేయలేదని, పక్షపాతానికి కూడా హద్దులుంటాయని మర్చిపోవద్దని మహవా మొయిత్రా విమర్సించారు.
నేనో పెద్ద గాడిదని, సువేందు ద్రోహాన్ని గుర్తించలేకపోయా.. మమత ఒప్పుకోలు
నమస్తే సార్.. మనమంతా ఒక్కటే
అవును ఇప్పుడు పాలిటిక్స్ వేరు. ఒకప్పటి పాలిటిక్స్ వేరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ.. ఏదో ట్రై చేస్తుంటారు. ఇది కామన్. అయితే.. ఎందుకిలా జరుగుతుంది అనే లెక్కలు వదిలేస్తే.. స్టార్ హీరోలను పొలిటికల్ హీరోలుగా చూసే రోజులు అయితే ఎప్పుడో గంగలో కలిసిపోయాయి. గోదాట్లో కొట్టుకుని పోయాయి. క్రిష్ణానదిలో మునిగిపోయాయి. ఎందుకంటే రాజకీయం అంటే సముద్రం లాంటిది. అన్నీ అక్కడ కలవాల్సిందే.
ఇక పోతే.. స్టార్లు రాజకీయ స్టార్లుగా వెలిగే పరిస్థితి లేకపోవడంతోనే.. రజనీకాంత్ బ్యాక్ స్టెప్ వేశారు. నాకొద్దీ పాలిటిక్స్ అంటూ సైలెంట్ గా హిమాలయాలకు వెళ్లే పనిలో ఉన్నారట. ఇక కమల్ హాసన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. టార్చ్ వేసుకుని ఓట్లు వెతకడానికి బయల్దేరారు. ఫుల్ అయిన థియేటర్ లో ఆన్ లైన్ బుకింగ్ కోసం సీటు వెతికినట్లే ఉందంట. ఎంత టార్చ్ పట్టుకుని వెతికితే మాత్రం దొరుకుతాయా చెప్పండి. కనిపిస్తున్నాయంట కానీ.. క్లిక్ చేసే పరిస్థితి లేదంట. అట్లనే ఉంది కమల్ హాసన్ పరిస్థితి అంటూ.. సినీ స్టైల్ లో కామెడీ చేస్తున్నారు జనాలు.
ఇక పోతే.. మన పవనాలు కూడా అంతే కదా. ఇద్దరికీ ఇప్పుడు పోలికలు పెడుతున్నారు. అర్రే రిజల్టే రాలేదు. ఎన్నికల రిజల్ట్ రాకముందే.. ఈ పోలికలేంటి అనుకోవచ్చు. మరి సినిమా కొబ్బరికాయ కొట్టిన రోజే రివ్యూ రాయడం లేదా అంటున్నారు జనాలు. అట్లనే ఉంది. ఇకపోతే.. మన పవన్ కల్యాన్ కి మల్లే.. అక్కడ కమల్ హాసన్ కి కూడా ఏ మాత్రం క్లారిటీ లేదు అనే టాక్ బయటికి వచ్చింది. సినిమాలు అంటూ.. పాలిటిక్స్ అంటూ కిచిడీ ఎవ్వారాలు చేశారంట కమల్. ఇళ్లలో ఉండి ఇంటి పనులు చేసే మహిళలకి నెలకి మూడు వేలు ఇస్తా అనే ఒక్క హామీ తప్ప.. మరే విషయంలోనూ క్లారిటీ లేదట. కమల్ తరపున కూడా ఒక్కరూ గెలవకపోవచ్చు అంటున్నారు. అంతేనా.. అసలు కనీసం కమల్ హాసన్ అయినా గెలుస్తారా.. మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయిన జనసేన అధినేత లాగే కమల్ కూడా ఓడిపోతారా అనే టాక్ వస్తోంది.
ఒంటికాలితో బెంగాల్‌ని రెండుకాళ్లతో ఢిల్లీని వశపర్చుకుంటా.. మమత ప్రతిజ్ఞ
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బెంగాల్లో ఎన్నికల పోలింగ్‌ను నిలిపివేసే ఎలాంటి ప్రయత్నాన్నయినా తాము అడ్డుకుని తీరుతామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బెంగాల్లో 8 దశలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల కమిషన్ తీరుని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో ఒకటి లేదా రెండు దశల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కానీ పశ్చిమబెంగాల్లో మాత్రం ఎన్నడూ లేనివిధంగా 8 దపాల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. పైగా ప్రస్తుతం కోవిడ్-19 వైరస్ విజృంభిస్తోందని సాకు చెప్పి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను నిలిపివేయవచ్చు కూడా. కానీ నేను అందుకు అనుమతించను. బెంగాల్లో మొదలైన ఎన్నికలను పూర్తిగా నిర్వహించాల్సిందే అని మమత పేర్కొన్నారు.
గాయపర్చి నిలవరించలేరు. ఒంటికాలితోనే బెంగాల్లో గెలిచేస్తాం. మమత సవాల్
తన కాలిని గాయపర్చి ఎన్నికల ప్రచారానికి తనను దూరం పెట్టాలని బీజేపీ కుట్ర పన్నింది. కానీ ఒంటికాలితోనే తిరిగి నేను బెంగాల్లో గెలుపు సాధించబోతున్నాను. భవిష్యత్తులో రెండు కాళ్లతో తిరిగి ఢిల్లీలో కేంద్ర అధికారాన్ని కూడా గెలుచుకుంటాను అని మమత సవాల్ చేశారు. పుర్బా మెదినిపూర్ జిల్లాలో నందిగ్రామ్‌లో ప్రచారం చేస్తున్న మమత మార్చి 10న జరిగిన దాడిలో కాలికి తీవ్రగాయం తగిలిన విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో నేను పాల్గొనకూడదనే దురుద్దేశంతోనే బీజేపీ కార్యకర్తలు నా కాలికి గాయం చేశారు. కానీ ఒంటికాలితో తిరిగి బెంగాల్‌ను గెలువబోతున్నానని, రేపు రెండుకాళ్లతో తిరిగి ఢిల్లీని కూడా గెల్చుకుంటాననే విషయం వారికి తెలీడం లేదు అని మమత వ్యాఖ్యానించారు.
కొంతమంది నేను ముస్లింలను బుజ్జగిస్తున్నానని ఆరోపిస్తున్నారు. కానీ రాష్ట్రంలో నేను ఉన్నంతవరకు హిందువులు, ముస్లింలు కలిసి జీవిస్తారని మాత్రమే ఇలాంటి వారికి నేను సమాధాం చెబుతున్నాను. హిందూ, ముస్లిం సామరస్యత కొనసాగని రోజు నేను బెంగాల్లో ఉండలేను. ఉండబోను అని మమత తేల్చి చెప్పారు.
ముందుంది ముసళ్ల పండగ.. అనిల్ రాజీనామాపై కంగనా హాట్ కామెంట్
ఇది ఆరంభం మాత్రమే.. ముందుంది ముసళ్ల పండుగ అంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్య చేశారు. వందకోట్ల వసూళ్ల కుంభకోణంలో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేసిన ఘటన ముగింపు కాదని కంగనా వ్యాఖ్యానించారు.
సాధువులను హత్య చేసి.. మహిళలను వేధించి, హింసించేవారికి ఎప్పటికైనా ఇలాగే పతనం తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అనిల్ దేశ్‌ముఖ్‌ను ఉద్దేశించి కంగనా హెచ్చరించారు. అంతేకాదు ముందు ముందు ఏం జరుగనుందో చూస్తూ ఉండు అంటూ ఆమె ట్వీట్ చేశారు
మహారాష్ట్ర హోంమంత్రి తన పదవికి రాజీనామా చేసిన సందర్భంగా.. గతంలో ముంబైలోని తన ఆఫీసుపై దాడి, కూల్చివేత విషయాలను గుర్తు చేస్తూ కంగనా తాను చేసిన ట్వీట్‌ని రీట్వీట్ చేశారు. శివసేన బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో కంగనా వ్యాఖ్యలు మళ్లీ దుమారం లేపాయి.
ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ రాష్ట్ర హోంమంత్రి దేశ్‌ముఖ్ మీద చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. 15 రోజుల్లోగా దీనిపై ప్రాథమిక విచారణ నిర్వహించాలని హైకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లుగా పదవిని అంటిపెట్టుకుని ఉన్న అనిల్ దేశ్‌ముఖ్ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
శివసేన ఏలుబడిలోని ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌గా గతంలో కంగనా వర్ణించడంతో శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్, హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆమెపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో ముంబైలోని బాంద్రాలో కంగనా ఆఫీసులో కొంత భాగాన్ని కూల్చిపేయాలని బృహన్ ముంబై కార్పొరేషన్ నిర్ణయించి నోటీసు పంపి 24 గంటలు కాకముందే దాన్ని కూల్చివేయడంపై హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ సమర్థించారు.
తన ఆఫీసులో ఒక భాగాన్ని కూల్చివేయడంతో క్రుద్ధురాలైన కంగనా అప్పట్లోని శివసేన కూటమి ప్రభుత్వం కుప్పగూలిపోతుందంటూ శావనార్థాలు పెట్టిన విషయం తెలిసిందే.
Tamil Nadu Assembly Elections: అయ్యో చిన్నమ్మకు ఇలా జరిగిందేమిటి..!
నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు మొదలయ్యాయి. అసోం, బెంగాల్లోనూ మలి విడత ఎన్నికలు జరగుతూ ఉన్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 3,998 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తమిళనాడులో ఈ ఎన్నికల కోసం 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే, తమిళ మానిల కట్చి ఓ కూటమి కాగా... విపక్ష డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకే మరో కూటమి. అటు కమలహాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం, ఐజేకే, ఏఐఎస్ఎంకే, నామ్ తమిళర్ కట్చి పార్టీలు మరో కూటమిగా బరిలో ఉన్నాయి. టీటీవీ దినకరన్ కు చెందిన ఏఎంఎంకే, డీఎండీకే, ఎస్పీడీఐ మరో కూటమిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన జయలలిత నెచ్చెలి శశికళకు షాక్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. ఆమె పేరు ఓటరు జాబితా నుంచి గల్లంతైంది. ఓటరు జాబితాలో పేరు లేని కారణంగా శశికళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోయారు.
మూడు దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ చిరునామాలోనే ఉంటున్న శశికళ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటు వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్లిన తర్వాత జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అక్కడే నివసిస్తున్న శశికళ, ఇళవరసి సహా 19 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమకు తిరిగి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ శశికళ, ఇళవరసి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. శశికళ పేరును జాబితాలో చేర్చకపోవడంపై థౌజండ్ లైట్స్ ఏఎంఎంకే అభ్యర్థి వైద్యనాథన్ కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ తన కుమార్తెలు అక్షర హాసన్, శ్రుతి హాసన్‌లతో కలిసి చెన్నైలోని తేనాంపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు ప్రముఖులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Tamil Nadu Assembly Elections: చిన్నమ్మని మళ్ళీ పార్టీ లోకి ఆహ్వానించిన పన్నీర్ సెల్వం
తమిళ్ ఎన్నికల్లో ఆ ఒక్క హామీపై ఆసక్తి..పార్టీలన్నీ కమల్ వెంటే
సినిమాల్లో క్రియేటివిటీ కామన్. దాన్ని కాపీ కొట్టడం కూడా కామన్. కమల్ హాసన్ ని ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఇక పాలిటిక్స్ లో కూడా అదే మొదలైంది. కమల్ అలా ఎంట్రీ ఇవ్వగానే కాపీ కొట్టడం మొదలెట్టేశారు. ఇన్స్పైర్ అయ్యారు. ఎన్నికల్లో ఎఫెక్ట్ ఏ మాత్రం ఉంటుంది. కమల్ టాలెంట్ కి రిజల్ట్ ఎవరికి వస్తుంది అన్నది అర్దం కావడం లేదు.
రేపే ఎలక్షన్. ఎవరు గెలుస్తారు అంటే ఎవరి లెక్కలు వారికున్నయ్. ఎక్కువగా అయితే.. డీఎంకే పేరు వినిపిస్తోంది. మరి శశికళ వచ్చాక.. అన్నాడీఎంకే ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా లేదా అన్నది అర్దం కాని ప్రశ్నే. అయితే.. అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు ఉంది కాబట్టి.. అంతా డీఎంకే వైపే ఇంట్రస్ట్ చూపిస్తారు. బీజేపీని తమిళులు పెద్దగా లైక్ చేయరు కాబట్టి.. అదే జరుగుతుంది అనుకున్నారు. కానీ... ఇప్పుడు ఏం జరగబోతుంది అనే ఇంట్రస్ట్ అందరిలోనూ ఉంది. అయితే.. కమల్ క్రియేటివిటీ.. కమల్ థాట్స్ పై కూడా డిస్కషన్ నడుస్తోంది.
నెలకి మూడు వేలు. ప్రతి నెలా మూడు వేలు ఇస్తా. ఇంట్లో ఉండే మహిళలకు నెలకి మూడు వేలు ఇస్తా.. నన్ను గెలిపించండి అంటూ.. టార్చేసుకుని బయల్దేరారు కదా కమల్ హాసన్. అంటే.. వంటింట్లో పని చేసే మహిళలకు గుర్తింపు నిస్తూ.. గౌరవం ఇస్తూ.. ఈ మూడు వేలు ఇస్తారు అనమాట. దీనిపై రకరకాల కామెంట్స్ ఉన్నయ్. వంటింట్లో ఇంటి పని చేసుకునే మహిళలను కూలీలుగా ట్రీట్ చేయడమే ఈ పథకం అంటూ కామెంట్స్ వచ్చాయి.
ఇలా చేస్తే.. మగవారు ఇక వంటింట్లోకి అడుగు కూడా పెట్టరు. నీకు జీతం వస్తుంది కదా అంటారు అనే కామెంట్స్ వచ్చాయి. ఇది మహిళల ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ఆటంకం కలిగించేది అన్నారు. ఇలా చాలా కామెంట్స్ చేశారు. కానీ.. పార్టీలు మాత్రం ఫాలో అయ్యాయి. డీఎంకే, అన్నా డీఎంకే కూడా వెయ్యి రూపాయలు ఇస్తాం అని అనౌన్స్ చేశాయి. అయితే.. 3 వేలు ఇస్తాం అన్న కమల్ కంటే కూడా వెయ్యి రూపాయలు ఇస్తాం అన్న.. ఈ రెండు పార్టీలకే ఈ హామీ ఎక్కువగా ఉపయోగ పడుతుంది అనుకుంటున్నారు.
ఓరి నాయనో ఏం హామీలు.. ఇది సినిమా కాదు కమల్ సార్
మమత ఆరోపణ అబద్దం.. ఆమెపై చర్యకు సిద్ధం.. ఈసీ ప్రకటన
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత ఆ రాష్ట్రంలో రెండో దశ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ వద్దే రెండు గంటలపాటు కూర్చున్న చర్య పశ్చిమ బెంగాల్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం వేసిందని కేంద్ర ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. పైగా నందిగ్రామ్ జిల్లాలోని సదరు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరుగుతోంటూ మమత చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రకటించింది.
గత వారం నందిగ్రామ్ లోని పోలింగ్ బూత్ వద్ద మమతా బెనర్జీ ప్రవర్తనపై నిశితంగా పరిశీలన జరుపుతున్నామని ఎన్నికల కమిషన్ సూచించింది. ఆ పోలింగ్ బూత్‌లో ఓటు వేయనీకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారంటూ మమత రాతపూర్వకంగా చేసిన ఆరోపణ సత్యదూరమని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నైతిక నియమావళికి చెందిన సెక్షన్ల కింద తాను చర్య చేపడతానని కూడా ఈసీ పేర్కొంది. కానీ ఈసీ నిర్ణయాన్ని ఖండించిన మమతా బెనర్జీ ఇది ఆమోదనీయం కాదని ఈ వ్యవహారంపై తాము కోర్టుకు వెళతామని హెచ్చరించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రబిందువుగా నిలిచిన నందిగ్రామ్ నియోదకవర్గంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రత్యర్థి సువేందు అధికారిపై తలపడుతున్నారు. గతంలో మమతకు ఎంతో సన్నిహితనేతగా ఉండిన సువేందు తర్వాత బీజేపీలోకి జంప్ చేసి మమతకు సవాల్ విసిరారు. దమ్ము ఉంటే తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో తనతో పోటీ చేయాలని సువేందు సవాల్ విసిరారు. దీంతో దూకుడుకు మారుపేరైన మమత నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తానని ఎదురు సవాల్ చేశారు.
రెండో దశ పోలింగ్ సందర్భంగా, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న ముఖ్యమంత్రి నందిగ్రామ్ లోని ఒక పోలింగ్ బూత్ వద్ద బీజీపీ, తృణమూల్ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో తలదూర్చి రెండుగంటలపాటు ఆ పోలింగ్ బూత్ వద్దే కుర్చీలో భైటాయించి నేరుగా గవర్నర్‌కి కాల్ చేశారు. స్థానికుల ఆమెపై తిరగబడటంతో భద్రతా బలగాలు ఆమెను కాపాడి బయటకు తీసకొచ్చారు.
కాగా పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మమత ఆరోపించడం సంచలన కారణమైంది. దీనిపై విచారణ మొదలెట్టిన ఎన్నికల కమిషన్ మమత సరళిపై తీవ్రవిచారం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన ఒక వార్తను ప్రాతిపదికగా చేసుకుని గౌరవనీయ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మమత నేరుగా సంబంధిత పోలింగ్ బూత్‌వద్దకు వెళ్లి గంటలపాటు వివాదాన్ని సృష్టించడం ఏమాత్రం సరైన ప్రవర్తన కాదని ఈసీ స్పష్టం చేసింది.
పోలింగ్ కేంద్రాల సమీపంలో తిష్ట వేసి అసహజంగా వ్యవహరించిన నేరకు జరిమానా విధించవచ్చని, మూడు నెలల జైలు శిక్ష కూడా విధించవచ్చని ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని 131వ సెక్షన్ పేర్కొంటోందని ఈసీ గుర్తు చేసింది.
అయితే హోంమంత్రి అమిత్ షా ఆజ్ఞలను శిరోధార్యంగా తీసుకున్న ఎన్నికల కమిషన్ పోలింగ్ రోజున తమ పార్టీ చేసిన 63 ఫిర్యాదులలో ఏ ఒక్కదాన్ని పట్టించుకోలేదని, ఈ విషయంపై తాము కోర్టుకెళతామని మమత సవాల్ చేశారు.
బెంగాల్ చేజారింది.. వారణాసికి రండి దీదీ.. ప్రధాని మోదీ ఎద్దేవా
బెంగాల్ తమరి చేజారిపోయింది కాబట్టి దీదీ ఇప్పుడు బయటిప్రాంతంలో నివాసంకోసం వెదుకుతున్నట్లుందని, వారణాసికి వస్తే ఆదరిస్తామని ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అపహాస్యం చేశారు. హాల్డియా నుంచి వారణాసికి ఒక ఓడ కూడా సిద్దంగా ఉందని ఎప్పుడైనా మమత దాంట్లో ఎక్కి వారణాసికి రావచ్చని ప్రధాని సూచించారు. పైగా వారణాసి ప్రజలు చాలా విశాల హృదయులు కాబట్టి మమతను వారు టూరిస్టు అని అవుట్ సైడర్ అని పిలవబోరని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అయితే వారణాసిలో చాలామంది ప్రజలు తిలకం ధరిస్తారని, జై శ్రీరాం అని నినదిస్తారని అక్కడ మీరు ఎవరిపైనా ఆగ్రహం వ్యక్తం చేయలేరని మోదీ చెప్పారు. దయచేసి వారణాసి ప్రజలపై ఆగ్రహం ప్రదర్శించవద్దు దీదీ. వారు మీతో కలిసి జీవిస్తారు. వారు మిమ్మల్ని ఢిల్లీ వెళ్లనీయరు. వారణాసిలోనే వారు మిమ్మల్ని ఉండనిస్తారు అని మోదీ పశ్చిమబెంగాల్ సీఎంకు సూచించారు. 2014, 2019లో రెండు దఫాలు వారణాసి లోక్ సభా నియోజకవర్గం నుంచే మోదీ పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రధానాయుధం ఏమిటంటే బీజేపీ రాష్ట్రం వెలుపలి నుంచి వచ్చిన ఔట్ సైడర్ అని ఆరోపించడమే. మోదీపై చాలాసార్లు మమతా చేసిన దాడి కూడా ఇదే మరి. బెంగాల్ సంస్కృతిని బీజేపీ ధ్వంసం చేస్తుందని ఆమె పదే పదే చెబుతూ వచ్చారు.
నందిగామ్ కాకుండా మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారా అని మోదీ బెంగాల్ సీఎం దీదీని అపహాస్యం చెప్పినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. వచ్చే ఎన్నికల్లో మమత వారణాసి నుంచే పోటీ చేస్తారని సవాలు చేసింది. బెంగాల్ ఎన్నికల్లో మమత తీవ్ర అభద్రతను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆమె రాష్ట్రం బయటినుంచి పోటీ చేస్తే మంచిదని ప్రధాని మోదీ ఇటీవలే హేళన చేశారు.
తాను కూడా ఔట్ సైడర్ కాబోతున్నానని బీజేపీ తనపై చేస్తున్న ఆరోపణలను శనివారం 24 ఉత్తర పరగణాల జిల్లాలో ర్యాలీ సందర్భంగా మమత తిప్పికొట్టారు. బీజేపీ బెంగాల్‌ను విభజించాలని కోరుకుంటోంది. వీళ్లు బెంగాల్‌ను దాని భాషను, సంస్కృతిని అంతమొందించాలని చూస్తున్నారు. అందుకే మైనారిటీ సోదరసోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నా.. మీ ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తపడండి అంటూ మమత సూచించారు.
అస్సాం సమస్యలన్నీ తీర్చేశా.. గెలుపు మాదే.. ప్రధాని మోదీ ధీమా
అస్సాం అసెంబ్లీ ఎన్నికలల్లో ఎన్డీయే తప్పక గెలుపు సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. గత అయిదేళ్ల కాలంలో అస్సాం సమస్యలన్నింటినీ తాను పరిష్కరించేశానని, డబుల్ ఇంజిన్‌తో పనిచేసిన తన ప్రభుత్వం అస్సాంకు గత అయిదేళ్లలో రెట్టింపు ప్రయోజనాలను అందించిందని ప్రధాని చెప్పారు.
తన ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకం జాతి, మత, ప్రాంతాలకు అతీతంగా అమలు జరుగుతూ వచ్చిందని, తన హయాంలోనే అస్సాంలోని ప్రతి తెగ, వర్గానికి చెందిన ప్రజలు పక్కా ఇళ్లను, టాయెలెట్లను, గ్యాస్ కనెక్షన్లను పొందగలిగారని ప్రధాని గుర్తు చేశారు.
శనివారం అస్సాంలోని తముల్పూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ అస్సాం ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చానని, గత అయిదేళ్ల తన పాలనలో అస్సాం రెండు రెట్ల ప్రయోజనాలను పొందగలిగిందని చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయరా.. ఎంత ధైర్యం.. నడ్డా మండిపాటు
తాను అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోనంటూ కాంగ్రెస్ పార్టీ అస్సాంలో ఎన్నికల ప్రచార సందర్బంగా హామీ ఇవ్వడంపై బీజేపీ మండిపడింది. ప్రజలను పక్కదోవ పట్టించడం తప్పితే ఇలా హామీలు ఇస్తున్నవారికి ఇంగిత జ్ఞానం కూడా లేనట్లుంది అంటూ బీజేపీ దుయ్యబట్టింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం అస్సాంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ హామీలను ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమంటూ చెబుతున్న వ్యక్తుల హామీలను తాను అర్థం చేసుకోలేకపోతున్నానని నడ్డా వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చగలదా.. వీళ్లు ప్రజలను ఏమారుస్తున్నారు. ఇలా చెబుతున్న వారి జ్ఞానం ఎంత సంకుచితంగా ఉందో అర్థమవుతంది. ఇలాంటి హామీలు వారి కాంగ్రెస్ పార్టీ నైతిక దివాళాకోరుతనాన్ని మాత్రమే తెలియజేస్తాయి అంటూ నడ్డా మండిపడ్డారు.
తమిళనాడులో బీజేపీని పక్కన బెట్టేసిన అన్నాడీఎంకే
తమిళనాడు అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని కూటమిలో చేర్చుకున్నప్పటికీ ఆ పార్టీని ప్రచార సమయంలో ఆమడ దూరంలో పెడుతున్న అధికార అన్నాడీఎంకే పార్టీ కూటమి ధర్మాన్ని కూడా పక్కన బెట్టడానికి బలమైన కారణమే ఉంది మరి. దక్షిణ, మధ్య తమిళనాడు జిల్లాల్లో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్న సూచనలు ఇప్పటికైతే కనిపించలేదు కానీ, బీజీపీ జాతీయ నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు పూర్తిగా దాసోహమైపోయారనే ఆరోపణే పళనిస్వామికి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెడుతోంది. ఎన్నికల్లో గెలుపును కూడా ఇది ప్రభావింతం చేస్తుందని పరిశీలకుల అంచనా.
అన్నాడీఎంకే కూటమిలో భాగమైన బీజేపీకీ ఈ ఎన్నికల్లో 20 స్థానాలను ఇచ్చారు. 2016 ఎన్నికల్లో బీజేపీ 188 స్థానాల్లో పోటీచేసి 2.84 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. కాగా పోటీ చేసిన 180 స్థానాల్లో డిపాజట్లు కోల్పోయింది కూడా.
అందుకే అన్నాడీఎంకేను ఇప్పుడు బీజేపీ భూతంలా వణికిస్తోంది. జయలలిత విషాద మరణం తర్వాత అన్నాడీఎంకేలో చీలిక రాకుండా చేసిన ఎడప్పాడి పళనిస్వామి సమర్థత పట్ల సర్వత్రా ప్రశంసలు లభించాయి కానీ ఆయన ప్రభుత్వ విజయాల పట్ల జనంలో పెద్దగా స్పందన రావడం లేదు. జయలలిత ప్రజాకర్షణ, ఎం కరుణానిధి వాగ్దాటి రెండూ లేని పళనిస్వామి రాష్ట్రంలో బీజేపీకున్న విలువ ఏపాటిదో అర్థమై తన పార్టీ ప్రచార సభల్లోకి కనీసం బీజేపీ నాయకులనైనా ఆహ్వానించలేదు.
ప్రధానంగా దశాబ్దాలుగా తమిళనాడులో ద్రావిడవాదం బలీయంగా కొనసాగుతోంది. కానీ కరుణానిధి, జయలలితలు లేకుండా తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ జాతీయ వాదం తన హవా మునుపటిలా కొనసాగిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకమే కానీ అలా చెప్పి బీజేపీని దగ్గరకు తీసుకునే ఏ పార్టీకైనా తమిళ రాజకీయాల్లో స్థానం ఉండదని చరిత్ర చెప్పింది.
ఈ నేపథ్యంలోనే ద్రవిడ జాతీయవాదం గెలుస్తుందా ఓడుతుందా అనే వాదనను పక్కనబెట్టి అన్నాడీఎంకే నేతలు, అభ్యర్థులు వాస్తవిక దృష్టితోనే బీజేపీని అలా పక్కనబెట్టేశారు. చివరకు పరిస్థితి ఎలా తయారయిందంటే చెన్నయ్ హార్బర్ నియోజకవర్గం, రోయాపురం, జోలార్ పేట, దిండిగల్ వంటి చోట్ల బీజేపీ నేతల ప్రమేయం లేకుండానే అన్నాడీఎంకే అభ్యర్థులు గుట్టు చప్పుడు కాకుండా ప్రచారంలో మునిగిపోయారు. ఈ స్థానాలన్నింట్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉండటంతో బీజేపీ నేతలను అధికారపార్టీ దగ్గరకు రానివ్వడం లేదు. పైగా బీజేపీ, వీహెచ్‌పీ పోటీ చేస్తున్న స్థానాల్లో పొరపాటున కూడా ప్రచారానికి వెళ్లకుండా, కూటమి ధర్మం పాటించకుండా అన్నాడీఎంకే జాగ్రత్తగా పావులు కదువుతోంది.
మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే.. బీజేపీ అభ్యర్థులు సైతం అన్నాడీఎంకే కండువాలతో పోటీచేయడమే. అనేక నియోజకవర్గాల్లో వారు తమ జాతీయ నేతలైన నరేంద్ర మోదీ, అమిత్ షాల ఫోటోలు పట్టుకుని తిరగడం లేదు. జయలలిత ఫోటోనే నమ్ముకుని, అన్నాడీఎంకే జెండాలనే చేబూని వెళుతుండడం కనిపించింది. మరీ ముఖ్యంగా కుష్బూ, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై, నయనార్ నాగేంద్రన్, పి. శరవరణన్, పాండురంగన్, మురుగన్ వంటి బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ జయలలిత ఆశీస్సులున్న అభ్యర్థులం అని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు తప్పితే పొరపాటున కూడా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల పేర్లనైనా ప్రస్తావించడం లేదు.
పైగా అనేక నియోజవర్గాల్లో అన్నాడీఎంకే అభ్యర్ధులు మమ్మల్ని ప్రచారంలోకి రానివ్వడం లేదు. ఒకవేళ గట్టిగా పట్టుబడితే, వస్తే రండి గానీ, కాషాయ కండువాలు, బీజేపీ జెండాలు చేబూనకుండా వచ్చి పాల్గొనండి అని చెబుతున్నారు అని ఓ బీజేపీ నాయకుడు వాపోవడం పరిస్థితిని వివరిస్తోంది. బీజేపీతో చెలిమి వల్ల అన్నాడీఎంకే కూడా ఆర్యుల పార్టీ, హిందీ రాష్ట్రాల వారి పార్టీ అన్న విమర్శ వచ్చింది. దీనిని తట్టుకునేందుకు, బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నా.. ఉమ్మడి ప్రచారానికి అన్నాడీఎంకే శ్రేణులు విముఖత వ్యక్తం చేయడం విశేషం. మోదీ-షాల ఎన్నికల మేనేజ్మెంట్ ఏ మాత్రం పనిచేయని తమిళనాట వాదం, కులం ప్రధాన అంశాలయ్యాయని అంటున్నారు.
రాజకీయాలపై కమల్ కామెంట్స్.. ఆయన్ను టార్గెట్ చేసిన నటి గౌతమి
మొత్తం మీద చూస్తే దేశం మొత్తం మీద నరేంద్రమోదీ, అమిత్ షాల ఊసే లేకుండా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం ఏదన్నా ఉందా అంటే అది తమిళనాడు మాత్రమే, ఎన్నికలకు ముందు కూడా ద్రవిడ జాతీయ వాదం ఇక్కడే తన ఉనికిని ప్రదర్సిస్తోంది మరి.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020