తెలంగాణలో తొలి కరోనా వ్యాక్సిన్ వేయించుకునేది అతడే..!
దేశం లోని పలు ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ ను అత్యంత పటిష్ట భద్రత మధ్య తరలించారు. వ్యాక్సిన్లను మొదట కోవిద్ వారియర్లకు అందించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో తొలి కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు వెల్లడించారు.
జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అవ్వనుంది. తెలంగాణలో తొలి టీకాను ఓ పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నారు. కరోనా నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో గత 10 నెలలుగా సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా వేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభం అవుతుంది. తొలి రోజు టీకా వేసే 139 కేంద్రాలూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. తొలి రోజు 99 ప్రభుత్వ కేంద్రాలు, 40 ప్రైవేటు ఆసుపత్రులలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ప్రైవేటు ఆసుపత్రులలో వేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో టీకాలు వేస్తే, సమస్యలపై అవగాహన వస్తుందని ప్రభుత్వం భావించింది. తొలి వారంలో ప్రభుత్వ ఆసుపత్రులలోనే టీకా కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ తర్వాతి నుంచి ప్రైవేటు ఆసుపత్రులలోనూ టీకా వేయనున్నారు. ఇక యాప్ లో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. టీకా పంపిణీ తర్వాత కూడా సమస్యలు ఎదురైతే ఆఫ్‌లైన్‌లోనే సమచారాన్ని పొందుపరచాలని సూచించారు.
టీకా వేసిన తర్వాత స్వల్పంగా దుష్ఫలితాలు వెలుగు చూస్తే వెంటనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సమస్య తీవ్రతను బట్టి వైద్య సేవలు అందించేందుకు 235 ఆసుపత్రులను ఎంపిక చేసింది. ఇందులో 57 ప్రభుత్వ ఆసుపత్రులు, 178 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. మొత్తంగా 1200 పడకలను సిద్ధం చేసింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత కొందరిలో జ్వరం, చిరాకు, ఇంజెక్షన్ తీసుకున్న ప్రదేశంలో నొప్పి, వాపు, ఏదో తెలియని అసౌకర్యం, అస్వస్థత వంటి లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో తీవ్ర అలర్జీ, 102 డిగ్రీలకు పైగా జ్వరం వచ్చే అవకాశం ఉంది. మరికొందరిలో మాత్రం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇవ్వాల్సి రావొచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దుష్ఫలితాలు తలెత్తితే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అత్యవసరంగా 20 వేల ప్రత్యేక కిట్లను సిద్ధం చేసింది. ఒక్కో కేంద్రంలో ఒక్కో కిట్ అందుబాటులో ఉంటుంది.
ప్రాంక్ షో.. అశ్లీల ప్రశ్నలు ఆడవాళ్లను అడుగుతుండడంతో తాట తీస్తున్న పోలీసులు..!
ప్రాంక్ వీడియోలు.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాంక్ లు చేసే ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ను కూడా ఇస్తూ ఉంటాయి. కానీ ఇదే ప్రాంక్ షోల కారణంగా ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి. ప్రాంక్ షో కదా ఇష్టమొచ్చిన ప్రశ్నలు వేద్దాం.. ఇష్టమొచ్చినట్లు చేద్దామని అనుకుంటే మన దేశంలో అసలు కుదరదు. అధికారులు, పోలీసులకు తెలిస్తే తాట తీస్తారు. ఇక వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి కదా అని అశ్లీల ప్రశ్నలు కూడా వేసే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆడవారిని అలాంటి ప్రశ్నలు అడగడం.. అశ్లీలమైన ప్రశ్నలు అడగడం చేస్తూ ఉంటారు.
ఇలా ప్రాంక్ షో పేరిట అశ్లీల ప్రశ్నల్ని అడిగిన ఓ యూ ట్యూబ్ ఛానల్ ను పోలీసులు పట్టేసుకున్నారు. ఆడవారిని అశ్లీల ప్రశ్నలు అడుగుతూ ఉండడంతో అడ్డంగా బుక్కైంది. ఆ నిర్వాహకుడు సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై టాక్స్ పేరిట ఉన్న ఓ యూ ట్యూబ్ చానల్ ప్రాంక్ చేస్తూ ఉంది. ముందుగా తామే ఎంపిక చేసుకున్న ఓ యువతి ద్వారా అశ్లీల ప్రశ్నలను వేశారు.. ఆమె ఆ విషయాన్ని ఏ మాత్రం దాచుకోకుండా చెప్పేసింది.
ఇక అదే ప్రశ్నల్ని మరికొందరి యువతులను అడుగుతూ సమాధానాలు రాబట్టే యత్నం చేస్తూ ఉన్నారు. వీరు అడిగిన ప్రశ్నలు అశ్లీలంగా ఉండడంతో చెన్నై లోని బీసెంట్‌నగర్‌లో చిత్రీకరణ సాగుతున్న సమయంలో స్థానికులు అడ్డుకుని.. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
ఆ 'యూ ట్యూబ్' ఛానల్ అంతా అశ్లీలంతో కూడిన ప్రశ్నలు, సమాధానాలు, షోలు ఉండడంతో పోలీసులు ప్రాంక్ ల నుండి రియాలిటీ ఏంటో చూపించారు. ఆ ఛానల్ నిర్వహిస్తున్న దినేష్‌ను,యాంకర్ అజీం బాచ్చా, కెమెరామన్ అజయ్బాబులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్ మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ప్రాంక్ వీడియోలు అంటూ యూట్యూబ్ ఛానల్స్ పేరిట చాలా మందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. హాస్యం తెప్పించే వరకూ ఓకె కానీ.. అది అశ్లీలతకు తావు ఇస్తే మాత్రం పోలీసులు కన్నెర్రజేస్తూ ఉన్నారు.
భోగి పండుగ అంటే ఏమిటి?
ప్రతి మాసంలో సంక్రాంతి ఉన్నప్పటికీ మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండటానికి శాస్త్రపరంగా అనేక కారణాలు ఉన్నాయి. మనకు రెండు ఆయనములు ఉన్నాయి. ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం, మిగతా ఆరు నెలలు దక్షిణాయణం.
ఏడాదిలో ఆర్నెల్ల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. ఆర్నెల్ల దక్షిణాయణం దేవతలకు ఒక రాత్రి. దేవతలు మేలుకొని ఉండే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం గనకే దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు మారిన ఈ సంక్రాంతికి అత్యంత ప్రాధాన్యత.
ఈ ఏడాది జనవరి 14వ తేదీ ఉదయం 8.15గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ రోజు మకర సంక్రాంతి. 13న భోగి, 15న కనుమ, 16న ముక్కనుమ.
భోగి విశేషాలు..
సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. భోగభాగ్యాలు ఇచ్చే పర్వదినం. ఈ రోజున ప్రతిఒక్కరూ తెల్లవారు జామునే లేచి తలస్నానమాచరించాలి. సూర్యోదయానికి ముందే భోగి మంటలను వెలిగించాలి లేదా దర్శించుకోవాలి.
భోగి రోజున ఇంట్లో పాత సామాన్లు తీసేసి సంక్రాంతి రోజు కొత్త సామాన్లు తెచ్చుకొనే సంప్రదాయముంది. నూతన వస్తువులు కొత్తదనానికి, ఆనందానికి, అభ్యుదయానికి చిహ్నంగా ఈ పండుగను భావిస్తారు. భోగి రోజు నుంచి చలిని తొలగించడం, కొత్త వాటితో నిత్యనూతన జీవితం ప్రారంభించడానికి ఓ గుర్తుగా భోగి మంటలను వెలిగిస్తారు.
భోగిమంటలను ఎలా దర్శించాలి?
తెల్లవారు జామునే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి భోగి మంటల వద్దకు వెళ్లాలి. అగ్ని దేవుడిని, సూర్యభగవానుడిని తలచుకొని ప్రతిఒక్కరూ తమ ఇష్టదైవాన్ని, ఇలవేల్పుని మనసులో స్మరించుకొని మంటలను దర్శించుకోవాలి. భోగి రోజుకున్న మరో ప్రాముఖ్యత.. ఆ రోజు సాయంత్రం పిల్లకు భోగిపండ్లు పోస్తారు. ఆ రేగు పండ్లు సూర్యుడికి ప్రీతిపాత్రమైనవి. వీటిని సూర్యాస్త సమయంలో పిల్లల తల మీద నుంచి పోయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం కలిగి ఆరోగ్యం కలుగుతుందని, వారికి ఉన్న నరదృష్టి తొలగి, మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
సిటీ ఖాళీ.. రోడ్లపై జాలీ
అప్పుడూ ఇప్పుడూ అనేది ఏముంది చెప్పండి. ఎప్పుడైనా సరే.. సంక్రాంతి వస్తుందంటే.. హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది ఆ విషయం తెలిసిందే కదా. ఇప్పుడు కూడా అంతే. హైదరాబాద్ ఖాళీ అవుతోంది. ఆంధ్రకు వెళ్లే అన్ని రోడ్లూ బిజీ బిజీగా ఉన్నాయి. కార్లు, బస్ లు.. బైక్ లు లారీలు.. అవీ ఇవీ అని ఏం లేదు. ఏది దొరికితే అదే అంటూ బయల్దేరుతున్నారు. మొన్ననే సిటీ నుంచి చాలా మంది పోగా.. నిన్న లక్షల మంది ఖాళీ చేశారు. ఎక్కువ ఆంధ్రప్రదేశ్ దారి పట్టారు. నిన్న పది లక్షల మంది దాకా ఆంధ్రకి తరలిపోయినట్లు తెలుస్తోంది. ఇవ్వాళ్టి నంబర్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇంకో ఏడెనిమిది లక్షలు ఉండొచ్చు. అంటే.. ఇవ్వాళ దాదాపుగా.. 18 నుంచి 20 లక్షల మంది సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్తారనేది అంచనా. ఏదెలా ఉన్నా.. రేపటికి మాత్రం సగం సిటీ ఖాళీ అవుతుంది అనడంలో ఎలాంటి డౌటూ లేదు.
కేవలం ఆంధ్ర ప్రదేశ్ వాళ్లే కాదు. తెలంగాణలో ఇతర జిల్లాల వాళ్లు కూడా సిటీ నుంచి ఇంటి బాట పట్టారు. ఇటు జర్నీ కాస్త తక్కువగానే ఉన్నా.. వీళ్లు కూడా ఇళ్లకే వెళ్తారు. పండగ రెండు మూడు రోజులు సిటీలో ఏముంటుందిలే.. మనం కూడా వెళ్దాం అనుకుని దారి పట్టేవాళ్ల సంఖ్య కూడా చాలానే ఉంటుంది. ఇక హైదరాబాద్ వాళ్లు.. తెలంగాణ వాళ్లు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆతిథ్యం తీసుకోవడానికి వెళ్తారు. ఆత్మీయంగా పలకరిస్తూ.. ఆతిథ్యం ఇచ్చే ఆంధ్రప్రదేశ్ కి లక్షల మంది వెళ్తుంటారు. మిగతా టైంలో వెళ్లినా వెళ్లకున్నా.. మా ఊళ్లో సంక్రాంతి బాగా చేస్తారు అంటూ.. చుట్టాల్ని.. ఫ్రెండ్స్ ని ఇళ్లకి తీసుకెళ్లడం ఆంధ్రప్రదేశ్ జనాలకి అలవాటే. మిగతా వాళ్లు కూడా మిగతా టైంలో ఎలా ఉన్నా.. సంక్రాంతి టైంలో ఆంధ్ర ఆతిథ్యం తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. అందుకే.. వీళ్ల సంఖ్య కూడా బానే ఉంటుంది.
ఇంకేంటి చెప్పండి.. ఓ పక్క ఆంధ్ర వాళ్లు.. మరో పక్క మిగతా తెలంగాణ జిల్లాల వాళ్లు అంతా సిటీ ఖాళీ చేస్తున్నారు. మూడు రజుల పాటు.. సిటీ రోడ్లపై తొక్కుడు బిళ్ల ఆడుకున్నా.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇక హైదరాబాద్ టు విజయవాడ రూట్ మొత్తం ఎప్పటిలాగే ఫుల్ అయిపోయింది. ఊళ్లకి వెళ్తున్న జనంతో నిండిపోయింది. అయినా సరే.. అంతా జాలీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు.
భాగ్యనగరంలో మిడ్ నైట్ దోశ.. కేరాఫ్ అడ్రస్ రామ్ కీ బండి..!
రామ్ కీ బండి.. ఎంత స్పెషల్ అంటే ఎవరైనా హైదరాబాద్ వస్తే ఒక్కసారి తప్పకుండా ఈ బండి దగ్గర దోశ తినాలని అనుకోవడం కామన్. ఎవరైనా హైదరాబాద్ నగరంలో కాలు మోపగానే.. రాత్రంతా ఒక రౌండ్ వేయాలని.. ట్యాంక్ బండ్.. నక్లెస్ రోడ్.. చార్మినార్ ఇలా కొన్ని ప్రదేశాలు చూడాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. అలా అలా ఒక సెకండ్ షో సినిమా చూసేసి.. హైదరాబాద్ అంతా ఒక షికారు వేస్తే వచ్చే మజా అదనం. అలా నైట్ అంతా షికారు చేసి అలసిన వాళ్ళకి.. ఫుడ్ లవర్స్ కి.. నైట్ డ్యూటీ చేసి వెళ్తూ వెళ్తూ తినేసి పడుకుందాం అనే వాళ్ళకి ఓ సూపర్ టేస్టీ టిఫిన్స్ ను అందించడం ఒక రామ్ కీ బండికి మాత్రమే సాధ్యం.
హైదరాబాద్ నగరంలో గల్లీకి నాలుగైదు టిఫిన్ సెంటర్స్ ఉన్నా.. రాత్రి సమయంలో టిఫిన్ అందించే బండ్లు ఉన్నా..కుర్రాళ్ళ నుండి వృద్ధుల వరకు నైట్ టిఫిన్ అంటే ఫస్ట్ ఆప్షన్ రామ్ కీ బండి. అంతగా ఈ టిఫిన్ సెంటర్ అట్రాక్ట్ చేసేస్తుంది. అయితే.. ఇక్కడ తినాలి అంటే మాత్రం మినిమం ఉదయం 3 గంటలు కావాలి. అప్పటి వరకు అక్కడ గప్ చుప్ గా ఉన్న వాతావరణం రామ్ కి బండి ఓపెన్ చేయగానే ఆ ప్రాంతం సందడిగా మారిపోతుంది. ముందుగా ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ లో ఏం ఐటెం కావాలో టోకెన్స్ తీసుకోవడం దగ్గర నుండి సందడి మొదలవగా.. ఒక్కొక్కరిగా తమ ఆర్డర్లను తీసుకుంటూ.. లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే ఒక్కటి తిందాం అనుకుని వచ్చిన వాళ్ళు మరొకటి లగించేసి వెళ్ళడం ఖాయం. అర్ధరాత్రి టిఫిన్స్ అంటే ఈ రామ్ కీ బండి ఒక బ్రాండ్ కాగా.. హైదరాబాద్ లోని బెస్ట్ దోశ ఇక్కడ దొరకడం విశేషం.
ఇక ఈ సెంటర్ చరిత్ర తెలుసుకుంటే.. అర్ధరాత్రి సమయంలో తినాలి అనుకునే వాళ్ళ కోసమే 1989లో ఈ రామ్ కీ బండి వెలియగా రామ్ భాయ్ అని పిలుచుకునే రామ్ షిండే ఈ సెంటర్ కు తొలుత శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత టేస్ట్ నగర వాసులకు తెగ నచ్చేయడం, అది కూడా వెజిటేరియన్ కావడంతో సిటీలో ఇదో ఫేమస్ అయిపోయింది. పగలంతా మొజంజాహీ మార్కెట్ ఈ ఏరియాకి ఫేమస్ అయితే.. రాత్రికి రామ్ కీ బండి ఆ ఏరియాకి కళ తెచ్చిపెడుతుంది. ఒక దక్షిణ భారత వంటకాల్లో.. అదీ దోశలో ఇన్ని వెరైటీలు ఉంటాయా అన్నది రామ్ కీ బండి దగ్గరకు వెళ్తేనే అర్థం అవుతుంది. ఉదయం 3 నుండి 8 గంటల వరకూ మాత్రమే కనిపించే ఈ టిఫిన్ సెంటర్.. కొన్ని కొన్ని సార్లు వాళ్లు తెచ్చుకున్న ఫుడ్ ఐటెమ్స్ కు సంబంధించిన వస్తువులన్నీ అయిపోతే ఇంకా ముందే మూతపడినా ఆశ్చర్యం లేదు.
ప్లెయిన్ దోశ దగ్గర నుండి.. షెజ్వాన్ దోశ వరకూ ఇక్కడ వెరైటీలకు కొదువే లేకపోగా.. ముఖ్యంగా ఇక్కడ దొరికే పిజ్జా దోశకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక దూదిలాగా ఉండే ఇడ్లీ మెత్తగా గొంతులోకి వెళ్ళిపోతుంటే ఆ ఆనందమే వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే అర్ధరాత్రి వేళ.. హాయిగా మనసుకి నచ్చినట్లు తినాలనుకుంటే లేట్ చేయకుండా రామ్ కీ బండి వద్దకు దారి వెతుక్కొడమే. పనిలో పనిగా అలా అలా అర్థరాత్రి వేళ నగర అందాలను ఓ లుక్కేసుకుంటూ ఎంచక్కా కడపునింపుకొని రావచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడ అన్ని రకాల బ్యాంకుల కార్డులు, డిజిటల్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుండడంతో జేబులో పైసలేసుకోవాల్సిన పనికూడా లేదు. సోషల్ మీడియాలో కూడా రామ్ కీ బండికి మంచి పేరే ఉండడం.. ఒకసారి వెళ్లిన వాళ్ళు చేసే మౌత్ పబ్లిసిటీ నగరంలో ఇప్పుడు ఇదొక బ్రాండ్ గా మారిపోయింది. ఈ టిఫిన్ సెంటర్ గురించి ఏమైనా చెప్పాలి అంటే.. హైదరాబాద్ లో ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్లి టెస్ట్ చేయొచ్చు.. అదే హైదరాబాద్ కి రావాలి అని అనుకునే వారు వాళ్ళ.. విష్ లిస్ట్ లోకి రామ్ కీ బండిని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ బండి తెలిసిన వాళ్లైతే మళ్లీ నోరూరాడం ఖాయం కనుక ఇంకెందుకు ఆలస్యం చలో మోజంజాహీ మార్కెట్ ఏరియా...
ఎంటర్ ద బర్డ్ ఫ్లూ
వచ్చిందయ్యా ప్రాణాలు తీయడానికి. ఇప్పటికే కరోనాతో చచ్చిపోతుంటే.. ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఒకటి తయారైంది. అదేంటో ఈ దరిద్రం ఈసారి కాకుల్లో కూడా వస్తోంది బర్డ్ ఫ్లూ. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా టెన్షన్ తగ్గుతున్నా.. బర్డ్ ఫ్లూ టెన్షన్ పెరుగుతోంది. ఆల్రడీ కోళ్లకి డిమాండ్ తగ్గిపోయింది. చికెన్ లు తినడాలు తగ్గిస్తున్నారు జనాలు. ఇప్పుడు ఏపీలోకి కూడా ఎంటర్ అయింది బర్డ్ ఫ్లూ.
అయితే ఇంకా ఫైనల్ కాలేదు. విశాఖలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది అనేది జనం అనుమానం. అక్కడ చరిత్ర కలిగిన చెట్లపై కాకులు ఎప్పుడూ నివాసం ఉండే చోట.. గిర్ర గిర్ర తిరిగి.. కింద పడి చనిపోయాయి కాకులు. ఒకటి చనిపోయింది అని టెన్షన్ పడుతున్న టైంలోనే ఇంకోటి కూడా సేమ్ సిమ్టమ్స్ తో చనిపోయింది. వారం రోజులుగా బర్డ్ ఫ్లూ వార్తలు వింటూనే ఉన్నాం కదా. లోకల్ గా కూడా ఆ భయం పట్టుకుంది. కాకులకి బర్డ్ ఫ్లూ వస్తుందని వింటూనే ఉన్నాం.. చూస్తూనే ఉన్నాం. వాటి లక్షణాలు కూడా తెలిసినవే కదా. సేమ్ టు సేమ్ లక్షణాలతో గిర్ర గిర్ర తిరిగి పడిపోయి చనిపోవడంతో జనంలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. డాక్టర్లకంటే ముందే సైంటిస్టుల కంటే ముందే మనిషి సెన్స్ కి ఇలాంటివి ముందే తడతాయి. సో.. విశాఖలోకి బర్డ్ ఫ్లూ ఎంటర్ అయింది అనేది జనం టెన్షన్. మరి ఆ కాకులు నిజంగానే బర్డ్ ఫ్లూతో చనిపోయాయా.. లేదంటే ఏదైనా వేరే రోగం వచ్చి చనిపోయిందా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. బట్.. జనం మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. ఇది కచ్చితంగా బర్డ్ ఫ్లూనే అని. చూస్తుంటే.. మన దగ్గర కూడా చికెన్ రేట్లు తగ్గిపోయేలా ఉన్నయ్. ఉన్న వాళ్లు ముందే అమ్ముకుంటే బెటర్. చికెన్ తినాలి అనుకున్న వాళ్లు కూడా ముందే తింటే మంచిది. ఎందుకంటే.. నాల్రోజుల తర్వాత చికెన్ తినాలి అంటే.. లోపల ఏదో టెన్షన్ అయితే కచ్చితంగా ఉంటుంది. సో.. బీకేర్ ఫుల్ గా ఉండడం.. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
టెన్షన్ పెడుతున్న పెళ్లి ముహూర్తాలు.. మళ్లీ ముహూర్తాలు ఎప్పుడంటే
2020లో పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకున్న జంటలకు కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన లాక్ డౌన్ చాలా ఇబ్బందులు పెట్టింది. లాక్ డౌన్ లో కూడా కొందరు పెళ్లిళ్లు నిర్వహించారు. తక్కువ మందితో, ఆన్ లైన్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చుకుంటూ.. అలా పెళ్ళిళ్ళను కానిచ్చేశారు. ఇక 2021 వచ్చేసింది. ఇక ఈ ఏడాది కరోనా టెన్షన్ తక్కువగా ఉంటుంది పెళ్లిళ్లు చేసుకోవచ్చు అనుకున్న వాళ్లకు ముహూర్తాలు లేకుండా పోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయట. గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే రావడంతో పెళ్లి ముహూర్తాలకు అడ్డంకి అవు తోందని, దీంతో శుక్రవారం వరకే పెళ్లి ముహూర్తాలు ముగిశాయని చెబుతూ ఉన్నారు. ఇక ఈ ఏడాది మే నెల వరకూ మంచి రోజులు లేవని పండితులు స్పష్టం చేస్తున్నారు.
జనవరి 14న శూన్యమాసం ప్రారంభం కానుంది. ఇది ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు ఉండవు.. శూన్య మాసంలో హిందువులు పెళ్లిళ్లు చేసుకోరు. ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ 80 రోజుల పాటు శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఆ తర్వాత శుభదినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు బలమైన ముహూర్తాల్లేక పోవడంతో మే 14 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయి. కానీ అవి కూడా చాలా కొద్ది రోజులు మాత్రమేనని అంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావు. గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదు.. ఇవి చెడు ప్రభావాన్ని కలిగించనప్పటికీ ఈ రోజులలో పెళ్లిళ్లకి మంచి రోజులు కావట. గతేడాదంతా కరోనా సమస్యలతో శుభకార్యాలు తక్కువగా జరిగగా.. ఈ ఏడాది ముహూర్తాలు లేకపోవడం నిరాశ కలిగించే అంశమే..! ఈ ఏడాది తెలుగు మాసాల్లో ఒక మాసం అధికంగా వచ్చింది. కాబట్టి ఎలాంటి శుభకార్యాలు చేయరని.. నిజ మాసంలో..అది కూడా బలమైన ముహూర్తం ఉంటేనే శుభకార్యాలు నిర్వహస్తారని పండితులు చెబుతూ ఉన్నారు.
జమ్మూలో బర్డ్ ప్లూ దెబ్బకు 150 కాకులు బలి
జమ్మూ లోని ఉదంపూర్ జిల్లాలో గురువారం 150 కాకులు చనిపోవడం అధికారులను కలవరపర్చింది. చనిపోయిన కాకులనుంచి నమూనాలను సేకరించి పరీక్షించడానికి పంపారు. అయితే జమ్మూలో పక్షులు చనిపోవడానికి కారణం శీతల గాలులు కావచ్చని ఉదంపూర్ పశుసంవర్థక శాఖ చీఫ్ డాక్టర్ ఇంద్రజిత్ సింగ్ పేర్కొన్నారు.
చనిపోయిన కాకుల నుంచి శాంపిల్స్ తీసి పరీక్షించడానికి పంపాము. శీతల గాలుల విజృంభణ వల్లే పక్షులు మూకుమ్మడిగా చనిపోయి ఉండవచ్చు. అయితే ఈ పరిణామాన్ని తేలిగ్గా తీసుకోకుండా అవి బర్డ్ ప్లూ వల్ల చనిపోయాయేమో తెలుసుకోవడానికి వాటి శాంపిల్స్ సేకరించి పంపాము అని డాక్టర్ సింగ్ చెప్పారు.
ఇదిలా ఉండగా, కర్నాటక లోని దక్షిణ కన్నడ జిల్లాలోనూ ఆరు కాకులు చనిపోయిన ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీటి నమూనాలను కూడా పరీక్షకు పంపారు. అంతకు ముందు కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ బర్డ్ ఫ్లూ సోకినట్లు వార్తలు వచ్చాయి.
కాగా ఫౌల్ట్రీ కోళ్లు, కాకులు, వలస పక్షుల్లో మరింతగా బర్డ్ ఫ్లూ సోకకుండా నిరోధక చర్యలు పాటించాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే హర్యానాలోని పంచకులలోని కోళ్ల ఫారాల్లో అసాధారణంగా కోళ్లు మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తతా హెచ్చరిక చేసింది.
చూస్తుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బర్డ్ ప్లూ వ్యాధి వ్యాపిస్తున్నట్లే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నెమళ్లతో సహా వందలాది పక్షులు, కోళ్లు చనిపోవడం గమనార్హం.
మిర్చి తోటలో 'కాజల్.. తమన్నా'...
పొలానికి దిష్టి తగలకుండా ఏం చేస్తారు..దిష్టిబొమ్మలని కడతారు అంటారా..కానీ ఓ రైతు వినూత్నంగా ప్రయత్నించాడు..దిష్టిబొమ్మలకి బదులుగా సినీ తారల కట్ అవుట్ లని పొలంలో పెట్టేశాడు ఏకంగా. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ఇది ఎక్కడ జరిగిందో తెలుసా తెలంగాణ జిల్లాలో. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామానికి చెందిన రైతు చంద్రమౌళి ఇలా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. చంద్రమౌళికి రెండు ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రతీ సంవత్సరం మిర్చి తోట వేస్తున్నాడు. కాగా కరెక్టుగా పంట చేతికి వచ్చే సమయానికే ఏదో ఒక తెగులు సోకి పంట నష్టంపోతున్నాడీ రైతు.
ఇలా రెండు మూడేళ్లు జరిగేసరికి.. తోటకు నరదిష్టి తగిలిందని భావించాడు చంద్రమౌళి. బాగా ఆలోచించి.. మిర్చితోటకు దిష్టిపోయే మార్గం కనుగొన్నాడు. దిష్టిబొమ్మలు పెట్టడం ద్వారా.. నర దిష్టికి చెక్ పెట్టాలనుకున్నాడు రైతు. అయితే.. గడ్డితో చేసే దిష్టిబొమ్మతో నరదిష్టి ప్లాన్ వర్కవుట్ కాదనుకున్నాడో ఏమో.. మనుషుల బొమ్మలు పెట్టేశాడు. అదికూడా.. సాధారణ మనుషుల బొమ్మలు ఎవరు చూస్తారులే అనుకున్నట్టున్నాడు.. ఏకంగా సినీ తారలను దింపేశాడీ రైతు. అది కూడా వాళ్లనీ వీళ్లనీ కాదండోయ్.. జనాల్లో ఫుల్లు ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్లనే తోటకు రప్పించాడు రైతు చంద్రమౌళి.
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తమన్నా ..కాజల్ నిలువెత్తు ఫ్లెక్సీలను తయారు చేయించి తోటలో నిలబెట్టాడు. అంటే.. ఇప్పుడు తోటను ఎవరూ పట్టించుకోకుండా.. హీరోయిన్ల బొమ్మలను చూస్తూ వెళ్తారన్న మాట. ఆ విధంగా దిష్టికళ్ల నుంచి తన తోట తప్పించుకుంటుందన్న మాట. ఇదీ.. సదరు రైతు ప్లాన్. ఈ ఫొటోలను చూసిన పలువురు.. అందాల తారల్ని దిష్టిబొమ్మల్ని చేశాడేంటయ్యా అనుకుంటుండగా.. తోటకు అందాన్ని తెచ్చాడులే అనుకుంటున్నారు మరికొందరు. మొత్తానికి.. ఈవెంట్లలో లక్షలాది రూపాయలు తీసుకొని షో చేసే హీరోయిన్లు.. సిద్ధిపేట రైతు తోటలో మాత్రం ఫ్రీగా దిష్టితీసి పెడుతున్నారన్నమాట. ఐడియా జీవితాన్నే మారుస్తుందన్నట్టుగా ఈ ఐడియాతో రైతు పొలానికి దిష్టి పోతుందో లేదో తెలియదు గాని వార్తల్లోకి మాత్రం ఎక్కేశాడీ రైతు.
కోతులను తరమాలని అనుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ప్రాణాలనే పోగొట్టుకున్నాడు...
కేజీ చికెన్ 15 రూపాయలే..!
భారతదేశంలో బర్డ్ ఫ్లూ భయం పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో చికెన్, కోడి గుడ్లు తినే వాళ్లే లేకుండా పోయారు. పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూతో వేలాది కాకులు, బాతులు మృతి చెందడంతో పౌల్ట్రీ బిజినెస్ కూడా దెబ్బతింటోంది. చికెన్ తినొచ్చని వైద్యులు చెబుతున్నా చాలా ప్రాంతాల్లో ప్రజలు నమ్మడం లేదు. బర్డ్ ఫ్లూ విజృంభణ కారణంగా హర్యానాలోని జింద్ జిల్లా నుంచి ఢిల్లీకి కోళ్ల తరలింపుపై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఢిల్లీలో కిలో కోడి మాంసం ఖరీదు రూ.15కు పడిపోయింది. వాటి ధర ఒక్కసారిగా పడిపోవడంతో కోళ్ల వ్యాపారులు ప్రతిరోజూ సుమారు కోటీ 20 లక్షల రూపాయలు నష్టపోతున్నారు. జింద్ జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమకు మంచి పేరుంది. ఆ జిల్లాలో 500కు పైగా పౌల్ట్రీ ఫారాలు, 80కి పైగా హ్యాచరీలు ఉంటాయి. అక్కడి నుంచి ఢిల్లీకి విక్రయించే కోళ్ల బరువు సుమారు 8 లక్షల కిలోగ్రాములుంటుంది. చికెన్ ను బాగా ఉడికించి తినడం వల్ల నష్టమేమీ ఉండదని వైద్యులు అంటున్నా కూడా ప్రజలే భయపడుతూ ఉండడంతో చికెన్ ధర మరింత తగ్గిపోయే అవకాశం ఉంది.
విదేశాల నుంచి భారత్ వచ్చే వలస పక్షుల వల్లే బర్డ్ ఫ్లూ భారత దేశంలో మళ్లీ కనిపిస్తోందని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. బర్డ్ ఫ్లూ కేసులు ప్రపంచం మొత్తం ఉన్నాయని, అయితే గత సెప్టెంబరులో భారత్ ను బర్డ్ ఫ్లూ రహిత దేశంగా ప్రకటించామని అన్నారు. శీతాకాలం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అక్టోబరులో రాష్ట్రాలకు సలహా ఇచ్చామని.. ఇప్పుడు భారత్ లో మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు వస్తుండడానికి కారణం విదేశాల నుంచి వచ్చే వలస పక్షులేనని తెలిపారు. దేశంలో వలస పక్షులకు ఆవాసంగా ఉండే ప్రాంతాల్లోనే బర్డ్ ఫ్లూ కేసులు అధికంగా వస్తున్నాయని తెలిపారు.
ఇక గుంటూరు జిల్లాలో పలు కాకులు మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కొల్లిపర మండలం గుదిబండివారి పాలెం హైస్కూల్ వద్ద 6 కాకులు మృతి చెందాయి. ఒక్కసారే అన్ని కాకులు మరణించడంతో స్థానికులు ఆ విషయాన్ని వెటర్నరీ అధికారులకు తెలియజేశారు. స్థానిక వెటర్నరీ అధికారిణి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, గత మూడ్రోజులుగా ఇక్కడ కాకులు మృత్యువాత పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. బర్డ్ ఫ్లూ అనుమానంతో ఇక్కడి కోళ్లఫారాలను పరిశీలించామని, ఎక్కడా అనుమానించదగ్గ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు.
బర్డ్ ప్లూ వ్యాప్తి.. కర్నాటక సరిహద్దుల్లో అప్రమత్తత
కరోనా మహమ్మారికి తోడుగా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న బర్డ్ ఫ్లూ పై కేంద్ర ప్రభుత్వ జారీ చేసిన మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటించాలని కర్నాటక పశు సంరక్షణ శాఖ మంత్రి ప్రభు చవాన్ అధికారులను ఆదేశించారు. మైసూరు, కొడకు, దక్షిణ కన్నడ, చామరాజ్ నగర్ప్రాంతాలతో సహా కేరళ సరిహద్దులకు ఆనుకుని ఉన్న అన్ని జిల్లాల్లో బర్డ్ ప్లూ నేపథ్యంలో అత్యంత అప్రమత్తతను పాటించాలని కర్నాటక్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాలకు ఆదేశాలు జారి చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే సంబంధిత జిల్లాలన్నింటిలో పారిశుధ్య చర్యలను వేగవంతం చేశారు. మంత్రి ఆదేశాలకు స్పందించిన మైసూరూ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి మీడియాతో మాట్లాడుతూ తమ జిల్లాలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కి సంబంధించిన ఎలాంటి రిపోర్టులు రాలేదని చెప్పారు. గత సంవత్సరం మైసూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావ ఫలితంగా వేలాది పక్షులు చనిపోయిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా అప్రమత్తత పాటిస్తోందని ఆమె చెప్పారు.
కాగా పక్షులు వలసవచ్చిన ప్రాంతాల్లో వాటి శాంపిల్స్‌ని సేకరించి టెస్టుకోసం పంపాలని తమకు ఆదేశాలు వచ్చాయని రాష్ట్ర పశు సంరక్షణ శాఖ అదికారులు చెప్పారు. ప్రతి ఏటా భారీ సంఖ్యలో వలస పక్షులను ఆకర్షిస్తున్న మైసూరు జూను తాత్కాలికంగా మూసివేయడంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు.
కర్నాటకలో ఇంతవరకు అడవి పక్షులు బర్డ్ ఫ్లూ వ్యాధికి గురైనట్లు ఎలాంటి ఆనవాళ్లు లభించనప్పటికీ అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలను తాము చేపట్టామని అధికారులు తెలిపారు. కేంద్రం విధించిన అన్ని మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తున్నామని చెప్పారు.
చైనా సహకరించడం లేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
కరోనా మహమ్మారిని ప్రపంచం మీదకు పంపింది చైనా..! కరోనా మూలాలు ఆ దేశంలోనే దాగి ఉందని ప్రపంచం మాత్రమే కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెబుతోంది. తాజాగా కూడా చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మూలాలపై పరిశోధన చేయడానికి సిద్ధమైన డబ్ల్యూహెచ్ఓ సభ్యులు తమ దేశంలోకి ప్రవేశించేందుకు చైనా ఎందుకో అనుమతులు ఇవ్వడం లేదట..! చైనా కనీసం సహకరించడం లేదని.. అనుమతులు జారీ చేయడానికి కూడా ఎన్నో సాకులు చెబుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలు దేశాల నుంచి నిపుణులు ఇప్పటికే చైనాకు బయలుదేరినప్పటికీ.. తమ దేశంలోకి ప్రవేశించేందుకు చైనా ఏ ఒక్కరికీ ఇంత వరకు అనుమతులు జారీ చేయలేదని ఆయన అంటున్నారుచైనా ప్రభుత్వ తీరుపై తాను చాలా నిరాశకు గురయ్యానని.. ఇప్పటికే ఇద్దరు సభ్యులు చైనాకు బయలుదేరారని, వారి పర్యటనకు చైనా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని అన్నారు. ఆ నిపుణుల బృందం పర్యటన డబ్ల్యూహెచ్ఓతో పాటు ప్రపంచానికి చాలా కీలకం అని.. చైనా ఇప్పటికైనా అనుమతులు ఇస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపణలపై చైనా స్పందించింది. తాము కరోనా కట్టడిలో నిమగ్నమై ఉండడం వల్ల అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతోందని కవర్ చేసుకుంటోంది. తమ దేశంలో పర్యటించే అంతర్జాతీయ నిపుణుల బృందం కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు కొన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. అందుకోసమే ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతోంది చైనా.
కరోనా మహమ్మారి విషయంలో చైనా మొదటి నుండి తప్పులు మీద తప్పులు చేస్తూనే ఉంది. కరోనా పుట్టుక గురించి వారికి తెలిసినా కూడా ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో చైనా పూర్తిగా విఫలమైంది. ఎలా వచ్చిందో.. ఎలా పుట్టించారో చెప్పడానికి కూడా చైనా నీళ్లు నములుతూ ఉంది. ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉండగా.. చైనా మాత్రం ఎంజాయ్ మెంట్ మూడ్ లో ఉంది. అందుకే చైనా ఏదో దాస్తోందన్న అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా చైనా అనుమతులు ఇవ్వకపోవడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతూ ఉన్నాయి.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020