రామమందిర నిర్మాణానికి డిగ్గీ రాజా సంచనల విరాళం
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి ప్రధాని నరేంద్రమోదీ అభ్యర్థన మేరకు సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నేతలు సినీతారలు, వ్యాపార వేత్తలు ఇతర ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లక్షా 11 వేల 111 రూపాయలు విరాళం అందించడం సంచలనం కలిగిస్తోంది.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన దిగ్విజయ్ సింగ్ తాను మతకలహాలకు వ్యతిరేకమే కానీ రామాలయ నిర్మాణానికి కాదని సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే కేంద్రప్రభుత్వం ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ ఆపాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 15 నుంచి విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా మొదలెట్టిన 44 రోజుల పాటు విరాళాల సేకరణ కార్యక్రమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం పట్ల దిగ్విజయ్ సింగ్ తన ఆందోళనను వ్యక్తం చేసారు.
ప్రధానికి రాసిన లేఖలో మహాత్ముని సూక్తిని దిగ్విజయ్ ఉల్లేఖించారు. మతం అనేది రాజకీయ సాధనం కాదని, అది మనిషికి, భగవంతునికి సంబంధించిన వ్యవహారమని డిగ్గీ రాజా చెప్పారు. ఆలయనిర్మాణానికి విరాళాలు ఇవ్వడం అనేది వ్యక్తుల ఇష్టాఇష్టాలతోనే జరగాలి కానీ హింసను ప్రేరేపిస్తూ విరాళాల సేకరణ జరపడం సరైంది కాదని విమర్శించారు.
ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ పేరిట కొన్ని సంస్థలు కర్రలు, కత్తులు, గొడ్డళ్లు వంటి ఆయుధాలను ప్రదర్శస్తూ భారీ స్థాయి విరాళాలకు తలపడుతున్నారు. ఇలా విరాళల సేకరణ సందర్భంగా ఒక మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది ఏ మత సంప్రదాయాల్లోనూ భాగం కాదని, కారాదని నేను భావిస్తున్నాను అంటూ దిగ్విజయ్ ప్రధానికి రాసిన లేఖలో చెప్పారు.
మద్యప్రదేశ్‌లో మూడు చోట్ల జరిగిన ఇలాంటి ఘటనలు దేశంలో సామాజిక చట్రానికి నష్టం కలిగించనున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వ్యక్తులు విరాళాలు సేకరించడానికి రామాలయం ట్రస్టు అధికారం ఇచ్చిందా అని ఆశ్చర్యం వేస్తోంది. ఇలాంటి వ్యక్తులు ప్రజల నుంచి విరాళాలు సేకరించాక వారికి రసీదులు ఇస్తున్నారో లేదో కూడా తెలీటం లేదని దిగ్విజయ్ సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
మీరు దేశానికి ప్రధాని. రామాలయ నిర్మాణం పట్ల ఇతర మతస్తులకు ఎలాంటి వ్యతిరేకతా లేదని మీకు తెలుసు. కానీ రామాలయ నిర్మాణం పేరుతో విరాళాల సేకరణ పని సౌహార్ద వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది అంటూ ఆయన ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు, పైగా హింసాత్మక పద్ధతుల ద్వారా రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణ చేపట్టకుండా ఇలాంటి సంస్థలను నిషేధించాలని డిగ్గీ రాజా ప్రధానికి సూచించారు.
కాగా, బీజేపీ హిందువుల పార్టీ అని విమర్శించిన డిగ్గీ రాజా ఇప్పుడు రామ మందిర నిర్మాణానికి విరాళం ప్రకటించడం విశేషం. గతంలో ఆయన ఆలయ నిర్మాణంపై విమర్శలు కూడా చేశారు. అలాంటి వ్యక్తి నుంచి విరాళం రావడం ఆశ్చర్యమేస్తోంది.
అయోధ్యలో ఆలయ నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ 44 రోజుల పాటు విరాళాల సేకరణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో సంబంధం ఉన్న దిగ్విజయ్ సింగ్ రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష 11 వేల 111 విరాళం ఇవ్వడం గమనార్హం.
రిపబ్లిక్ డే పెరేడ్లో మొట్టమొదటి మహిళా పైలట్..
దేశంలో మొట్టమొదటి ముగ్గురు మహిళా ఫైటర్ యుద్దవిమాన పైలట్లలో ఒకరైనా ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ అరుదైన గౌరవం అందుకోనున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా పెరేడ్లో పాల్గొంటున్నారు. గణతంత్ర దినోత్సవాల చరిత్రలో ఒక మహిళా పైలట్ పెరేడ్లో పాల్గొననుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందిన భారతీయ వాయుసేనకు చెందిన టేబిలాక్స్ సైన్య విభాగం తరపున భావనా కాంత్ పెరేడ్లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ప్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ మాట్లాడుతూ బాల్యం నుంచి రిపబ్లిక్ డే పెరేడ్‌ను టీవీలో చూస్తూ గడిపానని, అలాంటిది ఈ సంవత్సరం పెరేడ్లో భాగం కావడం చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు,. రఫేల్, సుఖోయ్తో సహా ఇతర యుద్ధవిమానాలను నడపడం కూడా నాకు ఇష్టమే అని చెప్పారు.
2016లో భారతీయ వాయుసేనలో చేరిన ఫ్లైట్ లెప్టినెంట్ భావనా కాంత్ ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లతో కూడిన తొలి బ్యాచ్‌లో భాగం కావడం తెలిసిందే. ఐసీఏ తేజస్, లైట్ కంబాట్ హెలికాప్టర్, రోహిణి రాడార్, ఆకాశ్ మిస్సైల్, సుఖోయ్ 30 ఎమ్కేఐ వంటి యుద్ధవిమానాలతో కూడిన ఐఏఎఫ్ టేబిల్యాక్స్ విభాగంలో భాగంగా భావన రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొననున్నారు.
కొత్తగా భారత వాయుసేనలో భాగమైన రఫేల్ యుద్ధవిమానాన్ని కూడా జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రదర్శించనున్నారు. కాగా డకోటా యుద్ధవిమానం 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆనాటి యిుద్ధంలో పాకిస్తాన్‌పై భారతదేశం సాధించిన విజయానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బంగ్లాదేశ్ మిలటరీ కంటింజెంట్లో భాగంగా ఈ విమానాన్ని ప్రదర్శించనున్నారు.
భారతీయ వాయుసేనలో ప్రతిష్టాత్మకంగా వెలుగొందుతున్న ఐఏఎఫ్ వింటేజ్ డకోటా యుద్దవిమానం రెండు ఎమ్ఐ-17 హెలికాప్టర్లతో కలిసి రుద్ర ఫార్మేషన్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందు కవాతులో పాల్గొంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఐఏఎఫ్ మార్చింగ్ విభాగంలో నలుగురు ఐఏఎఫ్ అధికారులతోపాటు 96 మంది వైమానిక యోధులు కూడా పాల్గొననున్నారు ఈ పెరేడ్లో 42 ఐఏఎఫ్ విమానాలు, నాలుగు ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లు భాగం కానున్నాయి.
మొదటిసారిగా రిపబ్లిక్ పెరేడ్ రెడ్ ఫోర్ట్‌లో కాకుండా చారిత్రాత్మకమైన రాజ్‌పథ్ సమీపంలోని నేషనల్ స్టేడియంలో ప్రదర్శించనున్నారు. ఇక ప్రేక్షకుల సంఖ్యను కూడా కోవిడ్-19 నేపథ్యంలో 25 వేలకు తగ్గించారు.
రైతుల ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులదే నిర్ణయం: సూచన
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చన సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతుల ట్రాక్టర్ ర్యాలీని జనవరి 26న ఢిల్లీ నగరంలోకి అనుమతించాలా వద్దా అనే విషయాన్ని పోలీసు శాఖే నిర్ణయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా వెయ్యికి పైగా ట్రాక్టర్లతో ఢిల్లీలో నిరసన ర్యాలీ చేస్తామని రైతులు ప్రకటించడం శాంతి భద్రతల కిందికి వస్తుంది కాబట్టి పోలీసుల ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య జడ్జీల బెంచ్ సోమవారం ఈ అంశాన్ని విచారించింది. శాంతి భద్రతల పరిస్థితితో వ్యవహరించాల్సింది పోలీసు శాఖే కాబట్టి అన్ని అధికారాలతో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వారికి ఉంటుందిని ధర్మాసనం పేర్కొంది.
కేంద్రప్రభుత్వం సాగు చట్టాల రద్దుపై తాత్సారం చేస్తున్నందుకు నిరసనగా రిపబ్లిక్ డే నాడు ఢిల్లీ నగరంలోకి ఒకటిన్నర లక్షల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని రైతునేతలు గతంలో చెప్పారు. కానీ కోవిడ్ ప్రమాదం, రిపబ్లిక్ డే ఉత్సవాల ప్రాధాన్యత రీత్యా వెయ్యి ట్రాక్టర్లతో మాత్రమే ర్యాలీ తీస్తామని రైతునేతలు ప్రకటించారు.
పోలీసులకు ఉన్న అధికారాలు ఏమిటి, వాటిని వారు ఎలా అమలు చేస్తారు అని సుప్రీకోర్టు చెప్పగలదా, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని మేం చెప్పలేం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని ఇంతకుముందు విచారణ చేసిన బెంచ్ మాది కాదు కాబట్టి జనవరి 20కి విచారణను వాయిదా వేస్తున్నామని ధర్మాసనం అటార్నీజనరల్ వేణుగోపాల్‌కి తెలిపింది.
అంతకుముందు ఢిల్లీ పోలీసుల ద్వారా ఈ విషయమై దరఖాస్తు చేసిన కేంద్రప్రభుత్వం రిపబ్లిక్ డే ఉత్సవాలకు రైతుల ర్యాలీ ద్వారా అంతరాయం కలిగితే జాతి గౌరవానికి భంగం కలుగుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోకి జనవరి 26న ప్రవేశించాలని చూసే ట్రాక్టర్ ర్యాలీ, ట్రోలీ మార్చ్, వాహనాల కవాతు మరే రూపంలోని ప్రదర్శనలపై అయినా సరే ఆంక్షలు విధించాలని కేంద్ర సుప్రీంకోర్టును కోరింది.
అయితే తాము ముందు చెప్పినట్లుగా లక్ష పైగా ట్రాక్టర్లతో ర్యాలీని జరపబోమని కేవలం వెయ్యి ట్రాక్టర్లు మాత్రమే తమ ర్యాలీలో పాల్గొంటాయని, ర్యాలీ పూర్తి శాంతియుతంగా జరుగుతుందని జనవరి 26న రాజ్ఫథ్లో నిర్వహించి రిపబ్లిక్ డే పెరేడ్‌కి ఎలాంటి అంతరాయాలు తాము కలిగించబోమని రైతు నేతలు సోమవారం స్పష్టం చేసారు.
రిపబ్లిక్ డే కవాతును తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవమని రైతు నేతలు చెప్పారు. ఢిల్లీ చుట్టూ ఉండే ఔటర్ రింగ్ రోడ్డులో మాత్రమే 50 కిలోమీటర్ల పొడవునా రైతు ర్యాలీ తీస్తామని వారు పేర్కొన్నారు. ఢిల్లీ, హర్యానా పోలీసులు మా ర్యాలీకి సహకరిస్తారని భావిస్తున్నట్లు రైతులు చెప్పారు.
ఇప్పటికి పది విడతలుగా కేంద్రప్రభుత్పం, రైతు నేతల మధ్య సాగుచట్టాల రద్దు అంశంపై చర్చలు జరిగినప్పటికీ ఫలితం రాకపోవడంతో రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ల ర్యాలీతో సత్తా చూపాలని రైతుసంఘాల నేతలు భావిస్తుండటం తెలిసిందే.
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..!
గుజరాత్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్‌లోని కొసాంబ సమీపంలో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందాగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
15 మంది వలస కూలీలు ఫుట్ పాత్ మీద నిద్రిస్తూ ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన ట్రాక్టర్ మరో ట్రక్కును ఢీకొట్టింది. డ్రైవరు నియంత్రణ కోల్పోవడంతో ట్రక్ ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 13 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా రాజస్తాన్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కిమ్ మాండవీ హైవే మీద ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిది రాజస్థాన్ లోని బంస్వారా అని తెలుస్తోంది. అందరూ వలస కూలీలే అని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ నేత ఓం బిర్లా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. సూరత్ లో చోటు చేసుకున్న ఈ ఘటన పట్ల తమకు ఎంతో బాధగా ఉందని అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నామని అన్నారు. ఈ ఘోరమైన ఘటన పలువురిని కలచివేసింది. వలస కూలీల మీద భగవంతుడు ఇలా పగబట్టాడా అన్నట్లు ఈ ఘటన చోటు చేసుకుందని పలువురు స్థానికులు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. డ్రైవర్ లారీని అదుపు చేయలేకపోవడమే ఈ ఘటనకు కారణమని స్థానికులు కూడా చెబుతూ ఉన్నారు. రాజస్థాన్ లోని బంస్వారాకు చెందిన వ్యక్తులు ఇలా గుజరాత్ లో ప్రాణాలు కోల్పోవడంతో వలస కూలీల సొంత గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పొట్ట చేతబట్టుకుని ఇలా ఇతర ప్రాంతాలకు వెళ్లిన అభాగ్యులను మృత్యువు ఇలా కబళించి వేయడం దారుణం..!
1075 ఈ నెంబర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్
కొన్ని కొన్ని సార్లు.. కొన్ని కొన్ని నంబర్లు ట్రెండింగ్ లోకి వస్తయ్. కొన్ని కొన్ని సార్లు.. కొన్ని కొన్ని నంబర్లు ప్రాణాలు కాపాడతయ్. కొన్ని కొన్ని సార్లేమో.. భరోసా ఇస్తుంటయ్. మేమున్నాం అంటూ మోగుతుంటయ్. ఇప్పుడు కూడా అంతే. కరోనా టైం కదా.. ఈ నెంబర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కరోనా ఎక్కడిది.. బొందల గడ్డకి పోయింది కదా అనుకుంటున్నారేమో. కరోనా పోయినా.. కరోనా వ్యాక్సిన్ వచ్చింది కదా. అది ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది.
కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లే ఉంది ఎవ్వారం. ఇన్నాళ్లూ కరోనా అంటే టెన్షన్ పడ్డారు జనాలు. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందీ అంటూ.. రోజూ న్యూస్ మిస్ కాకుండా ఫాలో అయ్యాం. తీరా వ్యాక్సిన్ వచ్చాక ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఏదో హడావిడిగా మందు వచ్చింది మందు వచ్చింది అని వేసుకున్నారు తప్ప.. ఓ పక్క గుండె డగ్గ డగ్గ కొట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు వేసుకున్న ప్రతి ఒక్కరికీ అదో రకం టెన్షన్ పట్టుకుంది. అప్పుడు తుమ్మొచ్చినా.. దగ్గు వచ్చినా.. కాస్త నీరసంగా ఉన్నా.. కరోనానే అనుకున్నాం కదా. ఇప్పుడు టీకా వేసుకున్న వాళ్ల పరిస్థితి ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది. మూడు రోజులు అవుతున్నా.. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఆ భయాలు తప్పడం లేదు.
ఎందుకంటే.. వ్యాక్సిన్ లు వికటించడం మామూలే.. రివర్స్ అయ్యి.. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం కూడా మామూలే.. కో వ్యాక్సిన్ అయితే.. అంగీకార పత్రం ఇచ్చిన తర్వాతనే వేసుకోవాల్సిన పరిస్థితి. కోవీషీల్డ్ మాత్రం అలాంటి టెన్షన్ లు ఏం అవసరం లేదు అన్నట్లు ఉంది. కానీ.. ఇప్పుడు రెండు వ్యాక్సిన్ లలో ఏది తీసుకున్న వారికైనా టెన్షన్ తప్పడం లేదు. ఎందుకంటే.. రెండు వ్యాక్సిన్ లూ కాస్త రివర్స్ కొడుతూనే ఉన్నాయి. అక్కడో ఇక్కడో ఎవరో ఒకరికి రివర్స్ అవుతోంది. లేని పోని వార్తలు కూడా బానే తిరుగుతన్నాయి. అందుకే.. జనాల్లో ఇంకాస్త భయం పెరిగింది. అసలే.. నార్వేలో ఏకంగా 23 మంది చనిపోయారు. మన దగ్గర కూడా రివర్స్ కేసులు పెరుగుతున్నాయి.
సో.. టెన్షన్ మామూలే.. ఈ టెన్షన్ ఇలాగే ఉంటే.. నెక్స్ట్ టైం వ్యాక్సిన్ తీసుకోవడానికి జనాలు ముందుకు వస్తారా లేదా అనే టెన్షన్ ఒకటి మొదలైంది. అందుకే.. ఏ ప్రాబ్లమ్ వచ్చినా.. వెంటనే డయల్ చేయండి 1075. వ్యాక్సిన్ తీసుకున్న వారు ఈ నంబర్ నోటెడ్ చేసి పెట్టుకోవాలి. లేదంటే.. ఇంట్లో వాళ్లకి ఈ నంబర్ రాసి పెట్టాలి. ఎందుకంటే.. వ్యాక్సిన్ వికటించినా.. వికటించింది అనే ఫీలింగ్ ని మీరు ఫీలైనా.. వెంటనే ఈ నంబర్ నొక్కండి. ఏదో ఒకటి మాట్లాడండి. మీ ప్రాబ్లమ్ ని క్లియర్ గా చెప్పండి. ఆ సిమ్టమ్స్ ని బట్టి.. మీ సిచ్చువేషన్ ఏంటో చెబుతారు. మీకు వ్యాక్సిన్ వికటించడం వల్ల.. అలా ఉందా. లేదంటే మామూలుగానే ఉందా అని క్లారిటీ ఇస్తారు. అంతే కాదు.. మీరు హాస్పిటల్ కి వెళ్లాలా.. లేదంటే.. ఇంట్లో ఏమైనా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా అనే విషయం పై కూడా క్లారిటీ ఇస్తారు. అందుకే.. ఈ నెంబర్ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ముందు నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకైనా మంచిది.. ఎవరైనా అడిగితే ఇవ్వొచ్చు.
అమెరికా ఆన్ 'హై అలర్ట్'
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిని ఆయన అనుచరులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడు ఎటువంటి ఆందోళనలు చేస్తారా అని సాధారణ జనం భయపడుతూ ఉన్నారు. ట్రంప్ మద్దతుదారులు దాడులతో తెగబడుతున్నారు. హింసను ప్రేరేపిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ప్రమాణ స్వీకారం సందర్భంగా భద్రతా సిబ్బందిలో కొందరు దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందడంతో రక్షణ శాఖ అప్రమత్తమైంది. విధుల్లో పాల్గొనే భద్రత సిబ్బంది నుంచే దాడుల ముప్పు ఉందన్న ముందస్తు హెచ్చరికలతో రక్షణశాఖ అధికారులు మొత్తం పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు.
కేపిటల్ భవనంపై జరిగిన దాడిలో కొందరు పోలీసులు కూడా పాల్గొనడంతో వైట్‌హౌస్ పరిసరాల్లో పూర్తిస్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 వేల మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్లో మోహరించారు. అనుమానం వస్తే రెండు మూడుసార్లు తనిఖీ చేయాలన్న ఆదేశాలు కూడా అందాయి. ఒక్క వాషింగ్టన్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. చిన్నచిన్న గుంపులుగా వచ్చి ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దాడి చేసే అవకాశం ఉండడంతో వారిని ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వేరీ తెలిపారు.
జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా వాషింగ్టన్లో, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అల్లర్లు చెలరేగే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రత వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే కేంద్రానికి దారితీసే రహదారులను మూసేశారు. క్యాపిటల్ భవనం, వైట్‌హౌజ్‌లతో పాటు నగరంలోని ప్రధాన భవనాల్లో భద్రత ఏర్పాట్లు చేశారు. క్యాపిటల్ భవనం, వైట్‌హౌజ్‌ల్లోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు. నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానులతో కిక్కిరిసే నేషనల్ మాల్‌ను మూసేశారు. వాషింగ్టన్‌తో పాటు 50 రాష్ట్రాల రాజధానుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాణ స్వీకారం రోజు హింసాత్మక ఘటనలకు పాల్పడతామంటూ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అనుకూల బృందాలతో పాటు వివిధ గ్రూపుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అసాధారణంగా జరగబోతోంది. ఎంపిక చేసిన కొద్దిమంది అతిథులు పాల్గొంటారు. జనవరి 6 నాటి ఘటన నేపథ్యంలో భద్రతను మరింత పెంచాల్సిన పరిస్థితి నెలకొందని వాషింగ్టన్ డీసీ మేయర్ మురియెల్ బౌసర్ పేర్కొన్నారు. బైడెన్‌కు భద్రత కల్పించే దళాల్లోని వ్యక్తుల నుంచే ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు అమెరికా రక్షణ అధికారులను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమ భద్రతలో, నగర రక్షణలో పాలు పంచుకుంటున్న మొత్తం 25 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను నిశితంగా పరీక్షిస్తున్నారు. ఈ అంతర్గత దాడి ముప్పు గురించే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని ఆర్మీ సెక్రటరీ రయాన్ మెక్ కెర్తి తెలిపారు.
ఆ రెండు మరణాలు.. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వలనే జరిగాయా..?
ప్రజల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేయించుకోడానికి పలువురు ప్రముఖులు వస్తున్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని చాలా మంది భయపడుతూ వ్యాక్సిన్ వేయించుకోడానికి జంకుతూ ఉన్నారు. ఇక భారత్ లో ఇటీవలే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవ్వగా.. రెండు మరణాలు సంభవించడం పట్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది. వైద్యులు ఈ రెండు మరణాలు వ్యాక్సిన్ల వలన జరగలేదని చెబుతూ ఉన్నా కూడా ప్రజల్లో ఆందోళన మొదలైంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండు మరణాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, కర్ణాటకలో ఇంకొకరు మరణించారు.
కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ గ్రూప్–డి ఉద్యోగి నాగరాజు (43) కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న రెండో రోజు మరణించాడు. ఆ వ్యక్తి మరణానికి హార్ట్ అటాక్ కారణం అని, వ్యాక్సినేషన్ వల్ల కాదని వైద్యులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం పోస్ట్ మార్టం వరకూ ఆగాల్సి ఉంటుందని అంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే ఓ ఆరోగ్య కార్యకర్త మృతిచెందాడు. కరోనా టీకా సంబంధిత మరణం కాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గుండె–శ్వాసకోశ సంబంధిత వ్యాధితోనే మహిపాల్ మృతిచెందాడని శవపరీక్ష నివేదికలో పేర్కొన్నారు. మహిపాల్ మృతిపై దర్యాప్తు జరిపిస్తామని మొరాదాబాద్ కలెక్టర్ రాకేశ్‌సింగ్ చెప్పారు. మొరాదాబాద్ జిల్లాలో మహిపాల్ సింగ్ అనే వార్డు బోయ్ సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఛాతీనొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడ్డంతో అతడు కాస్తా ప్రాణాలు వదిలాడు.
శనివారం మధ్యాహ్నం కోవిషీల్డ్ తొలి డోసు అతడు తీసుకున్నాడని ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారి చెప్పుకొచ్చారు. ఆదివారం అతనికి శ్వాస ఆడక, ఛాతినొప్పితో బాధ పడ్డాడని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత నైట్ షిఫ్ట్ చేశాడని చెప్పారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ తో అతను చనిపోయాడని తాను భావించడం లేదని అధికారులు చెబుతూ ఉన్నారు. మహిపాల్ మరణానికి గల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉన్న ఓ వ్యక్తికి కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు తలెత్తాయి. అతడిని ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
తాండవ్ వివాదం.. అమెజాన్ అధికారులకు తప్పని షాక్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన కొత్త వెబ్ సీరీస్ తాండవ్ చుట్టూ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారులకు సమన్లు పంపింది. అంతకుముందు బీజీపే ఎంపీ మనోజ్ కొటక్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రికి ఉత్తరం రాస్తూ తాండవ్ పేరిట విడుదలైన కొత్త వెబ్ సీరీస్‌ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇటీవలికాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ భారతీయ యువతను తీవ్రంగా ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.
ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై సెన్సార్ ఆంక్షలు ఏవీ ఉండవు. దీంతో స్వేచ్ఛ స్వాతంత్ర్యాల పేరిట ఈ ప్లాట్‌ఫామ్‌ని దుర్వినియోగపరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లేదా డిజిటల్ కంటెంట్ ఏ చట్టపరిధిలోనూ, లేక ప్రభుత్వ పర్యవేక్షణలోనూ లేకపోవడం తెలిసిందే. అందుకే ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను అత్యవసరంగా క్రమబద్ధీకరించాల్సిన అవసరం వచ్చి పడిందని బీజేపీ ఎంపీ కోటక్ కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ఉత్తరం రాశారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై టెలికాస్ట్ అవుతున్న ప్రోగ్రాములు పూర్తిగా సెక్స్, హింస, డ్రగ్స్, వేధిపు, విద్వేషం, అసభ్యతతో కూడి ఉంటుంది. కొన్నిసార్లు ఇవి హిందూ, మతపరమైన మనోభావాలను కూడా గాయపరుస్తున్నాయి. ఇటీవలే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో విడుదలైన తాండవ్ వెబ్ సీరిస్ గురించి చాలామంది పౌరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నా దృష్టికి వచ్చాయని ఈశాన్య ముంబై ప్రాంత బీజేపీ ఎంపీ కోటక్ రాశారు.
తాండవ్ సీరీస్ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే హిందూ దేవతలను అవహేళన చేయడమే కాకుండా హిందూ మత మనోభావాలను ఆగౌరవర్చినట్లు కనిపిస్తోంది. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై తక్షణం రెగ్యులేటరీ అథారిటీని నియమించాలని సమాచార ప్రసార శాఖను కోరుతున్నాను. ఈలోగా వివాదాస్పద వెబ్ సీరీస్‌ని నిషేధించాల్సిన అవసరముంది అని బీజేపీ ఎంపీ ఉత్తరం రాశారు.
ఇదే సమయంలో, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ కూడా తాండవ్ వెబ్ సరీస్ నిర్మాతలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఈ వెబ్ సీరీస్ హిందూ దేవతలను అవమానపరుస్తోందని ఆరోపించారు. ముంబైలోని ఘట్కోపార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు.
తాండవ్ వెబ్ సీరీస్‌లో సైఫ్ ఆలీ ఖాన్, డింపుల్ కపాడియా, సునీల్ గ్రోవర్, టిగ్మాన్షు ధులియా, డినో మేరియా, కుముద్ మిశ్రా, మహమ్మద్ జెషాన్ అయూబ్, గౌహర్ ఖాన్, కృతికా కమ్రా నటించారు. గత శుక్రవారం ఈ సీరీస్ ఓటీటీలో విడుదలైంది. చిత్ర నిర్మాత ఆలి అబ్బాస్ జఫార్ ఈ సీరీస్‌ని హిమాన్షు కిషన్ మెహ్రాతో కలిసి రూపొందించడమే కాకుండా దర్శకత్వ నిర్మాణ బాధ్యతలను నిర్వహించారు. కథను గౌరవ్ సోలంకి అందించారు. ఆర్టికల్ 15 సినిమా కథ కూడా గౌరవ్దే అని తెలిసిందే.
విస్టాడోమ్ కోచ్‌లలో విమాన ప్రయాణ అనుభూతి..
సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం కొలువై ఉన్న కెవాడియా నుంచి కొత్తగా ప్రారంభించిన జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ విస్టాడోమ్ కోచ్‌లతో నిర్మించబడింది. ఇది భారతీయ రైల్వే రూపొందించిన అత్యధునాతన కోచ్‌లను కలిగి ఉంది. ఒక కోచ్‌లో 44 రిక్లైనర్ సీట్లు ఉంటాయి. ఈ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులోని కోచ్‌లలో ఒక్కో రిజర్వుడ్ సీటు ధర రూ.885లు.. ఇది ఎక్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ధరతో సమానం.
భారతీయ రైల్వే ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించడమే విస్టాడోమ్ కోచ్‌ల ప్రత్యేకత. పైగా రైలులో కూర్చుని నలువైపులా పరిసరాలను తిలకించగల అద్భుత అనుభవాన్ని ఈ ప్రత్యేక కోచ్‌లు అందిస్తాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇంటెగ్రల్ కోట్ ఫ్యాక్టరీలో ఈ నూతన తరహా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రూపొంచినట్లు భారతీయ రైల్వే తెలిపింది. ప్రయాణీకుల కోచ్‌ల తయారీ కోసం లింగ్ హాఫ్మన్ బుస్చ్ ప్లాట్ పామ్‌పై విస్టాడోమ్ కోచ్‌లను రూపొందించడం భారతీయ రైల్వేల చరిత్రలో ఇదే తొలిసారి అని ఇండియన్ రైల్వే అధికారులు తెలిపారు.
అత్యధునాత హంగులతో తయారైన ఈ విస్టాడోమ్ కోచ్‌లు కెవాడియా మార్గంలో కనిపించే చక్కటి దృశ్యాలను ప్రయాణిస్తూనే తిలకించడానికి గానూ అతి పెద్ద విండోలను కలిగి ఉన్నాయి. ఒక్కో కోచ్ లోని 44 సీట్లు 180 డిగ్రీలపాటు తిరిగేందుకు అనువుగా ఉండి కుడి ఎడమలు రెండు వైపులా ఉండే విండోల నుంచి ప్రయాణీకులు తమ సీట్లలో కూర్చునే బయటి దృశ్యాలను ప్రయాణిస్తూ చూడవచ్చు. అటోమేటిక్‌గా తెరుచుకుని మూసుకునే డోర్లు ఒక్కో కోచ్ రెండువైపులా ఉంటాయి. ఇక పైకప్పు కూడా గ్లాస్‌తో కూడి ఉండి చక్కటి దృశ్యాలను తిలకించేందుకు వీలు కలిగిస్తుంది. కోచ్ రెండు వైపులా అయిదు పెద్ద విండోలు ఉంటాయి.
ఈ విస్టాడోమ్ కోచ్‌లలో విమానాల్లో మాదిరి మడవడానికి వీలున్న టేబుల్స్ ఉంటాయి. సీట్ నంబర్లను బ్రెయిలీ భాషలో చదువుకోవడానికి కూడా అనువుగా మలిచారు. డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లు, స్పీకర్లతో కూడిన ఇన్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, జీపీఎస్ ఆధారిత పబ్లిక్ అడ్రస్ కమ్ ప్యాసింజర్ సమాచార వ్యవస్థ, తమ పర్సనల్ గాడ్జెట్లతో ప్యాసింజర్లు వైఫై సౌకర్యం ద్వారా కావలసినవి డిమాండ్ చేసి తెప్పించుకునే వ్యవస్థ, కాఫీ మేకర్, వాటర్ కూలర్, హాట్ ఓవెన్, రిఫ్రిజిరేటర్, ప్రత్యేక మల్టీ టయర్ లగేజ్ కంపార్ట్మెంట్ ఈ కోచ్‌ల ప్రత్యేకత. పైగా ప్రతి రైడ్‌లోనూ కోచ్ గురించి ప్రయాణీకులకు వివరించే రైల్వే సిబ్బంది కోసం ప్రత్యేక కేబిన్ కూడా ఈ కోచ్‌లో ఉంటుంది.
ఈ కోచ్‌లలో అమర్చిన సస్పెన్షన్ స్ప్రింగ్ రైడింగ్ కంఫర్ట్ టెక్నాలజీ వల్ల ప్రయాణం పొడవునా ప్యాసింజర్లు ఎలాంటి అలసట కలిగించని కుదుపులు లేని ప్రయాణ అనుభూతిని పొందుతారని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పూర్తి వేగంతో ప్రయాణించేటప్పుడు కూడా ప్యాసింజర్లు స్నాక్స్ టేబిల్ పై నీళ్లు నింపిన గ్లాసును పెట్టి పరీక్షించుకోవచ్చని, శరవేగంతో రైలు ప్రయాణం సాగుతున్నప్పటికీ నీళ్లుతో కూడిన గ్లాస్ చెక్కుచెదరకుండా నిలిచి ఉంటుందని చెప్పారు.
ఆదివారం కొవాడియా నుంచి అహ్మదాబాద్, ముంబైకు ప్రారంభమైన జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో టీవీ సీరియల్స్ నటుడు మయూర్ వకాని కూడా ప్రయాణించారు. యూరప్ లోని రైలు కోచ్‌లకంటే మిన్నగా విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయని ఆయన చెప్పారు. యూరప్ రైళ్లలు నేను చాలా సార్లు ప్రయాణించావప కానీ వాటిలోని సౌకర్యాలను మించి మన దేశీయ విస్టాడోమ్ కోచ్‌లు తయారయ్యాయని వకాని చెప్పారు. ఈ రైలు ప్రయాణం అత్యంత సాఫీగా సాగింది. రైలు పూర్తి వేగంతో వెళుతున్నప్పుడు కూడా ఎలాంటి ప్రకంపనలు కానీ, కోచ్ ఊగడం కానీ జరగలేదని గమనించినట్లు తెలిపారు. పైగా రైల్వే ట్రాక్‌పై విమానం ప్రయాణిస్తున్న అనుభూతినిచ్చిందని చెప్పారు.
ఈ కోచ్‌లో సీసీటీవీ సర్వైలెన్స్, ఫైర్ అలారం సిస్టమ్, ఎల్ఈడీ డెస్టినేషన్ బోర్డు కూడా ఉంటున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విమాన ప్రయాణంలో అందించే సౌకర్యాలను అన్నింటినీ భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఈ విస్టాడోమ్ కోచ్‌లు అందించనున్నాయి.
అతడు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్స్ట్ కారణంగా చనిపోయాడా..?
కరోనా వ్యాక్సిన్.. ఎన్నో దేశాల్లో ఇప్పటికే చాలా మంది స్వీకరిస్తూ ఉన్నారు. భారతదేశంలో కూడా ఇటీవలే అట్టహాసంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. దేశంలో ఎంతో మంది కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటూ ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ మీద కూడా ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్న ఆసుపత్రి వార్డు బోయ్ మృతి చెందడంతో కలకలం మొదలైంది.
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాలో మహిపాల్ సింగ్ అనే వార్డు బోయ్ సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఛాతీనొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడ్డంతో అతడు కాస్తా ప్రాణాలు వదిలాడు. శనివారం మధ్యాహ్నం కోవిషీల్డ్ తొలి డోసు అతడు తీసుకున్నాడని ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారి చెప్పుకొచ్చారు. ఆదివారం అతనికి శ్వాస ఆడక, ఛాతినొప్పితో బాధ పడ్డాడని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత నైట్ షిఫ్ట్ చేశాడని చెప్పారు.
వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ తో అతను చనిపోయాడని తాను భావించడం లేదని అధికారులు చెబుతూ ఉన్నారు. మహిపాల్ మరణానికి గల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉన్న ఓ వ్యక్తికి కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు తలెత్తాయి. అతడిని ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని ఆదివారం నాడు మాట్లాడుతూ 2,24,301 మందికి వ్యాక్సిన్ డోసులు అందించినట్టు వెల్లడించారు. వారిలో కేవలం 447 మందిలో ప్రతికూల ప్రభావం కనిపించిందని, ముగ్గుర్ని మాత్రమే ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు. ఆదివారం కావడంతో కేవలం 6 రాష్ట్రాల్లోనే వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు తెలిపారు.
కొవ్యాగ్జిన్ టీకా తీసుకున్న ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సెక్యూరిటీ గార్డుకు స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా తెలిపారు. 20 ఏళ్ల సెక్యూరిటీ గార్డుకు శనివారం సాయంత్రం 4 గంటలకు టీకా వేశారని, పావుగంటలోనే అతడి చర్మంపై దద్దుర్లు వచ్చాయి. గుండె కొట్టుకునే వేగం పెరగడంతో.. వెంటనే అతడిని అబ్జర్వేషన్ లో పెట్టి చికిత్స అందించారు. తర్వాత కొద్దిసేపటికి అతడు కోలుకున్నాడని డాక్టర్లు చెప్పారు.
రెండోరోజు ఆరు రాష్ట్రాల్లో 17 వేలమందికి టీకాలు.. ఎంత మందికి దుష్పలితాలు
గత రెండురోజులుగా దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 నిరోధక టీకా కార్యక్రమంలో 447 మందికి దుష్రభవాలు కనిపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించిన భారత్ తొలిరోజే 2 లక్షల 7 వేల మందికి పైగా టీకాలు అందించింది. ఇక రెండోరోజు ఆరు రాష్ట్రాలలో 17 వేలమందికి వ్యాక్సిన్ అందించామని ఇప్పటివరకు దేశంలో 2,24,301మంది వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని పేర్కొన్నారు.
ఆదివారం కావడంతో ఆరు రాష్ట్రాల్లోని 553 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగినట్లు మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, తమిళనాడు ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఆదివారం టీకా పంపిణీ కొనసాగింది. అయితే 447మందికి కలిగిన దుష్ప్రభావాలు అతి స్వల్పం మాత్రమేనని ముగ్గురికి మాత్రమే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాల్సి వచ్చిందని ఆరోగ్య శాఖ తెలిపింది.
టీకాలు వేయడంలో ప్రపంచ రికార్డు..
వ్యాక్సినేషన్ మొదలైన తొలి రోజే రెండు లక్షలమందికి పైగా వ్యాక్సిన్ అందించడం ద్వారా భారతదేశం ప్రపంచ రికార్డును సాధించింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో తొలి రోజు వేసిన సంఖ్య కంటే భారత్‌లో తొలిరోజు వేసిన టీకాల సంఖ్య ఎక్కువని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వారంలో ఏ తేదీల్లో టీకాలు వేసేదీ షెడ్యూల్ తమకు అందించాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అయితే వారంలో ఆరురోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పినట్లు వివరించింది.
శనివారం టీకా వేసుకున్నాక తీవ్ర దుష్ప్రభావానికి గురైన వ్యక్తికి ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్లో చికిత్స చేసి డిశ్చార్జ్ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ రిషికేష్ ఆసుపత్రుల్లో చేర్పించిన వ్యక్తులు కూడా ప్రస్తుతం కోలుకున్నారని వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
తొలివిడత వ్యాక్సినేషన్లో భాగంగా వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు వంటి 3 కోట్లమంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా వేస్తుండటం తెలిసిందే. తదుపరి దశలో వచ్చే ఆరునెలల కాలంలో మరో 27 కోట్లమందికి టీకాలు వేయాలని భారత్ సంకల్పంచింది.
కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 13,788 మందికి కరోనా
భారతదేశంలో నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. భారతదేశంలో గత 24 గంటల్లో 13,788 మందికి కరోనా నిర్ధారణ అయింది. భారతదేశంలో గత 24 గంటల్లో 14,457 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 145 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,419 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 1,02,11,342 మంది కోలుకున్నారు. 2,08,012 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
17-01-2021 ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 36,091 కరోనా పరీక్షలు నిర్వహించగా 161 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 52 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 19, శ్రీకాకుళం జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నెల్లూరు జిల్లాలో 3, విజయనగరం జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 6 కేసులు వెల్లడయ్యాయి. గత 24గంటల్లో 251 మంది కోలుకోగా, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,985కి పెరిగింది. 8,76,949 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,896 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 7,140కి చేరింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఎంత మందిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయంటే..?
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 346 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,91,872 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,86,244 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,579కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,049 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,281 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 45 కరోనా కేసులు నమోదయ్యాయి.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020