నేరాలు చేసే వారి వయసును పరిగణించాలా: వెంకయ్యనాయుడు ప్రశ్న
హైదరాబాద్‌లో పశువైద్యురాలి విషయంలో జరిగిన దుర్ఘటన అమానవీయం అని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర విచారం ప్రకటించారు. సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి క్రూరమైన ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. సోమవారం రాజ్యసభలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని అరికట్టడానికి చేయాల్సిన సూచనలపై చర్చను ప్రారంభించిన సందర్భంగా నేరవిచారణ, శిక్షల విధింపు తర్వాత న్యాయప్రక్రియ కొనసాగింపుపై కీలక ప్రశ్నలు సంధించారు.
శిక్షలు విధించినప్పుడు కూడా అప్పీలు, క్షమాభిక్ష అంటూ ఏళ్ల తరబడి ప్రక్రియ నడుస్తోంది. ఇంతటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై క్షమాభిక్ష అంశం అనేది ఎవరైనా ఊహించుకుంటారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కేసు తమ పరిధిలో లేదంటూ పోలీసులు చెప్పిన కారణాలు సహేతుకం కాదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
పలు సందర్భాల్లో తప్పుచేసిన వారు జువైనల్ అని అంటున్నారు, హేయమైన నేరాలు చేయగలిగే వారికి వయసుతో ఏం సంబంధం ఉంటుంది? ఈ అంశంపై కూడా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చట్టం ఒక్కటే పరిష్కారం కాదన్నారు. ప్రజల ఆలోచనాధోరణిలో మార్పురావాలని వెంకయ్య సూచించారు.
‘దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకరం. హైదరాబాద్‌లో జరిగిన దుర్ఘటన అమానవీయం. మానవత్వం సిగ్గుపడే ఇలాంటి ఘటనలు ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. యావద్భారతంలో మహిళలు, యువతులు, చిన్నారులపై అత్యాచార ఘటనలను చూస్తున్నాం, వింటున్నాం. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఏం చేయాలనేదానిపై చర్చించాలని వెంకయ్య చెప్పారు.
కాగా, డాక్టర్ దిశపై అత్యాచార, హత్యా ఘటన యావద్దేశాన్ని కదిలించివేసింది. పార్లమెంటు ఉభయ సభలూ ఆ దురంతంపై సుదీర్ఘ చర్చలు ప్రారంభించాయి. ఈ సందర్బంగా ఎంపీ జయాబచ్చన్ అత్యాచారం, హత్య ఘటనల్లో దోషులను బహిరంగంగా కొట్టి చంపాలని ఆగ్రహం ప్రకటించారు. కొన్ని దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలే తగిన శిక్ష విధిస్తారు. నేనే కాస్త కఠినంగా మాట్లాడుతున్నానని తెలుసు. అయినా అలాంటి నేరగాళ్లను బహిరంగంగా కొట్టి చంపడమే సరైంది. ఈ తరహా ఘటనలపై ఎన్నోసార్లు మాట్లాడా. నిర్భయ, కథువా, హైదరాబాద్‌లో జరిగిన ఘటనలపై ప్రజలు, ప్రభుత్వం నుంచి ఇప్పుడు కచ్చితమైన సమాధానాన్ని కోరుకుంటున్నాను అని జయ చెప్పారు.
ఎటు చూసినా శిథిలాలే.. మెట్టుపాళ్యంలో అడుగడుగునా కన్నీళ్ళే
భారీ వర్షాలు ఎన్నోకుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. 17 మందిని బలితీసుకుంది ప్రహరీ గోడ. శిథిలాల కింద పేదలబతుకులు సమాధి అయిపోయాయి. రెండుకుటుంబాలు గోడకు బలయిపోయాయి. ఆగ్రహానికి గురైన స్థానికులు నిరసనలకు దిగడంతో పోలీసుల లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడుని వర్షాలు వణికిస్తున్న సంగతి తెలిసిందే.
కోయంబత్తూరు జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయింది. మెట్టుపాళ్యం, కట్రుపుర ప్రాంతాల్లో క్షణం కూడా తీరిక లేకుండా వాన కురవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నడూరు కన్నప్పన్ లే–అవుట్లో ప్రముఖ వ్యాపారి బట్టల షాపు వుంది. దీనికి సమీపంలో 50 మందికిపైగా పేద రైతులు, కార్మికులు గుడిసెలు, పెంకుటిళ్లు వేసుకుని నివసిస్తున్నారు. శివగామీ, అరుక్కానీ అనే మహిళలు మట్టితో పెంకుటిళ్లు నిర్మించుకుని కుటుంబసభ్యులతో వుంటున్నారు.
వస్త్రవ్యాపారి తన ఇంటికి 30 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తులో బండ రాళ్లతో నిర్మించిన ప్రహరీ గోడ ఈ ఇళ్లకు అనుకునే ఉంది. ఈ గోడే విషాదానికి అడ్రస్ అయింది. వర్షాలకు ఈ గోడ తడిసి కూలిపోయే స్థితికి చేరింది. రాత్రి ఇళ్ళలో జనం యథావిధిగా నిద్రిస్తున్న టైంలో వర్షానికి గోడ కూలిపోయింది.
ఈ గోడ శిథిలాలు ఈ ఇళ్ళపై పడడం, జనమంతా ఇళ్ళలో ఉండడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారు. మేట్టుపాళయం పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ ప్రొక్లయిన్లను రప్పించి శిథిలాలను తొలగించగా మొత్తం 17 మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.
శిథిలాల తొలగింపునకు కోయంబత్తూరు నుంచి ప్రకృతి వైపరీత్యాల రక్షణ దళాలను రప్పించారు. కోయంబత్తూరు కలెక్టర్ రాజామణి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఆర్థికసహాయాన్ని ప్రకటించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన వంద మందితో కూడిన టీం రంగంలోకి దిగింది.
ఈప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించిన మేట్టుపాళయం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి బైఠాయించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా కదలక పోవడంతో లాఠీఛార్జి చేశారు. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఈ ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించనున్నారు.
పార్లమెంటును కుదిపేసిన దిశా ఘటన
హైదరాబాద్ దిశ హత్యోదంతంపై పార్లమెంటులో సుదీర్ఘ చర్చ జరిగింది. సభ్యులు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ ఘోరానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. కేసు విషయంలో జాప్యం లేకుండా త్వరగా నిర్ణయాలు రావాలన్నారు ఎంపీ కనకమేడల రవీంద్రరావు.
దిశ ఘటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆమె ప్రశ్నించారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు ఎంపీ సౌగతా రాయ్. ఎంపీ అమీ యాజ్నిక్ ప్రభుత్వ వ్యవస్థలన్నీఒకే తాటిపైకి వచ్చినపుడే సామాజిక సంస్కరణలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఈ ఘటన దేశాన్ని కలిచివేసిందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దిశను హత్యచేసిన వారికి ఈ నెలాఖరులోపు శిక్షించాలని, వారిని మరణించేవరకూ శిక్షాకాలం ఉండాలన్నారు అన్నా డీఎంకె ఎంపీ విజిల సత్యానంద్.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షలు సత్వరం అమలుచేయాలన్నారు. ఈ సంఘటనపై అన్ని పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. చట్టాలు చేయడం వల్లే బాధితులకు న్యాయం జరగదన్నారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. మహిళలపై దాడులకు తెగబడుతున్నవారికి కఠిన శిక్షలు అమలు చేయాలని సభ్యులు సూచించారు.
దిశా ఘటనపై లోక్‌సభ జీరో అవర్‌లో చర్చించారు. మోదీ, షాలు.. 370 బిల్లుతో భారత మాత తల ఎత్తుకునేలా చేశారు, అలాగే కఠినమైన బిల్లుతో నిందితులను శిక్షించాలని కాకినాడ ఎంపీ గీత కోరారు. మద్యం, డ్రగ్స్‌ను నియంత్రించాలన్నారు.అత్యాచార ఘటనపై ఒక రోజు చర్చ చేపట్టి, కఠినతరమైన చట్టం తీసుకురావాలని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత డిమాండ్ చేశారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. బెంగాల్ ఎంపీ లాకెట్ ఛటర్జీ దిశా ఘటనను ఖండించారు.
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత ఉండే హైదరాబాద్ నగరంలో ఈ ఘటన జరగడం శోచనీయం అన్నారు. నియంత్రణ లేకుండా మద్యం అమ్మడం కూడా ఈ ఘటనకు దారితీసిందన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. దిశా ఘటనలో నిందితులకు కఠినశిక్షలు విధిస్తామని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను నిలువరించేందుకు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నాం. చట్టాల్లో మార్పులు చేసే విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రాజ్ నాథ్ సింగ్.
మెట్టుపాళ్యంలో కూలిన భవనం.. 15 మంది దుర్మరణం
భారీవర్షాలు తమిళనాడు వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల కారణంగా నాలుగు భవనాలు కూలిపోయాయి. ఈ దుర్ఘటనలో కనీసం 15 మంది మృతి చెందినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనేది ఇంకా అధికారిక సమాచారం లేదు. రెండురోజుల నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇది చాలదన్నట్టు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని చెన్నైలోని వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
భారీ వర్షాల దృష్ట్యా పుదుచ్చేరితో పాటు ఐదు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సోమవారం సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కాంచీపురం, కడలూరు, మదురై, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. ఆదివారం కూడా కొనసాగింది.
జనం బయటకు రావడానికి కూడా అవకాశం లేకపోవడంతో నిత్యావసరాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ నెల 15నుంచి మరోసారి వర్ష సూచన ఉందని చెన్నైలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Shiv Sena claims support of 170 MLAs ahead of floor test
Two days after being sworn-in as the Chief Minister of Maharashtra, Shiv Sena chief Uddhav Thackrey will be facing a trust vote in the Assembly on Saturday.
Thackrey, who us heading the Maha Vikas Aghadi- an alliance between Shiv Sena, NCP and Congress will have to prove that he has the required number of 145, which his camp claims will be done easily.
Dilip Walse Patil has been named the pro term speaker and will be conducting the floor test and he will also have a tie-breaker vote in the unlikely case of both the groups having the same number of votes.
Ahead of the trust vote, Shiv Sena leader Sanjay Raut expressed confidence of the alliance winning the floor test. Taking to Twitter, he claimed that the Maha Vikash Agadhi had the support of over 170 MLAs.
"Today is the day to prove majority... 170 +++++...," he tweeted.
As per the assembly results, the Shiv Sena has 56 MLAs, NCP has 54 and Congress has 44 in the 288-member state assembly.
Pragya Thakur dropped from the parliamentary panel after uproar
Controversial BJP MP Pragya Thakur has been dropped from the Parliamentary Panel on Defence after she claimed that Mahatma Gandhi's assassin Nathuram Godse was a 'Deshbhakt'.
Apart from being dropped from the Consultative Committee on Defence in which she was appointed just 8 days back, Thakur has now also been barred from attending BJP Parliamentary meetings as well.
The party has strongly condemned the remarks made by Pragya and after a huge uproar in the Parliament as well as the media, BJP President JP Nadda recommended her removal from the committee. According to the sources, Nadda is also mulling expelling her and cancelling her membership from BJP
It all started when on Wednesday, during a Lok Sabha discussion on the Special Protection Group (Amendment) Bill, DMK member A Raja cited a statement by Godse on why he killed Mahatma Gandhi. Pragya Thakur interrupted him; she said he couldn't give the example "of a deshbhakt".
Opposition members protested her interruption, and BJP members asked her to sit down.
Speaker Om Birla, strongly objecting to Pragya's remarks said that said only Raja's statement would go on record.
This is not the first time that the MP from Bhopal has sung praises of Godse. Earlier this year, Pragya during a public meeting also made similar remarks which were heavily criticised.
Earth imaging satellite Cartosat-3 successfully launched by ISRO
The Indian Space Research Organisation (ISRO) on Wednesday launched its Earth imaging and mapping satellite CARTOSAT-3 along with 13 other nano-satellites from the Satish Dhawan Space Centre at Sriharikota.
The agency had planned for the launch of CARTOSAT-3 satellite, ninth in the series, from the second launch pad at the spaceport of Sriharikota, about 120 kms at 09.28am.
PSLV-C47 on its 49th mission would carry CARTOSAT-3 along with 13 commercial nano satellites from the United States. CARTOSAT-3 is a third generation agile advanced satellite having high resolution imaging capability.
Taking to Twitter, ISRO announced the 16-hour countdown to the launch of the satellites and said, "PSLV-C47 standing tall at the launch pad in Sriharikota. Less than 16 hours for launch. Stay tuned ...
The space organisation continuously updated on the preparations for the launch of the CARTOSAT-3 and other satellites.
No secret ballot and floor test by 5 PM on Wednesday, orders SC
Seeking to bring an end to the ongoing political confusion in Maharashtra, the Supreme Court on Tuesday ordered the floor test in the assembly to be conducted by 5 PM on Wednesday, 27th November. The court further directed that no secret will be used and that the proceedings must be handled by a pro- term speaker which should be telecasted live.
"There exists a dispute in the role of the judiciary. Institutional comity must exist without judicial interference…. At this interim stage, parties must maintain constitutional morality," ruled a three-judge bench.
Citing the Uttarakhand ruling and Jagdambika Pal case in which the then governor of UP had sacked Kalyan Singh as the CM and made Jagdambika Pal of Congress as his successor. If more than one person stakes claim to form the government and the majority is not clear, the Governor may call a session to see who has the majority, cited the SC.
The court was delivering its order after Shiv Sena- NCP and Congress filed a petition after Devendra Fadnavis claiming the support took oath as the CM of Maharashtra with NCP's Ajit Pawar as his deputy.
On Monday, the Centre argued that Governor Bhagat Singh Koshyari invited Devendra Fadnavis to form government based on a letter showing the support of 170 MLAs, including all 54 of the NCP of Ajit Pawar, who was sworn in as Deputy Chief Minister.
ఇద్దరు జవాన్లను బలితీసుకున్న హిమపాతం
చలికాలంలో సరిహద్దుల్లో సైనికులు విధులు నిర్వహించడంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. హిమపాతం వారిని వణికిస్తోంది. ఇద్దరు ఆర్మీ జవాన్లు శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. లద్ధాఖ్లోని దక్షిణ సియాచిన్ హిమానీనదం వద్ద సుమారు 18 వేల అడుగుల ఎత్తులో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా హిమపాతం సంభవించిందని రక్షణ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా చెప్పారు.
సైనిక సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. సైనిక విధులు నిర్వహి అందరినీ గుర్తించి బయటకు తీయగలిగారు. హిమపాతంలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి ఆర్మీ హెలికాప్టర్ల సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. వైద్య బృందాలు శాయశక్తులా ప్రయత్నించాయని, అయితే ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు సైనిక అధికారులు తెలిపారు.
ఈ మధ్యకాలంలో ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నవంబర్ 18న ఇలాంటి ఘటనే జరిగింది. సియాచిన్ గ్లోసియర్లోని సైనిక శిబిరాలపై ఓ హిమపాతం విరుచుకుపడడంతో 8 మంది సైనికులు చిక్కుకుపోయారు. దీంతో అధికారులు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ సంఘటనలో ఎనిమిది మంది సైనికులు మృతి చెందినట్లు చెబుతున్నారు.
పార్లమెంటు ముందు రక్షణ అడిగిన యువతిని ఆడపోలీసులు రక్తం వచ్చేలా కొట్టారు
ప్రియాంకారెడ్డి దారుణ అత్యాచార హత్యకు నిరసనగా శనివారం ఉదయం 7 గంటలకు దేశరాజధానిలో పార్లమెంట్ వద్ద గళమెత్తిన ఓ యువతిని మహిళా పోలీసులు అడ్డుకుని చితకబాదిన ఘటన దేశాన్ని రగిలిస్తోంది. దేశం నిద్రనుండి లేస్తున్న వేళ ఈ దేశంలో నా రక్షణ విషయం ఏమిటి? అంటూ నిలదీసిన ఆ యువతిని మహిళా పోలీసులు దురుసుగా వ్యవహరించి హింసించి బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు.
నా భారతదేశంలో నాలాంటి ఆడపిల్లలకు రక్షణ లేదా.. ఈ దేశంలో ఎందుకు పుట్టానా అనిపిస్తోంది అంటూ ఆక్రోశించిన ఆ యువ ఉద్యోగిని స్వరాన్ని మహిళా పోలీసులు ఆటంకపర్చడం సంచలనానికి దారితీయడమే కాకుండా జనం మూకుమ్మడి నిరసనకు ప్రేరేపించింది.
ఇంతవరకు పోలీసులు మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం గురించిన వార్తలను విన్నాం కానీ కాకీ బట్టలువేసుకున్న మహిళా పోలీసులు అంత కంటే ఘోరంగా వ్యవహరించగలరని, సమస్య పట్ల కనీస సున్నితత్వం కూడా ప్రదర్శించలేనంతగా పోలీస్ బలగాలు మొత్తంగా బండబారిపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనూ దూబే అనే ఆ అమ్మాయి వేసిన ప్రశ్న ఒక్క రాజకీయనేతను కదిలించకపోగా ఎవరి శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు ఉన్నారనే ప్రశ్న దేశం ముందు నిలుస్తోంది. వీడియోకు అడ్డంగా దొరికిపోయిన ఢిల్లీ మహిళా పోలీసులు దేశం పరువును పూర్తిగా తీసేశారు. నాకు రక్షణ ఏది అని అడిగిన అమ్మాయిని మహిళా పోలీసులు ఇంత దురుసుగా వ్యవహరిస్తారా అంటూ ప్రజలు మండిపడుతున్నారు.
ప్రియాంకారెడ్డి హత్యపై పార్లమెంటు వద్ద ఓ యువతి గళమెత్తింది. తన సొంత దేశంలో తనకు రక్షణ ఉన్న భావన కలగడం లేదని వాపోయింది. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల వార్తలు వినీ వినీ తాను అలసిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రియాంకకు ఎదురైన ఉదంతం తనకు ఎదురైతే పరిస్థితి ఏంటి అంటూ కన్నీటిపర్యంతమైంది. ఈ దేశంలో తనకు ఉన్న రక్షణ ఏంటి అంటూ నిలదీసింది.
ప్రియాంక హత్యపై ఢిల్లీకి చెందిన అను దూబే తీవ్ర కలత చెందింది. ఈ ఘటన తనకు ఎదురైతే పరిస్థితి ఏంటని ఊహించుకొని కుమిలిపోయింది. తన రక్షణపై పాలకులను ప్రశ్నిస్తూ శనివారం ఉదయం 7 గంటలకే పార్లమెంటు వద్ద తనొక్కటే నిరసనకు దిగింది. దేశంలో తనకు ఉన్న రక్షణ ఏంటి అంటూ ప్రశ్నిస్తూ ప్లకార్డు పట్టుకొని కూర్చుంది.
పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక మరోసారి ఈ దేశంలో ఇలాంటి ఘటనలు చూసేందుకు తాను సిద్ధంగా లేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆ యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. చివరికి పోలీసులు ఆమెను బలవంతంగా పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాగా, అను దూబేను పోలీసులు అడ్డుకున్న తీరును ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా ఆక్షేపించారు. దూబేతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని దూబేకు సంఘీభావం తెలిపారు. సాటి యువతిని హింసించిన ఆ మహిళా పోలీసులపై తక్షణం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అన్నిటికంటే ముఖ్యమైన విషయం నాకు ఈ దేశంలో భద్రత ఉందని అనుకోవడం లేదు అంటూ గంటలపాటు పార్లమెంటు ముందు బ్యానర్ పట్టుకుని కూర్చున్న అను దుబేని తర్వాత ఢిల్లీ మహిళా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. దేశ ప్రజల భద్రతకు బాధ్యత వహించాల్సిన వారు పూర్తిగా గూండాలుగా మారిపోయారని అనూ విలపిస్తూ వ్యాఖ్యానించారు.
కాగా ప్రియాంకారెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. యువ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేయడంపై యావత్తు దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రియాంక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దోషులను ఉరితీయాలంటూ శనివారం పార్లమెంటు స్ట్రీట్ వద్ద ఆందోళన బాటపట్టాయి.
మా తిండి తింటావు.. మా భాష మాట్లాడవా: డాక్టర్‌పై దాడి
తోటి స్నేహితులతో పర భాషలో మాట్లాడుతున్న ఒక డాక్టర్‌ను బెంగళూరులో కన్నడిగులు చితక బాదిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోగికి సరైన చికిత్స అందించలేదనో.. నిర్లక్ష్యం వహించారోనో... పట్టించుకోలేదనో రోగుల బంధువులు వైద్యులను దూషించడం, కొట్టడం పరిపాటిగా మారిన కాలంలో స్థానిక భాషలో మాట్లాడటం లేదనే కారణంతో ఒక కన్నడ భాషాభిమాని డాక్టరుపై దాడి చేయడం వింతగొలుపుతోంది.
సహజంగానే బెంగళూరు నగరం విభిన్న సంస్కృతులకు, భాషలకు పేరెన్నిక గన్నది. వివిధ భాషల ప్రజలు ఇక్కడ స్వేచ్చగా భావ వ్యక్తీకరణ చేసుకుంటుంటారు. కానీ బహుళ సంస్కృతికి మారుపేరుగా నిలిచిన బెంగళూరులో భాషాపరమైన క్రియాశీలత కూడా మోతాదుకు మించే ఉంటోందని రుజువవుతోంది. నవంబర్ 22 న నగరంలో జరిగిన ఈ సంఘటన అక్కడ పనిచేస్తున్న డాక్టర్లందరిలో భయాందోళన కల్గించింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో పనిచేస్తున్న స్థానికేతర డాక్టర్ వివేక్ నవంబర్ 22న తన స్నేహితుడితో కలిసి నగరంలోని ఒక పెట్రోలు బంక్ వద్ద స్నాక్స్ తింటూ ముచ్చటించుకుంటున్నారు. ఆ సమయంలో వారిని సమీపించిన ముగ్గురు వ్యక్తులు వారితో మాట్లాడటం ప్రారంభించిన కాస్సేపటికే వాదులాట మొదలైంది. దీంతో ఆ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆగ్రహంతో కంపించిపోతూ ఆ వైద్యుడికి కన్నడ భాష రాదనే నెపం పెట్టి చితకబాదారు.
ఏరా.. మా రాష్ట్రంలోకి వచ్చి మా తిండి తింటావు. కానీ కన్నడ మాత్రం మాట్లాడవు అంటూ ఆ అపరిచిత వ్యక్తులు డాక్టరును దూషించడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి డాక్టర్ వివేక్ని కాలర్ పట్టి లాగి ఆనక బాదడం మొదలెట్టాడు. డాక్టర్ స్నేహితుడు ఈ తతంగాన్ని మొబైల్లో రికార్డు చేస్తుండగా మరో వ్యక్తి అతనిపైనా దాడిచేసి ఈ వీడియో రికార్డును తొలగించేశాడు,
ఇదంతా గమనిస్తున్నవారు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. కానీ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే లోగానే ఆ వ్యక్తులు అక్కడినుంచి జారుకున్నారు. తర్వాత వివేక్ కెంగేరి పోలీసు స్టేషన్ వెళ్లి తనపై దాడిగురించి ఫిర్యాదు చేశారు.
ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ ముగ్గురు వ్యక్తులను త్వరలోనే పట్టుకున్నారు కానీ ఒకరోజు లోపే వారిని విడుదల చేశారు. అయితే ఈ ఘటనలో దెబ్బలు తిన్నది డాక్టర్ అని తెలుసుకున్న నగరంలోని వైద్య కమ్యూనిటీ పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. విక్టోరియా ఆసుపత్రి వద్ద గుమికూడిన వందలాది మంది నగర వైద్యులు బెంగళూరులో శాంతిభద్రతలు క్షీణిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నగరంలోని మింటో ఐ హాస్పిటల్‌కి చెందిన ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కన్నడ భాషలో మాట్లాడలేకపోవడమే ఆమె చేసిన నేరం.
ఈ సందర్భంగా విక్టోరియా ఆసుపత్రి పీజీ రెసిడెంట్ డాక్టర్ దయానందన్ సాగర్ మాట్లాడుతూ భాష రానికారణంగా నగరంలో వైద్యులపై దాడి జరగడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ రంగ సంస్థల్లో పనిచేసేవారిపై భాష ప్రాతిపదికన దాడులు జరగడం బెంగళూరులో కొత్తేమీ కాదు. గతంలో బ్యాంకు ఉద్యోగులపై కూడా దాడి చేశారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కన్నడ తెలియని, కన్నడ మాట్లాడలేని వైద్యులపై దాడి చేయడం నమోదు అవుతూ వస్తోంది. వైద్యులు భాషకు అతీతంగా సేవ చేస్తారు. మింటో ఘటనలో ఆ మహిళా డాక్టర్ కన్నడలో ధారాళంగా మాట్లాడటం తెలిసినప్పటికీ భాష ముసుగులో ఆమెపై అకారణంగా దాడి చేశారు దయానందన్ తెలిపారు.
డాక్టర్‌కు స్థానిక భాష తెలిసివుంటే రోగితో మరింత వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని పెంచుకుని చికిత్స అందించగలరన్నది నిజమే కావచ్చు. కానీ ఈ కాలంలో స్థానిక భాషతో పరిచయం తప్పనిసరి అవసరం ఏమీ కాదు. మాకు ఇతర కమ్యూనికేషన్ మార్గాలు కూడా తెలుసు. రోగిని సౌకర్యవంతంగా ఉంచడానికి మేం అనువాదకుల సహాయం కూడా తీసుకుంటుంటాం. అప్పుడు డాక్టర్ ఏం మాట్లాడుతున్నాడు అనేది రోగికి సులువుగా బోధపడుతుంది. అంతేకాని భాషను అడ్డం పెట్టుకుని వైద్యులపై దాడికి దిగడం హేయమైన పని అని విక్టారియా ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ చెప్పారు.
తెలుగు భాష మాధ్యమంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమాలు లేవదీస్తున్న వారు భాషాభిమానం దురభిమానం అయితే, హద్దులు మీరి వ్యవహరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికైనా బెంగళూరు ఘటన గురించి తెలుసుకోవాలేమో...
గాంధీ కుటుంబీకుల జీవితాలతో ఆటలు ఆడొద్దు: శివసేన ధ్వజం
కాంగ్రెస్ కీలకమద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాధికారం చేపట్టగలిగిన శివసేన అందుకు కృతజ్ఞతగా సోనియా గాంధీ కుటుంబానికి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ అధినేత గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) భద్రతను తొలగించటంపై శివసేన పార్టీ మండిపడింది. కేంద్ర సర్కారు గాంధీ కుటుంబ భద్రతపై వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోనియా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించిన కేంద్రప్రభుత్వం.. అదే సమయంలో ప్రదాని, హోంమంత్రి, మంత్రులు, ఇతర పాలక పార్టీ నేతలకు రక్షణ విషయంలో ఏమాత్రం సడలింపు చేయలేదనీ, పారి కాన్వాయ్‌లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాల సంఖ్యను కూడా కుదించలేదని సామ్నా సంపాదకీయం తెలిపింది. అంటే గాంధీ కుటుంబ భద్రత ఉపసంహరణ విషయంలో తెరవెనుక రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని అనుమానించాల్సి వస్తోందని శివసేన పార్టీ అధికార వాణి పేర్కొంది
ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నా తన సంపాదకీయంలో కథనం వెలువరించింది. ఢిల్లీ, మహారాష్ట్ర.. దేశంలో ఎక్కడైనా రాజకీయాలు భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణంలో జరగాలని పేర్కొంది. గాంధీ కుంటుంబీకుల జీవితాలతో ఆటలు ఆడొద్దని ధ్వజమెత్తింది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు తమకు భద్రత కలింగించే రక్షణ సిబ్బంది లేకుండా ఉండలేరు. అంటే భద్రతకు ఎంత ప్రముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని సామ్నా పేర్కొంది. అటువంటి భద్రత గాంధీ కుంటుంబానికి తొలగించటంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకొని స్పందించాలని కోరింది. హోం మంత్రిత్వ శాఖలో ఇటువంటి నిర్ణయం ఎవరు.. ఎలా తీసుకుంటారని సామ్నా తన సంపాదకీయంలో ప్రశ్నించింది. గాంధీ కుటుంబానికి చెందినవారు కాకుండా ఆ స్థానంలో వేరే వాళ్లు ఉంటే. కేంద్రం ఇదే తరహాలో నిర్ణయం తీసుకుంటుందా.. అని సామ్నా తన సంపాదకీయంలో నిలదీసింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాంధీ కుటుంబాన్ని ఎస్పీజీ నుంచి సీఆర్పీఎఫ్ బలగాల సంరక్షణలోని జడ్ ప్లస్ కేటగిరీకి మార్పు చేసినట్లు ప్రకటించింది. కాగా గాంధీ కుటుంబానికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే భద్రత తొలగించినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేసిన విషయం తేలిసిందే.
దాదాపు 28 ఏళ్లుగా గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్పీజీ భద్రతను.. వారికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా ఇకపై రాష్ట్రపతి, దేశ ప్రధానికి భద్రతకై ఎస్పీజీలోని సుమారు 3 వేల మంది సైనికులను వినియోగించనుంది. కాగా 1991లో ఎల్టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు.
రాజీవ్ గాంధీ హత్యానంతరం దేశంలోని ప్రముఖ రాజకీయనేతల భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేపట్టింది. ప్రధానమంతి, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతను కూడా ఎస్పీజీనే చేపడుతోంది. ప్రముఖ రాజకీయ నేతలు ప్రభుత్వ పదవుల నుంచి దిగిపోయిన తర్వాత కూడా వారి కుటుంబాలకు భద్రతనివ్వడం ఎస్పీజీ అలవాటుగా పెట్టుకుంది. కానీ రాజీవ్ హత్య జరిగిన 28 ఏళ్లతర్వాత సోనియాకూ ఆమె కుటుంబానికీ మోదీ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించడం పలు విమర్శలకు దారితీస్తోన్న సమయంలో శివసేన ఈ వ్యవహారంలో కేంద్రాన్నే తప్పుపడుతూ సోనియా గాంధీకి బాసటగా నిలవడం గమనార్హం.

How to stop WhatsApp from eating storage
27-04-2019

వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్..!
13-09-2019

New twist in Srisailam temple's 'religion controversy'
26-08-2019

జిమ్‌లో జారిపడ్డ దీపికా.. రణవీర్ చిలిపి సలహా?
15-05-2019

బిగ్ బ్రేకింగ్.. వైఎస్ వివేకా మాదిరే జగన్ హత్యకూ కుట్ర?!
11-10-2019

Double blow for ‘Teen maar’: Bithiri Sathi joins TV9
30-08-2019

మళ్ళీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. చేతిపై జగన్ పేరుతో మెహిందీ
13-05-2019

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ చించేసింది
14-05-2019

AP's political landscape painted predominantly in blue
28-05-2019