newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

30 నిముషాల్లో 25వేల టికెట్లు.. డిజిటల్ మీడియాను షేక్ చేసిన నేక్డ్ మూవీ

28-06-202028-06-2020 11:38:41 IST
2020-06-28T06:08:41.228Z28-06-2020 2020-06-28T06:08:25.796Z - - 11-07-2020

30 నిముషాల్లో 25వేల టికెట్లు.. డిజిటల్ మీడియాను షేక్ చేసిన నేక్డ్ మూవీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాంగోపాల్ వర్మ నేక్డ్ మూవీ సంచలనం కలిగించింది. డిజిటల్ మోడ్ లో విడుదల చేసిన ఈమూవీ అర గంటలోనే 25 వేల టికెట్లు అమ్ముడయ్యాయని, 200 రూపాయల టికెట్ పెట్టినా ఆన్ లైన్లో ఎగరేసుకుపోయారు. ఇదేం సినిమా రికార్డు కాదుగానీ డిజిటల్ రికార్డు అంటూ సినీ పండితులు అంటున్నారు. కరోనా లాక్ డౌన్ టైంలోనూ అతి తక్కువ బడ్జెట్ వనరులతో క్లైమాక్స్, కరోనా మూవీ తీసి జనంమీదకు వదిలారు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.

తాజాగా శనివారం రాత్రి డిజిటల్లో విడుదల చేసిన చిత్రం ఎన్ఎన్ఎన్ నగ్నం. ఇది 22 నిమిషాల నిడివి కలిగి ఉంటుందని, rgvworld.in/shreyasET వెబ్‌సైట్‌లో ఈ సినిమా చూడొచ్చని ఆయన తన ట్వీట్‌లో తెలియజేశారు. దీన్ని చూడటానికి 200 వసూలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు సినిమా పోస్టర్‌ను కూడా జత చేశారు. ఈ సినిమాను ఆయన తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు.

పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'క్లైమాక్స్' చిత్రం ఆన్ లైన్ లో విడుదలైంది. ఈ చిత్రం సూపర్ హిట్ అయిందని వర్మ ప్రకటించుకున్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... 'క్లైమాక్స్' సూపర్ సక్సెస్ అయిన తర్వాత నగ్నం అనే మూవీ తీయబోతున్నానని, దాని పోస్టర్ కూడా విడుదలచేశారు. ఆ పోస్టర్ తోనే ఆ సినిమాలో ఏం ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. దీంతో ఈ మూవీ కోసం అభిమానులు ఎదురుచూశారు. అనుకున్నట్టుగానే నేక్డ్ మూవీ సెన్సేషన్ కలిగించింది. ఈ సినిమాకు ముందే రాంగోపాల్ వర్మ మర్డర్ అనే చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాలగూడకు చెందిన అమృత ప్రేమ గాథ, ప్రియుడు ప్రణయ్ హత్య, తండ్రి, నిందితులు మారుతీరావు ఆత్మహత్య కథతో ఈ మూవీ తీశాడు. ఇప్పటికే ఈమూవీ పోస్టర్లపై వివాదం రేగుతోంది. 

తాజాగా మరో బాంబు పేల్చాడు వర్మ. బ్రేకింగ్‌ న్యూస్‌... ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్‌ అని పేరు పెట్టాను. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. పవర్‌ స్టార్‌ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను' అంటూ ప్రకటన చేశారు. దీనిపై పవన్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle