newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

హైద‌రాబాద్‌లో సాహో ఈవెంట్ డేట్ ఫిక్స్‌..!

12-08-201912-08-2019 19:52:48 IST
Updated On 13-08-2019 14:33:20 ISTUpdated On 13-08-20192019-08-12T14:22:48.596Z12-08-2019 2019-08-12T14:22:43.130Z - 2019-08-13T09:03:20.169Z - 13-08-2019

హైద‌రాబాద్‌లో సాహో ఈవెంట్ డేట్ ఫిక్స్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆగ‌స్టు 30వ తేదీ కోసం రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ రోజునే సాహో విడుద‌ల కానుండ‌టంతో ప్ర‌భాస్ అండ్ టీమ్ ప్ర‌మోష‌న్ వ‌ర్క్‌తో బిజీ.. బిజీగా ఉన్నారు. కాగా, సాహో టీమ్ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన ప్ర‌మోష‌న్ ఈవెంట్ తేదీని ఫిక్స్ చేశారు. ఈ నెల 18న హైద‌రాబాద్ ఫిల్మ్‌సిటీలో అత్యంత భారీగా సాహో ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించాల‌ని చిత్ర బృందం నిర్ణ‌యించింది. 

అలాగే దుబాయ్‌లోనూ అంతే భారీ స్థాయిలో ఈవెంట్ జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా గురించి తాజాగా మీడియాతో ముచ్చ‌టించిన ప్రభాస్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పారు. సాహోలో తాను అండ‌ర్‌క‌వ‌ర్ ఆప‌రేష‌న్ చేసే అధికారిగా క‌నిపించ‌నున్నాన‌ని, అందుకు తాను జేమ్స్‌బాండ్‌లా చేసేందుకు ఏ మాత్రం ప్ర‌య‌త్నించ‌లేద‌ని ప్ర‌భాస్ చెప్పారు. 

అంతేకాకుండా, సాహోలో ప్ర‌త్యేక‌మైన విజువల్స్ ఇచ్చేందుకు సాహో టీమ్ కృషి చేసిందని, ఆ విజువ‌ల్స్ సినీ ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌నిస‌రిగా న‌చ్చుతాయ‌న్నారు. ఇంకా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప‌నుల‌కు కాస్త ఎక్కువ స‌మ‌యం ప‌ట్టిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని, అబుద‌బీలో చేజింగ్ సీన్స్ కోసం ఏకంగా ఎనిమిది నెల‌ల ప్రీ వ‌ర్క్ జ‌రిగింద‌ని ప్ర‌భాస్ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. చైనా నుంచి స్పెష‌ల్ ఫైట‌ర్‌ల‌ను ర‌ప్పించామ‌ని, హాలీవుడ్ స్టంట్‌ల‌తోపాటు అదే స్థాయిలో కొరియోగ్ర‌ఫీ కూడా ఉంటుంద‌ని ప్ర‌భాస్ అన్నారు. మొత్తంగా సినిమా కోసం ఇంత క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌భాస్ థియేట‌ర్‌లో మెప్పిస్తాడా..?  లేదా..? అన్న‌ది తెలుసుకోవాలంటే ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు మ‌రీ..!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle