newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

హీరోల పిల్లలు పుడింగులా.. ప్రేక్షకులు కాదంటే పోతారంతే.. సురేష్‌బాబు వ్యాఖ్య

30-06-202030-06-2020 10:38:01 IST
Updated On 30-06-2020 10:40:56 ISTUpdated On 30-06-20202020-06-30T05:08:01.892Z30-06-2020 2020-06-30T05:07:58.409Z - 2020-06-30T05:10:56.996Z - 30-06-2020

హీరోల పిల్లలు పుడింగులా.. ప్రేక్షకులు కాదంటే పోతారంతే.. సురేష్‌బాబు వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దర్శకుల, నిర్మాతల, హీరోల పిల్లలు సినిమా స్టార్ల ఇళ్లలోంచి పుట్టరని, ప్రేక్షకుల ఆమోదంతోనే వారు స్టార్స్ అవుతారని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సంచలన వ్యాఖ్య చేశారు. ఏ రంగంలో పనిచేసినా దెబ్బతింటే కుంగిపోకూడదని, చివరివరకు ప్రయత్నిస్తూనే ఉండాలని జీవితం మనకు పాఠం నేర్పుతుందని సురేష్ బాబు వివరించారు. 

సినీ పరిశ్రమలో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, స్టార్ కిడ్స్‌కు మాత్రమే అవకాశాలు ఇవ్వడం అనే టాపిక్‌ను నేను సమర్థించను, విమర్శించను. కారణం ఏంటంటే ఎంతోమంది దర్శకుల, నిర్మాతల, హీరోల పిల్లలు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి నిరూపించుకోలేకపోయారు. స్టార్స్‌ ఇళ్లల్లోనుండి పుట్టరు, ఆడియన్స్‌ ఆమోదంతో స్టార్స్‌ అవుతారు అని సురేష్ బాబు స్పష్టం చేశారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటుడిగా చాలా సాధించాడు. స్టార్‌ నుండి సూపర్‌ స్టార్‌గా మారే దశలో ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోవడం బాధ అనిపించింది. ఉదాహరణకు మన హీరోలనే తీసుకోండి. రవితేజ, నాని, రాజ్‌ తరుణ్‌.. ఇలా ఎంతోమంది వచ్చారు. అందరి హీరోలకు గుడ్‌టైమ్, బ్యాడ్‌టైమ్‌ అనేది ఉంటుంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు క్రికెట్‌ చాలా బాగా ఆడేవాణ్ని. అప్పుడు నన్ను టీమ్‌లో సెలక్ట్‌ చేయలేదు. అప్పుడు నేను డిప్రెషన్‌ ఫీలయితే ఎలా ఏదేమైనా మనం ట్రై చేస్తూనే ఉండాలి. అదే జీవితం అని సురేష్ బాబు చెప్పారు.

కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’కు ఓటీటీలో స్పందన బావుంది. దర్శకుడు దీన్ని థియేటర్‌ సినిమాగా చేద్దాం అన్నాడు. ఈ జనరేషన్‌కి సంబంధించిన కథ కనుక ఓటీటీకి బావుంటుందని ఇలా విడుదల చేశాం. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా రిలీజ్‌ అయితే ఇతర భాషల ఆడియన్‌కు బాగా చేరువవుతుంది. ‘ఆహా’ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతుందన్నారు.

అలాగని అందరూ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమాలు చూస్తారని చెప్పలేం. ఏడాది సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకోవడానికే ఆడియన్‌ చాలా ఆలోచిస్తున్నారు. తీసిన ప్రతి చిన్న సినిమా ఓటీటీలో సక్సెస్‌ అవుతుందని చెప్పలేం. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను ఓటీటీలో వదులుతా అంటే రూ.500 ఖర్చు చేసైనా చూస్తారు. అది కంటెంట్‌ మీద, ప్రేక్షకుడి అభిరుచి మీద ఆధారపడి ఉంటుదని సురేష్ బాబు చెప్పారు. 

ఓటీటీపై దృష్టిపెట్టడం అంటే అది అంత ఈజీ కాదు. ఆర్థికంగా చాలా లెక్కలుంటాయి. అవన్నీ అధిగమించేలా ఉంటేనే వెళ్లాలని నేను అనుకున్నా. ఈ ప్లాట్‌ఫామ్‌లో డబ్బు రాబట్టడం అంత సులభం కాదు.  సబ్‌స్ర్కిప్షన్‌, రన్‌ టైమ్‌, వ్యూవర్‌షిప్‌ మీదే దీనికి ఆదాయం వస్తుంది. రన్‌ టైమ్‌ తగ్గితే డబ్బులు రావు. అలా జరగకపోతే సినిమా అమ్మిన నిర్మాతకు డబ్బు చెల్లించేదెలా? రామ్‌గోపాల్‌ వర్మకి ధైర్యం ఎక్కువ. ఓటీటీనే కాదు ఆయన ఏ మాధ్యమంలో రిలీజ్‌ చేసినా డబ్బులు తెచ్చుకోగలడు అంటూ సురేష్ బాబు వర్మని ప్రశంసించారు.

చివరగా నా కుమారుడు అభిరామ్‌ యాక్టర్‌ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. కొన్ని కథలు కూడా తయారవుతున్నాయి. తెలిసిన వాళ్ల పిల్లలకైనా, మన పిల్లలకైనా,  ఎవరికైనా మొదట్లో కొంచెం పుష్‌ ఇస్తాం కానీ, వాడిని హీరోగా ఒప్పుకోవలసింది, స్క్రీన్‌ మీద చూసేది ప్రేక్షకులే అని సురేష్ బాబు ముగించారు.

 

 

మర్డర్ మూవీ...  ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

మర్డర్ మూవీ... ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

   11 hours ago


ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

   04-07-2020


హాట్ ఫోటోలతో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

హాట్ ఫోటోలతో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

   04-07-2020


పసిపిల్లలపై అత్యాచారం.. హత్యలా.. జాతి వినాశనం ఖాయం.. సాయి పల్లవి ఆక్రోశం

పసిపిల్లలపై అత్యాచారం.. హత్యలా.. జాతి వినాశనం ఖాయం.. సాయి పల్లవి ఆక్రోశం

   04-07-2020


రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

   03-07-2020


మరోసారి విక్రమ్ కుమార్ మూవీలో సమంత?

మరోసారి విక్రమ్ కుమార్ మూవీలో సమంత?

   03-07-2020


కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు

కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు

   03-07-2020


ఏపీ సీఎం జగన్‌ని పొగిడేసిన డైరెక్టర్ పూరీ

ఏపీ సీఎం జగన్‌ని పొగిడేసిన డైరెక్టర్ పూరీ

   02-07-2020


హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాక్షి

హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాక్షి

   02-07-2020


హీరోయిన్లే కాదు దర్శకులూ వారికి టార్గెట్టే

హీరోయిన్లే కాదు దర్శకులూ వారికి టార్గెట్టే

   02-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle