newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

హిట్‌ సిన్మా హీరోయిన్లకు అవకాశాల్లేవ్‌...

11-09-201911-09-2019 15:46:22 IST
Updated On 11-09-2019 15:45:40 ISTUpdated On 11-09-20192019-09-11T10:16:22.795Z11-09-2019 2019-09-11T10:12:37.878Z - 2019-09-11T10:15:40.700Z - 11-09-2019

హిట్‌ సిన్మా హీరోయిన్లకు అవకాశాల్లేవ్‌...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫిల్మ్‌ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. ఫ్లాపుల్లో ఉన్నవాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తారు. సినిమా ఫ్లాప్‌ కావడానికి హీరోయిన్‌ లేదా ఆర్టిస్ట్‌ లేదా టెక్నిషియన్‌ కారణం కాదని తెలిసినా, కేవలం ఫ్లాప్‌ సినిమాలో నటించారనే కారణంతో అవకాశం ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఫ్లాప్‌ సినిమా సాకు చూపి వాళ్లను పక్కన పెడతారు.

హీరోయిన్లపై ఐరన్‌ లెగ్‌ ముద్ర వేస్తారు. యాక్టింగ్‌లో ఎంత టాలెంట్‌ ఉన్నా పట్టించుకోరు. హిట్‌ సిన్మాలో హీరోయిన్‌ అసలు ఏమాత్రం యాక్టింగ్‌ చేయకున్నా తీసేసుకుంటారు. విచిత్రంగా... టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హిట్‌ సిన్మా హీరోయిన్లకు ఇప్పుడు అవకాశాల్లేవ్‌. సంక్రాంతి ఫెస్టివల్‌ హిట్‌ ‘ఎఫ్‌ 2’ లో తమన్నా అందాల విందు చేసింది. 

‘గిర్ర గిర్ర’ సాంగ్‌లో అయితే తమన్నా అందాలు ప్రేక్షకులకు పసందు కలిగించాయి. కానీ, ఆ సినిమా తర్వాత తమన్నాకు మరో అవకాశం రాలేదు. ఇప్పుడు ‘ఎఫ్‌ 2’ దర్శకుడు అనిల్‌ రావిపూడి చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’లో స్పెషల్‌ సాంగ్‌ మాత్రమే చేస్తున్నారు. ‘సైరా’లో తమన్నా నటించినప్పటికీ... ‘ఎఫ్‌ 2’కు ముందు చేసిన చిత్రమే అది.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఈ ఏడాది బిగ్గెస్ట్‌ అందుకున్న మరో హీరోయిన్‌ నిధీ అగర్వాల్‌ చేతిలోనూ ప్రజెంట్‌ ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఆమె హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ అయిన ‘సవ్యసాచి’ ఫ్లాప్‌. కానీ, ఆ సినిమా విడుదలకు ముందే ‘మిస్టర్‌ మజ్ను’లో నటించే ఛాన్స్‌ అందుకుంది. విచిత్రంగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్‌ తర్వాత ఆమెకు మరో ఛాన్స్‌ రాలేదు. ఒకవేళ వచ్చినా పెద్ద అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు.

గతేడాది ‘టాక్సీవాలా’తో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ అయిన తెలుగు అమ్మాయి ప్రియాంకా జవాల్కర్‌కు చాలా రోజుల వరకూ ఛాన్సులు రాలేదు. రీసెంట్‌గా నిర్మాత రాజ్‌ కందుకూరి కుమారుడు శివ హీరోగా యాక్ట్‌ చేయనున్న సినిమాలో సంతకం చేశారని టాక్‌. అలాగే, స్క్రీన్‌ప్లేకి గాను రాహుల్‌ రవీంద్రన్‌ నేషనల్‌ అవార్డ్‌ అందుకున్న సినిమా ‘చిలసౌ’. అందులో రుహానీ శర్మ హీరోయిన్‌. ఆమెకు ఇప్పటివరకూ మరో సినిమా రాలేదు. ఈ లిస్టులో ఇంకొంతమంది ఉన్నారు. హిట్‌ హీరోయిన్లకు ఛాన్సులు రాకపోవడం విచిత్రమే.

https://www.photojoiner.net/image/4Molv0uj


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle