newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

సోషల్ మీడియా అంటేనే దడ పుట్టించే డాక్యుమెంటరీ..!

16-09-202016-09-2020 11:48:06 IST
2020-09-16T06:18:06.845Z16-09-2020 2020-09-16T06:18:02.950Z - - 28-09-2020

సోషల్ మీడియా అంటేనే దడ పుట్టించే డాక్యుమెంటరీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్ ఫోన్ అందులో సామాజిక మాధ్యమాలు.. ఇష్టమొచ్చినట్లు ప్రతి సమయంలోనూ వాడడమే..! చుట్టూ ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోని విధంగా మనం మన సామాజిక ఖాతాల్లోకి దూరిపోయి ఉంటాము.. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అంటూ ఎదురు చూడడం. ఓ యాప్ వాడుతూ ఉంటే.. ఫోన్ లో బ్యాగ్రౌండ్ లో అరడజను యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. వీటి వలన ఎంత ప్రమాదం పొంచి ఉందో  'ది సోషల్ డైలమా' అనే డాక్యుమెంటరీలో పూసగుచ్చినట్లు వివరించారు.

నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ డాక్యుమెంటరీని 'జెఫ్ ఓర్లోస్కీ' తెరకెక్కించాడు. ఈ డాక్యుమెంటరీని చూస్తే యాప్స్ ను, సామాజిక మాధ్యమాలను వాడుతూ ఉన్నవాళ్లకు దడ పుడుతూ ఉంటుంది. వెంటనే ఫోన్ లోని యాప్స్ అన్నిటినీ డిలీట్ చేసి.. ఫోన్ ను పక్కన పెట్టేసి ఎక్కడికైనా వెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది.  

ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు ఎంతగానో అతుక్కుపోయారు 'ది సోషల్ డైలమా' ను చూస్తే అతుక్కుపోవడం దేవుడెరుగు.. కనీసం స్మార్ట్ ఫోన్ ను చేతిలోకి తీసుకోవాలంటేనే భయం పుడుతుంది. గూగుల్ దగ్గర నుండి కొత్తగా వచ్చిన యాప్స్ వరకూ ప్రతి ఒక్క డేటా కూడా ఎవరో ఒకరు మనల్ని చూస్తూ ఉన్నట్లే అనిపిస్తుంది.

చుట్టూ చోటుచేసుకుంటున్న ఘటనలు, ఎప్పుడు ఏది ఉన్నా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడాలు.. ఇలాంటి వన్నీ మనిషి జీవితాన్ని ఎంతగా మారుస్తాయా ఇందులో చూపించారు. 'మెంటల్ హెల్త్' అన్నదే లేకుండా చేస్తాయి.. ఈ సామాజిక మాధ్యమాలన్నది పూసగుచ్చినట్లు వివరించారు. ఒక్కో యాప్స్ మన డేటాను సేకరిస్తూ ఉంటాయి.. స్క్రోలింగ్ చేసినా కూడా ప్రమాదమే అని ఎంతో క్లారిటీగా చెప్పారు. ముఖ్యంగా తప్పుడు సమాచారం అన్నది సామాజిక మాధ్యమాల్లో ఎంత సులువుగా ఇతరులకు చేరిపోతుందో.. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఉదాహరణలతో సహా వివరించడం జరిగింది.  

ది సోషల్ డైలమా డాక్యుమెంటరీ 'సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్' లో ఈ ఏడాది జనవరి సమయంలో ప్రదర్శితమై మంచి పేరును తెచ్చుకుంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది.

ఫేస్ బుక్, గూగుల్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పింటెరెస్ట్ లాంటి సామాజిక మాధ్యమాలలో చోటుచేసుకునే చాలా అంశాల గురించి ఇందులో చర్చించడం జరిగింది. చదవడం, చూడడం, వినడం.. లాంటివన్నీ మన మీద ఎంత ప్రభావం చూపుతాయో వివరించారు. నిజం చెప్పాలంటే సామాజిక మాధ్యమాలు వాడుతున్న వారికి ఈ 'డాక్యుమెంటరీ ఒక హార్రర్ మూవీ లాగా' అన్నమాట..! అంతేకాదు ఈ డాక్యుమెంటరీ కోసం పలువురు టెక్ ఎక్స్పర్ట్స్ ను కూడా ఇంటర్వ్యూ చేశారు. వారు కూడా ఎన్నో షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

మీరు కూడా ఓసారి ఈ డాక్యుమెంటరీని చూసి.. సామాజిక మాధ్యమాలు ఎంత వరకూ మనకు మంచి చేస్తున్నాయో.. మీరు కూడా ఎంత వరకూ సామాజిక మాధ్యమాలకు బానిసలై పోయారో తెలుసుకోండి. 

బాలు ఆసుపత్రి బిల్లు వివాదం.. వివరణ ఇచ్చిన ఎస్పీ చరణ్

బాలు ఆసుపత్రి బిల్లు వివాదం.. వివరణ ఇచ్చిన ఎస్పీ చరణ్

   an hour ago


సమంత, కాజల్, తమన్నాల బాటలో.. శృతిహాసన్!

సమంత, కాజల్, తమన్నాల బాటలో.. శృతిహాసన్!

   5 hours ago


పవన్ తో బండ్ల గణేష్ మూవీ.. ఇంతకీ.. డైరెక్టర్ ఎవరు..?

పవన్ తో బండ్ల గణేష్ మూవీ.. ఇంతకీ.. డైరెక్టర్ ఎవరు..?

   5 hours ago


91వ వసంతంలోకి అడుగుపెట్టిన గాన కోకిల 'లతామంగేష్కర్'

91వ వసంతంలోకి అడుగుపెట్టిన గాన కోకిల 'లతామంగేష్కర్'

   6 hours ago


బిగ్ బాస్4: బిగ్ బాస్ రికార్డ్స్ సాధించిన కంటెస్టెంట్స్..

బిగ్ బాస్4: బిగ్ బాస్ రికార్డ్స్ సాధించిన కంటెస్టెంట్స్..

   7 hours ago


నా బాస్ ఓకే అన్నారు.. పవన్ తో బండ్లగణేష్ మూడో సినిమా..

నా బాస్ ఓకే అన్నారు.. పవన్ తో బండ్లగణేష్ మూడో సినిమా..

   8 hours ago


క్రికెటర్ల భార్యలు కూడా డ్రగ్స్ వాడతారు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

క్రికెటర్ల భార్యలు కూడా డ్రగ్స్ వాడతారు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

   8 hours ago


విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో భారీ చిత్రం నిజమేనా?

విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో భారీ చిత్రం నిజమేనా?

   9 hours ago


బాలుని ఖననం చేసిన ప్రాంతంలోనే..ఆయన స్మారక మందిరం..

బాలుని ఖననం చేసిన ప్రాంతంలోనే..ఆయన స్మారక మందిరం..

   9 hours ago


ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ టాక్ ఏంటి..?

ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ టాక్ ఏంటి..?

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle