newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

‘సైరా’తో ‘సాహో’.. హేమాహేమీలు కలిసిన వేళ!

21-08-201921-08-2019 08:00:56 IST
Updated On 21-08-2019 11:29:27 ISTUpdated On 21-08-20192019-08-21T02:30:56.879Z21-08-2019 2019-08-21T02:30:36.712Z - 2019-08-21T05:59:27.326Z - 21-08-2019

‘సైరా’తో ‘సాహో’.. హేమాహేమీలు కలిసిన వేళ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. వారిలో సినీ సెలెబ్స్ కూడా ఉన్నారు. ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు చాలా సార్లు చిరంజీవిపై తమ కున్న అభిమానాన్ని చాటుకున్నారు. సాహో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ప్రభాస్ తనకు మెగాస్టార్ చిరంజీవి నుండి వచ్చిన మెస్సేజ్ చూసి షాకయినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. 

Image may contain: 5 people, including Phani Naidu, people smiling, people sitting and indoor

"ట్రైలర్ చాలా బావుందని అద్భుతంగా కనిపించవని మెగాస్టార్ గారు మెస్సేజ్ చేయగానే నేను వెంటనే కాల్ చేశాను. ఆయన అలా మెస్సేజ్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గూస్ బంప్స్ వచ్చాయని" ప్రభాస్ పేర్కొన్నారు. తాజాగా చిరంజీవి నటించిన 'సైరా' సినిమా టీజర్ వేడుక ముంబైలో జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్ పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమం తరువాత మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ బాలీవుడ్ రిపోర్టర్ రాజీవ్ మసంద్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో 'సాహో' చిత్ర ప్రమోషన్స్ కోసం వచ్చిన ప్రభాస్ తారసపడ్డారు. 'బాహుబలి' ప్రభాస్ కూడా తన ఫ్యాన్ మూమెంట్ ను దాచుకోలేక చిరంజీవితో ఫోటో దిగారు. 

ఒక వైపు చరణ్, మరో వైపు ప్రభాస్ తో చిరు ఉన్న పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో 'సైరా'తో 'సాహో' అని కామెంట్స్ పడుతున్నాయి. ఈ రెండు సినిమాలు 32 రోజుల గ్యాప్ లో విడుదలవుతున్నాయి. ఆగష్టు 30న 'సాహో' విడుదల కానుండగా అక్టోబర్ 2న 'సైరా' విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావాలని ఇద్దరూ హీరోల అభిమానులు కోరుకుంటున్నారు..!

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle