newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

సైనా బయోపిక్.. భయమేస్తుంది అంటున్న హీరోయిన్..

16-09-202016-09-2020 13:11:19 IST
2020-09-16T07:41:19.122Z16-09-2020 2020-09-16T07:41:17.460Z - - 30-09-2020

సైనా బయోపిక్.. భయమేస్తుంది అంటున్న హీరోయిన్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. బయోపిక్ చిత్రాలపై ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తిని చూపిస్తుండటంతో ఫిలిం మేకర్స్ కూడా బయోపిక్ ల బాట పడుతున్నారు. అన్ని రకాల పరిశ్రమలలో బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు, బాగా ఫేమ్ అయినా వాళ్ళ జీవిత కథలని తీసుకొని బయోపిక్ ల రూపంలో నిర్మిస్తున్నారు.

బయోపిక్ లు కూడా చాలా వరకు హిట్ అయి మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖుల జీవితాలని తెరకెక్కించారు. తాజాగా మరో క్రీడా ప్రముఖురాలి జీవిత కథని తెరకెక్కిస్తున్నారు. అది ఎవరో కాదు బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో సైనా నెహ్వాల్ గా పరిణీతి చోప్రా నటిస్తుంది. ఈ సినిమాకి అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్ ని టి.సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయింది. పాటలు కూడా పూర్తి చేస్తున్నారు. షూటింగ్ కూడా కొద్దిగా పూర్తి అయింది. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూట్ మళ్ళీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్స్ రికార్డింగ్ కూడా మొదలైంది. దీనికి రోచక్ కోహ్లీ- అమాల్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ ముంతాషిర్ అద్భుతమైన లిరిక్స్ ఇస్తే శ్రేయాస్ ఘోషల్ అంతే అద్భుతంగా పాడిందని మ్యూజిక్ డైరెక్టర్ తెలిపారు.

సైనా పాత్రని పరిణీతి చోప్రా ఓ సవాల్ గా స్వీకరించి నటిస్తోంది. దీనికోసం బ్యాడ్మింటన్ స్టార్ గా కనిపించడానికి బ్యాడ్మింటన్ లో కఠోర శిక్షణ తీసుకుంటుంది. పరిణీతి కెరీర్ లో గుర్తుండిపోయేలా ఈ ఫిల్మ్ ఉంటుందని చెప్తున్నారు.    

సైనా పాత్రకి పరిణీతి చోప్రా పెర్ఫార్మెన్స్ కి హండ్రెడ్ మార్క్ పడతాయని చిత్ర బృందం అంటున్నారు. అయితే దీనిపై పరిణీతి మాట్లాడుతూ ఎందుకో భయం వేస్తుంది. అంత గొప్ప స్టార్ ప్లేయర్ రోల్ లో చేస్తుంటే అని అంది. కొంచెం నెర్వస్ గా ఫీల్ అవుతున్నాను కానీ సైనా పాత్రకి పూర్తి న్యాయం చేస్తాను అని తెలిపింది.  

 

రాజ్ తరుణ్ - హేబ్బా పటేల్ లవ్ లో ఉన్నారా..?

రాజ్ తరుణ్ - హేబ్బా పటేల్ లవ్ లో ఉన్నారా..?

   an hour ago


నిన్న వైఎస్ జగన్ - నేడు జయప్రద..!

నిన్న వైఎస్ జగన్ - నేడు జయప్రద..!

   3 hours ago


యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. ఎవరితో తెలుసా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. ఎవరితో తెలుసా..?

   3 hours ago


క్యాబ్ డ్రైవర్ ని మోసం చేసిన ముమైత్ ఖాన్..

క్యాబ్ డ్రైవర్ ని మోసం చేసిన ముమైత్ ఖాన్..

   4 hours ago


బిగ్ బాస్4: వాళ్లంతా గేమ్ ఆడటానికి రాలేదు.. 3 నెలలు డేటింగ్ కి వచ్చారు..

బిగ్ బాస్4: వాళ్లంతా గేమ్ ఆడటానికి రాలేదు.. 3 నెలలు డేటింగ్ కి వచ్చారు..

   4 hours ago


మొగలిరేకులు సీరియల్ ఆర్కే నాయుడు హీరోగా సినిమా..

మొగలిరేకులు సీరియల్ ఆర్కే నాయుడు హీరోగా సినిమా..

   4 hours ago


ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్ కి గట్టిగా సమాధానం చెప్పిన పునర్నవి..

ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్ కి గట్టిగా సమాధానం చెప్పిన పునర్నవి..

   5 hours ago


పవన్ ఫ్యాన్స్ వల్లే ఎలిమినేట్ అయ్యాను.. దేవి నాగవల్లి

పవన్ ఫ్యాన్స్ వల్లే ఎలిమినేట్ అయ్యాను.. దేవి నాగవల్లి

   5 hours ago


వరదల్లో కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాతగారి ఇల్లు..

వరదల్లో కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాతగారి ఇల్లు..

   7 hours ago


న్యూ లుక్ లో.. కూల్ గా కనిపిస్తోన్న యంగ్ హీరో

న్యూ లుక్ లో.. కూల్ గా కనిపిస్తోన్న యంగ్ హీరో

   7 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle