newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

సూపర్ స్టార్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ కి కలెక్షన్ల వర్షం

15-01-202015-01-2020 09:57:18 IST
2020-01-15T04:27:18.039Z15-01-2020 2020-01-15T04:27:12.219Z - - 17-01-2020

సూపర్ స్టార్ మూవీ  ‘సరిలేరు నీకెవ్వరు’ కి కలెక్షన్ల వర్షం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు హీరోలు సంక్రాంతికి తమ సినిమా ఒక్కటైనా విడుదల కావాలని భావిస్తారు. ఈఏడాది రజనీకాంత్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు సంక్రాంతికి సందడి చేశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ సందడి చేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది. 

ఈ సినిమా తొలి మూడురోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను దాటేయడంతో సూపర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ మూవీలో కామెడీ కూడా అదిరిపోయింది. సినిమా 103 కోట్ల రియల్‌ గ్రాస్‌ వసూలు చేసిందని చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు మహేశ్‌బాబుతో కూడిన సరిలేరు నీకెవ్వరు పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండోరోజు శనివారం సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలిమూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్లు వసూలు చేసి సత్తా చాటిందని చిత్రయూనిట్ చెబుతోంది. 

ఈ మూవీలో చాలామంది నటీనటులు వున్నారు. ముఖ్యంగా విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం, ఆమె పోషించిన పాత్ర కూడా ప్లస్ అయిందనే చెప్పాలి. భరత్ అనే నేను, మహర్షి వంటి సినిమాల తర్వాత గ్యాప్ తో వచ్చిన మహేశ్‌ సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  పటాస్ నుంచి ఎఫ్2 వ సినిమాలతో హిట్ టాక్ అందుకున్న యువదర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle