newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సుశాంత్ కేసు సీబీఐకి.. సుప్రీం కీలక నిర్ణయం

19-08-202019-08-2020 13:00:56 IST
Updated On 01-09-2020 12:32:16 ISTUpdated On 01-09-20202020-08-19T07:30:56.518Z19-08-2020 2020-08-19T07:30:04.809Z - 2020-09-01T07:02:16.836Z - 01-09-2020

సుశాంత్ కేసు సీబీఐకి.. సుప్రీం కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంచలనం కలిగించిన బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈకేసుని సీబీఐకి అప్పగించింది. జూన్‌ 14లో సుశాంత్‌ తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు బాలీవుడ్‌లోనే కాకుండా రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది.

ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటివరకూ ఈ కేసుకి సంబంధించి సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 

సుశాంత్‌ ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు. ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా పాత్రపైన ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. దీంతో రియాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం న్యాయ‌బ‌ద్ద‌మైన‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ జ‌స్టిస్ హృషికేశ్ రాయ్ ఇచ్చిన తీర్పును సుశాంత్‌ కుటుంబసభ్యులు స్వాగతించారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రియా పాత్రపై, సుశాంత్ కి చెందిన కోట్లాదిరూపాయలు ఆమె అకౌంట్ కు బదిలీ అయిన విషయాలపై ఆమెను ప్రశ్నించారు. అయితే తనకేం తెలియదని ఆమె చెబుతోంది. 

సుప్రీం నిర్ణయంపై బాలీవుడ్లో ట్వీట్ల వరద పారుతోంది. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. విజయానికి, నిష్పాక్షిక దర్యాప్తునకు తొలి అడుగు పడిందంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రార్థనలకు ఫలితం లభించిందంటూ ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే. సత్యం వైపు మొదటి అడుగు అంటూ  ఆమె సీబీఐపై పూర్తి విశ్వాసం  ప్రకటించారు.

సుశాంత్ స్నేహితురాలు అంకిత లోఖండేతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్,  సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా దీనిపై స్పందిస్తూ నిజాలు నిగ్గు తేలతాయంటూ ట్వీట్ చేయడం విశేషం. ఆదినుంచి సుశాంత్ మరణం అనంతరం బాలీవుడ్లో నెపోటీజంపై అలుపెరుగని పోరాటం చేస్తోంది హీరోయిన్ కంగన రనౌత్ . ఆమె కూడా కేసుని సీబీఐకి అప్పగించడంపై స్పందించారు. మానవత్వం గెలుస్తుంది, ఎస్ఎస్ఆర్ వారియర్స్ కు అభినందనలు, తొలిసారి సామూహిక శక్తి బలం అనుభవంలోకి వచ్చింది. అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. 

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు.. షెర్లిన్ చోప్రాకు సమన్లు

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు.. షెర్లిన్ చోప్రాకు సమన్లు

   7 hours ago


అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ నుంచి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ లుక్ రిలీజ్

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ నుంచి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ లుక్ రిలీజ్

   12 hours ago


ప్రముఖ నటి జయంతి కన్నుమూత

ప్రముఖ నటి జయంతి కన్నుమూత

   16 hours ago


Prabhas Salaar: సలార్ భారీ ఫ్లాష్‌‌‌‌బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ స్టార్స్

Prabhas Salaar: సలార్ భారీ ఫ్లాష్‌‌‌‌బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ స్టార్స్

   18 hours ago


రాజ్‌ కుంద్రాకి వ్యతిరేకంగా ఉద్యోగుల సాక్ష్యం

రాజ్‌ కుంద్రాకి వ్యతిరేకంగా ఉద్యోగుల సాక్ష్యం

   20 hours ago


ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

   25-07-2021


నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

   25-07-2021


హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

   24-07-2021


Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

   24-07-2021


ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

   24-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle