newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సుశాంత్ కేసులో కీలక పరిణామం.. నిజాలు ఒప్పుకున్న రియా

07-09-202007-09-2020 08:16:13 IST
Updated On 07-09-2020 08:34:53 ISTUpdated On 07-09-20202020-09-07T02:46:13.800Z07-09-2020 2020-09-07T02:46:10.004Z - 2020-09-07T03:04:53.202Z - 07-09-2020

సుశాంత్ కేసులో కీలక పరిణామం.. నిజాలు ఒప్పుకున్న రియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించి సీబీఐ విచారణ వేగవంతం అవుతోంది. ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో నటి రియా చక్రవర్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఆదివారం ఆమె ఎన్సీబీ విచారణకు హాజరైంది. 

సుశాంత్ మరణం వెనుక  డ్రగ్స్ మాఫియా హస్తం ఉందన్న కోణంలో కేసును విచారిస్తున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సుదీర్ఘంగా విచారించింది. ఎన్‌సీబీ విచారణకు హాజరైన ఆమె కొన్ని నిజాలు ఒప్పుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు రియా చక్రవర్తి అంగీకరించింది. షోవిక్, మిరాండాల ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు రియా ఎన్‌సీబీ అధికారులు ముందు చెప్పింది. 

తన సోదరుడి ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకున్నానని రియా వెల్లడించింది. సుమారు 6 గంటలపాటు రియాను ఎన్‌సీబీ అధికారులు విచారించారు. అంతేకాదు సోమవారం కూడా రియాచక్రవర్తిని మరోసారి ఎన్‌సీబీ విచారించనుంది. దీంతో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనంతరం రియాను కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాతో రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తికి సంబంధాలున్నట్టు తేలడంతో ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. అతని నుంచి అనేక విషయాలు రాబట్టింది. 

ఆదివారం చారణకు వెళ్లే ముందు రియా తరపు న్యాయవాది సతీష్ మనీ షిండే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రియా అరెస్ట్‌కు సిద్ధంగా ఉందని చెప్పారు. ఒకరిని ప్రేమించడం నేరమైతే.. ప్రేమించినందుకు ఆమె ఆ పరిణామాలు ఎదుర్కోవడానికి వెనకడుగు వేసే పరిస్థితిలో లేదన్నారు. రియా అమాయకురాలన్నారు. సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ కేసులు ఆమెపై నమోదైనప్పటికీ ఏ కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని, అదే ఆమె చిత్తశుద్దికి నిదర్శనమని ఆమె తరపు న్యాయవాది సతీష్ మనీ షిండే అన్నారు. 

 

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   33 minutes ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   21 hours ago


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తర్వాత సారీ

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తర్వాత సారీ

   07-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle