newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

'సీనయ్య'గా వినాయక్...లుక్ అదిరింది

09-10-201909-10-2019 14:58:32 IST
Updated On 09-10-2019 14:59:59 ISTUpdated On 09-10-20192019-10-09T09:28:32.557Z09-10-2019 2019-10-09T09:28:30.741Z - 2019-10-09T09:29:59.776Z - 09-10-2019

'సీనయ్య'గా వినాయక్...లుక్ అదిరింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు సినిమా పరిశ్రమలో దాసరినారాయణరావు  వేసిన ముద్ర చెరగనిది. దర్శకరత్న అనే బిరుదుకు దాసరి సరిగా సరిపోతాడు. 24 శాఖల మీద మంచి పట్టు ఆయన సొంతం. ఆయన అందించిన కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలతో తెలుగులో చాలా సూపర్ హిట్స్ వచ్చాయి. నటుడుగా టర్న్ తీసుకున్న దాసరి చాలా చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించారు.

ఆయన నటించిన 'ఒసేయ్ రాములమ్మ', 'సూరిగాడు', 'అమ్మ రాజీనామా', 'మేస్త్రి', 'ఎర్రబస్సు' లాంటి సినిమాలను ప్రేక్షకులు మరిచిపోలేరు.  'మేస్త్రి' సినిమాలో నటనకు గాను ఆయన నంది అవార్డు సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా దాసరి టచ్ చేయని జోనర్ లేదు. సాంఘిక, జానపద, పౌరాణిక, విప్లవాత్మక, పీరియాడిక్ మూవీస్ తీసి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు.

ఆయన మరణం తరువాత సినిమా పరిశ్రమలో ఆ మార్క్ కనపించే వారు ఎవరు లేరని అనుకున్నారు. కానీ నేనున్నానంటూ మాస్ చిత్రాల దర్శకుడు వినాయక్ ముందుకు వచ్చాడు. ఆది సినిమాతో ఎన్టీఆర్, దిల్ సినిమాతో నితిన్, ఠాగూరు, ఖైదీ నెంబర్ 150 సినిమాలతో చిరంజీవికి సూపర్ హిట్స్ ఇచ్చిన వినాయక్ ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ చిత్రాలు తీయలేకపోయాడు. సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్ సినిమా దారుణ పరాజయంతో వినాయక్ దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చాడు.

హీరోగా మారాలనే ఉద్దేశంతో తన మేక్ ఓవర్ లో మార్పులు చేసే పనిలో పడ్డాడు. విజయదశమి కానుకగా ఆయన హీరోగా నటించిన 'సీనయ్య' సినిమా లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చేతిలో రెంచ్ పట్టుకుని మెకానిక్ గెటప్ లో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసాడు. ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన వాళ్లందరూ కూడా దాసరినారాయణరావు లాగానే డైరెక్టర్ హీరోగా మారాడని, ఆయన బాటలోనే నడిచి అన్ని జోనర్స్ లో సినిమాలు తీస్తే చిన్న బడ్జెట్ సినిమాలకి మంచి బలం వస్తుందని అబిప్రాయపడుతున్నారు.

నేడు (అక్టోబర్ 9) వినాయక్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకుంది. 'శరభ' సినిమా ఫేమ్ నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

దిల్ సినిమాతో నిర్మాతగా తనకు లైఫ్ నిచ్చిన వినాయక్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో జరుపుకోనుంది. హిట్ చిత్రాలను తీసి టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వినాయక్ హీరోగా ఏమేరకు మెప్పిస్తారో చూడాలి.

Image


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle