newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా థియేటర్లు ఓపెన్

22-05-202022-05-2020 11:35:32 IST
Updated On 22-05-2020 12:06:48 ISTUpdated On 22-05-20202020-05-22T06:05:32.491Z22-05-2020 2020-05-22T06:02:19.454Z - 2020-05-22T06:36:48.902Z - 22-05-2020

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా  థియేటర్లు ఓపెన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులు, రీ రికార్డింగులు, రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే సినిమా థియేటర్ల యజమానులకు మంచి శుభవార్త అందించింది ప్రభుత్వం. ఆగస్టునుంచి అన్ని సినిమా థియేటర్లు ఓపెన్ కానున్నాయి. అయితే కొన్ని నిబంధనలు మాత్రం విధించనుంది. రోజుకి ఒక స్క్రీన్ పై మూడు షోలు వేయాల్సి వుంటుంది. లాక్ డౌన్ ప్రారంభం అయిన నాటినుంచి సుమారు రెండునెలలుగా సినిమాల ప్రదర్శన ఆగిపోయింది. థియేటర్లు, మల్టీఫ్లెక్సులు మూతబడ్డాయి. అప్పటినుంచి లాక్ డౌన్ 4.O అమలులోకి వచ్చినప్పటి నుంచి సినిమా థియేటర్లు, షూటింగులపై క్లారిటీ వస్తుందని భావించారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఫుడ్ రెస్టారెంట్లు, షాపులు, సెలూన్లు.. ఇలా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి తెరుచుకుంటున్నాయి.

చిరు ఇంట్లో తలసాని భేటీ.. సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో భేటీ అయ్యాక ఒక క్లారిటీ వచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రముఖ నటుడు చిరంజీవి ఇంట్లో నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, వి. వినాయక్,  త్రివిక్రమ్ శ్రీనివాస్, N.శంకర్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం సినిమా థియేటర్లను పునః ప్రారంభంచే విషయాలపై చర్చించారు.  

సమావేశంలో అందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నారు.మాక్ షూటింగులు నిర్వహించుకుని పరిస్థితిని అంచనా వేశాక షూటింగులకు అనుమతి ఇస్తామన్నారు. సినిమా రంగంలో సమస్యలపై, వాటి పరిష్కారాలపై సీఎం కేసీయార్ సానుకూలంగానే వున్నారు. ఈ క్రమంలో  తెలుగు చిత్ర పరిశ్రమ భారీ నష్టాలను మూటగట్టుకుంటోందని సినిమా నిర్మాతలు మంత్రికి తెలిపారు. ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, తాము చాలా నష్టపోతున్నామని ఆయా సినీ నిర్మాతలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. 

మరోవైపు సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభిస్తే .. కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఇటు సినిమా నిర్మాతలు భారీ నష్టాల నుంచి బయటపడేందుకు ఆన్ లైన్ సినిమా ..OTT వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో అటు థియేటర్ల యాజమాన్యాల్లో గుబులు నెలకొంది. OTTపై సినిమాలు విడుదల చేస్తే.. తాము పూర్తిగా నష్టపోతామని థియేటర్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా అనేక సినిమాలు  ఈబాట పట్టాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్లు ఓపెన్ చేస్తే కొత్త సినిమాలు విడుదలకు మార్గం సుగమం అవుతుందని నిర్మాతలు, బయ్యర్లు అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle