newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

సాహో స్టోరీ లీక్..ప్రభాస్ రోల్ ఏంటంటే..?

12-06-201912-06-2019 13:29:26 IST
2019-06-12T07:59:26.646Z12-06-2019 2019-06-12T07:59:24.301Z - - 26-06-2019

సాహో స్టోరీ లీక్..ప్రభాస్ రోల్ ఏంటంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీ అభిమానులు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న చిత్రం 'సాహో'. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పవలిసిన అవసరం లేదు. 'బాహుబలి' సినిమాతో యంగ్ రెబల్ స్టార్ నుండి నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఈ చిత్రంలో హీరోగా నటించడమే. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

విడుదల చేసిన మేకింగ్ వీడియోస్, పోస్టర్స్ ఇంట్రస్టింగ్ ఉండటంతో అంచనాలు కూడా మరింత పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా కథ ఇదేనంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం "ప్రభాస్ ఓ నకిలీ ఇంటర్ పోల్ ఆఫీసర్. మాఫియా, డ్రగ్స్ సరఫరా ద్వారా బిలియనీర్స్ గా ఉన్న వారి అక్రమాలకు చెక్ పెడతారు. అసలు ప్రభాస్ నకిలీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా అవతారమెత్తేది తన బాల్యంలో అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం కోసమేనని... ఈ విషయంలో శ్రద్దా కపూర్.. ప్రభాస్ కు సహకరిస్తుందని" చెబుతున్నారు. 

బాలీవుడ్ స్టార్స్ నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా అరుణ్ విజయ్, లాల్ కీలక పాత్రలో నటించారు. దుబాయ్ లో చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం దాదాపు 60 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ సినిమాకు విజువల్ ఎఫక్ట్స్ కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. 

శంకర్-ఎహసాన్-లాయ్ మ్యూజిక్ నుండి తప్పుకోవడంతో మ్యూజిక్ దర్శకుడు కోసం చిత్ర యూనిట్ చూస్తోందని వార్తల నేపథ్యంలో చిత్ర యూనిట్ థమన్ ను సంప్రదిస్తున్నారని సమాచారం. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్టు పూర్తిచేసుకున్న ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేస్తున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle