newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

సాహో మూవీలో ప్రభాస్ డబుల్ యాక్షన్

21-08-201921-08-2019 11:24:53 IST
2019-08-21T05:54:53.305Z21-08-2019 2019-08-21T05:54:12.621Z - - 20-09-2019

సాహో మూవీలో ప్రభాస్ డబుల్ యాక్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'సాహో' సినిమా ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ప్రతి ఛానల్ లో సాహోకి సంబంధించిన చిన్న చిన్న అప్ డేట్స్ సైతం హల్ చల్ చేస్తున్నాయి. సినిమా విడుదల దగ్గరకు పడే కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. తాజాగా చిత్ర యూనిట్ జాక్వలిన్ తో ప్రభాస్ స్టెప్స్ తో అదర గొట్టిన 'బ్యాడ్ బాయ్' పాటను విడుదల చేశారు.

దీంతో ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఒక పాత్ర పోలీస్ ఆఫీసర్ కాగా మరో పాత్ర 'రాబిన్ హూడ్' లాగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి రివెంజ్ ఈ పాత్ర తీసుకుంటుందని సమాచారం.ఈ టైమ్ లో  ఈసినిమాలో విలన్ అయిన నీల్ నితిన్ ముఖేష్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

సాహో సినిమాలో మెయిన్ విలన్ గా నీల్ నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వేడుకలో సుజిత్ విలన్ నీల్ నితిన్ కి ఎప్పుడో కథ చెప్పాను అని 2015లో ఇది జరిగిందని చెప్పాడు. ప్రభాస్ కోసం దాదాపు రెండేళ్లు ఎదురు చూశారట.

బాహుబలి 2 షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. దాంతో సాహో సినిమా షూటింగ్ ఆలస్యంగా మొదలయింది.

సినిమా ఆలస్యం కావడంతో తనను సినిమా నుంచి తప్పించారేమో అనుకోని భయపడ్డానని, కానీ, సుజిత్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని నీల్ నితిన్ చెప్పాడు.సినిమా ఆలస్యమయినా అద్దిరిపోయే అవుట్ పుట్ ఇచ్చాడని నీల్ నితిన్ చెప్పడంతో బీ-టౌన్ వర్గాలలో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. సెన్సార్ మినహా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఆగష్టు 30న విడుదల చేస్తున్నారు..!


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle