newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

‘సాహో’రే ‘బాహుబలి’ జై హారతి నీకేపట్టాలి.. జై కొట్టాలి!

07-09-201907-09-2019 07:49:36 IST
Updated On 07-09-2019 10:11:37 ISTUpdated On 07-09-20192019-09-07T02:19:36.803Z06-09-2019 2019-09-06T16:32:53.654Z - 2019-09-07T04:41:37.822Z - 07-09-2019

‘సాహో’రే ‘బాహుబలి’ జై హారతి నీకేపట్టాలి.. జై కొట్టాలి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'వారసత్వం' మన ఇండియన్ సినిమాలలో ఎక్కువగా చూస్తుంటాం. సౌత్ సినిమాలలో ఈ కల్చర్ మరింత ఎక్కువగా ఉంటుంది. అభిమాన హీరోలను మాత్రమే గాక వారి వారసులను కూడా ప్రేక్షకులు ఆరాధించే సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో వారసత్వం అందిపుచ్చుకొని వచ్చిన వారసులు స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు. 

Image result for eeswar to baahubali

ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ... ఏఎన్ఆర్ వారసుడిగా నాగార్జున.. కృష్ణ వారసుడిగా రమేష్ బాబు, మహేష్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి అభిమానులను అలరించారు.

ఇక చిరంజీవి వారసులుగా ఏకంగా 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ చిత్రాలతో 70-90 దశకంలో తెలుగు ప్రజలను అలరించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ సినీ రంగ ప్రవేశం చేశాడు. కృష్ణంరాజు తమ్ముడు ప్రముఖ నిర్మాత సూర్యనారాయణ రాజు తనయుడైన ప్రభాస్ 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

2002లో వచ్చిన 'ఈశ్వర్' సినిమాతో అడుగు పెట్టిన ప్రభాస్ మొదటి సినిమాతోనే స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన రాఘవేంద్ర సినిమా నిరాశ పరిచినా శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వర్షం' సినిమాతో స్టార్ హీరోల సరసన చేరాడు. ఆ చిత్రం హిట్ తో ప్రభాస్ కు క్లాస్ అభిమానులే గాక మాస్ అభిమానులు ఏర్పడ్డారు.

ఆ తరువాత వచ్చిన అడివి రాముడు, చక్రం సినిమాలు పరాజయం పాలైనా స్టార్ హీరోల రేంజ్ లో కలెక్షన్స్ వసూల్ చేసి ప్రభాస్ సత్తా టాలీవుడ్ లో చాటింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాతో తిరుగు లేని ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు.

మూస పద్దతిలో సినిమాలు కాకుండా డిఫరెంట్ జానర్స్ ప్రయత్నించిన ప్రభాస్ కు ఆ సినిమాల ఫలితాలు మాత్రం తేడా కొట్టాయి. ప్రభుదేవా దర్శకత్వంలో పౌర్ణమి, వినాయక దర్శకత్వంలో యోగి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మున్నా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు మంచి విజయాన్ని సాధించలేకపోయాయి. 

మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన బిల్లా సినిమాతో ప్రభాస్ 'స్టయిలిష్' లుక్స్ తో బాటు నటనతో అదరగొట్టాడు. ఈ సినిమా తరువాత లవ్ చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ 'డార్లింగ్' సినిమా చేశాడు. ఈ సినిమాతో అందరి 'డార్లింగ్' గా మారిన ప్రభాస్ లేడీస్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు.

ఆ తరువాత వచ్చిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయ్యాడు. రెబల్ సినిమాతో మాస్ ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'మిర్చి' సినిమాతో మాస్, క్లాస్ అభిమానులకు మెచ్చే అందరి స్టార్ అయ్యాడు.

ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో వచ్చిన 'యాక్షన్ జాక్సన్' సినిమాలో అతిధి పాత్రలో ప్రభాస్ తళుక్కుమన్నాడు. కెరీర్ పీక్ దశలో ఉన్న సమయంలో దాదాపు ఐదు సంవత్సరాలు ఒక సినిమా కోసం కేటాయించిన ఏకైక హీరో ప్రభాస్ కావడం విశేషం. 

'బాహుబలి' సినిమాలో శివుడు, మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి పాత్రలో నటించి మన అందరిని అలరించడమే గాక నేషనల్ స్టార్ గా ఎదిగాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1700 కోట్లు వసూల్ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజీ ఆ సేతు హిమాచలానికి పాకింది.

పాన్ ఇండియా స్టార్ హోదా దక్కించుకున్న ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఎందరో బాలీవుడ్ నిర్మాతలు ముందుకు వచ్చారు. కానీ బాహుబలి సినిమా సమయంలోనే ఇచ్చిన మాట కోసం సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటించాడు.

దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది ప్రభాస్ ఒక్కరికే సాధ్యం. సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా ప్రభాస్ కున్న క్రేజీతో ఈ సినిమా అన్నీ ఏరియాలలో లాభాలను తెచ్చింది. 

పాన్ ఇండియా స్టార్ హోదా దక్కినా ఆ గర్వాన్ని తలకెక్కించుకోకుండా డౌన్ టూ ఎర్త్ గా ఉంటూ ప్రభాస్ 'రియల్ డార్లింగ్' గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ 'జిల్' సినిమా ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' సినిమాలో నటిస్తున్నాడు. ఊహించనంత ప్రేమ అందించే పాత్రలో 1960 బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా వస్తోంది.

ఈ సినిమాతో బాటు దాదాపు 2000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న 'మహాభారతం' సినిమాలో కూడా ప్రభాస్ నటించనున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా ఏ హీరోకు జరగనంత బిజినెస్ జరగడమే గాక అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ మన తెలుగు వాడు, మన తెలుగు హీరో కావడం విశేషం. ఆయన వరుసగా సినిమాలు చేస్తూ వరల్డ్ వైడ్ సినీ అభిమానులను అలరించాలని కోరుకుందాం...!

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్

   16 hours ago


జెనీలియా రీ ఎంట్రీ.. ఏ సినిమాతోనో తెలుసా?

జెనీలియా రీ ఎంట్రీ.. ఏ సినిమాతోనో తెలుసా?

   21 hours ago


ఏపీలో సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్.. జగన్‌కు చిరంజీవి థ్యాంక్స్

ఏపీలో సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్.. జగన్‌కు చిరంజీవి థ్యాంక్స్

   21 hours ago


బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

   24-05-2020


సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా  థియేటర్లు ఓపెన్

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా థియేటర్లు ఓపెన్

   22-05-2020


ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ...  బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ... బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

   22-05-2020


చిరు ఇంట్లో తలసాని భేటీ..  సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

చిరు ఇంట్లో తలసాని భేటీ.. సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

   21-05-2020


రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

   21-05-2020


తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

   21-05-2020


గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

   20-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle