newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

"సరిలేరు నీకెవ్వరు" సినిమా రివ్యూ

11-01-202011-01-2020 18:14:14 IST
2020-01-11T12:44:14.739Z11-01-2020 2020-01-11T12:43:13.202Z - - 20-01-2020

"సరిలేరు నీకెవ్వరు" సినిమా రివ్యూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ అంటూ సంక్రాంతికి సందడి చేసేందుకు వచ్చాడు. లాస్ట్ సీజన్ లో ఎఫ్ 2 సినిమాతో హిలేరియస్ ఫన్ అందించిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మరి అంచనాలని అందుకుందా లేదా తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే.. 

కథ 

మేజర్ అజయ్ కృష్ణ (మహేష్ బాబు) మిలట్రీ ఆఫీసర్. మేజర్ ఆజయ్ కృష్ణ చేసిన ఒక ఆపరేషన్ వల్ల తన పై ఆఫీసర్ ఆర్డర్ తో అతను కర్నూల్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కర్నూల్ లో ఏపనిచేసినా పర్ఫెక్ట్ గా చేసే ప్రొఫెసర్ భారతి ఇంటికి వస్తాడు మేజర్ అజయ్. అక్కడ ఆమె పడే ఇబ్బందులు ఏంటో తెలుసుకుని లోకప్ పొలిటికల్ లీడర్ అయిన ప్రకాష్ రాజ్ ని ఎదిరిస్తాడు..! ఈ క్రమంలో ఏం జరిగింది..? అసలు పొలిటీషిన్ కి ప్రొఫెసర్ కి మధ్యన ఏం జరిగింది అనేది తెలియాలి అంటే మనం సినిమా చూడాల్సిందే…!

 ప్లస్ పాయింట్స్

 మహేష్ బాబు ఎనర్జీ యాక్టింగ్ , హిలేరియస్ కామెడీ టైమింగ్ గురించి ముందుగా చెప్పుకోవాలి. తనదైన స్టైల్లో సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షోగా ముందుకు నడిపించాడు. ఇక ప్రకాష్ రాజ్ చాలాకాలం తర్వాత తన మార్క్ విలనిజాన్ని చూపించాడు. విజయశాంతిని ఈ క్యారెక్టర్ లో తీసుకున్నందుకు పూర్తి న్యాయం చేసింది. రీఎంట్రీకి తగిన సినిమాని ఎంచుకుంది అని చెప్పొచ్చు. మహేష్ బాబు మిలట్రీ సీన్స్, ట్రైన్ లో కామెడీ, ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్ట్ హాఫ్ బాగా వర్కౌట్ అయ్యింది. సినిమాని నిలబెట్టింది..! సెకండ్ హాఫ్ లో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. రావ్ రమేష్ అయితే హిలేరియస్ ఫన్ చేసారనే చెప్పాలి. జబర్ధస్త్ అప్పారావ్ కామెడీ సూపర్ గా ఉంది. దేవి నేపధ్య సంగీతంతో బాటు రత్నవేలు ఫోటో గ్రాఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. నిర్మాతలు ఎక్కడ కూడా రాజీ పడకపోవడంతో సినిమా చాలా గ్రాండియర్ గా కనబడుతోంది. 

 మైనస్  పాయింట్స్

 కథలో కీలకమైన సన్నివేశాలని తేల్చేసినట్లుగా ఉంటుంది. ముఖ్యంగా విలన్ కి, మహేష్ కి జరిగే సీన్ కూడా కామెడీగానే డీల్ చేశారు. సెకండ్ హాఫ్ మరింత బలంగా ఉండి ఉంటే బాగుండేది. కథలో మైయిన్ పాయింట్ పై మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేది. ఇక రష్మిక, సంగీత అండ్ గ్యాంగ్ చేసే కామెడీ ఓవర్ అనిపిస్తోంది. పాటలు తేలిపోయాయి. విజయశాంతి మేకప్ కొద్దీగా ఇబ్బంది పెట్టింది. 

 ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే..,  చాలా కాలం తరువాత మహేష్ బాబు నుండి వచ్చిన ఈ మాస్ సినిమా ఫ్యాన్స్ కి  పండగనే చెప్పొచ్చు.

 నటీనటులు: మహేష్ బాబు, రష్మిక, విజయశాంతి, ప్రకాష్ రాజ్ తదితరులు    

దర్శకత్వం: అనిల్ రావిపూడి                 

సంగీతం: దేవిశ్రీప్రసాద్                           

కెమెరా: రత్నవేలు                                                              

నిర్మాత: అనిల్ సుంకర                                              

విడుదల తేదీ: 11/01/2019  

రన్ టైమ్: 168 నిమిషాలు 

రేటింగ్: 3/5  


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle