newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

సంక్రాంతి విజేత ఎవరు?

11-01-202011-01-2020 08:48:07 IST
2020-01-11T03:18:07.396Z11-01-2020 2020-01-11T03:15:08.951Z - - 13-08-2020

సంక్రాంతి విజేత ఎవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంక్రాంతి పండగ తెలుగు సినీ లవర్స్ కి ముందే వచ్చేసింది. శనివారం సరిలేరునీకెవ్వరు అంటూ మహేష్ బాబు వస్తుంటే, ఆదివారం అలరించేందుకు అల వైకుంఠపురములో అల్లు అర్జున్ సిద్ధమైపోయాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఎంత కలక్షన్స్ ని సాధిస్తాయి.. వీటిలో ఏది హిట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా ఫ్యాన్స్ మద్యలో ఈ డిస్కషన్స్ ఎక్కువైపోయాయి. మా హీరో సినిమా హిట్ అవుతుంది అంటే మా హీరో సినిమా హిట్ అవుతుంది అంటూ ఛాలెంజ్ లు చేస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ షోస్ కి పర్మిషన్స్ కూడా ఇవ్వడంతో ఉదయం 7గంటల నుంచే సిటీలో షోలు స్టార్ట్ అవుతున్నాయి.

ఆంధ్రాలో అయితే అర్ధరాత్రి నుంచే షోలు వేసేస్తున్నారు. ఫ్యాన్స్ బెనిఫిట్ షోలకి వేలకి వేలు ఖర్చుపెట్టి మరీ థియేటర్స్ ముందు కటౌట్స్ పెడుతున్నారు.. వాటిని అలంకరిస్తున్నారు. ఈనేపథ్యంలో అసలు ఎవరు ఎంత కలక్ట్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.

సినిమా హిట్ టాక్ వస్తే రెండు సినిమాలు ఖచ్చితంగా సంక్రాంతి పండగకి 100కోట్ల కలక్షన్స్ ని క్రాస్ చేసేస్తాయి.. 200కోట్లు కూడా కలక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబుకి ఓవర్సీస్ మార్కెట్ లో అద్భుతమైన కలక్షన్స్ వస్తాయి నో డౌట్. అలాగే, బన్నీకి కేరళలో స్ట్రయిట్ మార్కెట్ వర్కౌట్ అవుతుంది.

సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా 200కోట్లు ఈజీగా క్రాస్ చేసేస్తాడు. అజ్ఞాతవాసిలాగా అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినా సినిమా 100కోట్లు ఈజీగానే కలక్ట్ చేసేలా కనిపిస్తోంది.  ఇక ఫస్ట్ డే ఆట మొదలైన రోజు నుంచే కలక్షన్స్ వేట పక్కా అనే అర్ధమవుతోంది.

సరిలేరునీకెవ్వరు సినిమా వరల్డ్ వైడ్ గా 99 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా అల..వైకుంఠపురములో సినిమాకు 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అభిమానుల అంచనాలు ఎలా ఉన్నా సినీ పెద్దలు, ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ రెండు సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలవాలని మనం కోరుకుందాం..!a


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle