newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సంక్రాంతి ముందే తెచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’

13-01-202013-01-2020 10:02:37 IST
Updated On 13-01-2020 12:11:24 ISTUpdated On 13-01-20202020-01-13T04:32:37.094Z13-01-2020 2020-01-13T04:32:29.248Z - 2020-01-13T06:41:24.841Z - 13-01-2020

సంక్రాంతి ముందే తెచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ఈ సారి ముందే వచ్చింది. ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు. అల్లు అర్జున్ సినిమాలు ఒకరోజు వ్యవధిలో విడుదలయ్యాయి. సంక్రాంతి పండుగకు బంధు మిత్ర, సపరివార సమేతంగా సినిమాలు చూసే అవకాశం కల్గింది. ఈమూవీ  జ‌న‌వ‌రి 11న సినిమా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అనే టాక్‌తో తొలి రోజున వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 46.77 కోట్లరూపాయ‌ల షేర్‌ను సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ క‌లెక్షన్స్‌ను సాధిస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Image

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "సరిలేరు నీకెవ్వరు". మహేష్ తొలిసారి ఆర్మీ మేజర్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించింది. ఈ సినిమాకు 99 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సినిమాకు తొలిరోజే భారీ కలెక్షన్లు వసూలయ్యాయి. నైజాం: 8.66 కోట్లు, సీడెడ్: 3.70 కోట్లు, వైజాగ్: 4.10 కోట్లు, గుంటూరు: 5.15 కోట్లు, ఈస్ట్: 3.35 కోట్లు, వెస్ట్: 2.72 కోట్లు, కృష్ణ: 3. 07 కోట్లు, నెల్లూరు: 1.27 కోట్లు, ఏపీ & టీఎస్: 32.77 కోట్లు వసూలయినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా చూస్తే నాలుగో సినిమాగా నిలిచింది.

బాహుబలి 2, బాహుబలి 1, ఖైదీ నెంబర్ 150 సినిమా తరువాత అత్యధిక కలెక్షన్స్ మొదటి రోజు ఈ సినిమా నిలిచింది. విదేశాల్లో సైతం ఈ సినిమా కలెక్షన్లు దుమ్ముదులుపుతోంది. మొత్తంగా చూసుకుంటే సంక్రాంతికి  ‘సరిలేరు నీకెవ్వరు’ రికార్డు స్థాయిలో వసూళ్ళు రాబడుతోంది.  ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్‌ సాధించినట్టు చిత్రబృందం ప్రకటించింది.

ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్‌గా, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటించగా..  పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. దిల్‌ రాజు సమర్పణలో మహేశ్‌, అనిల్‌ సుంకరలు ఈ మూవీ నిర్మించారు. విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత, కౌముది తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. దీనికి తోడు సంక్రాంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. సరిలేరు నీకెవ్వరు థ్యాంక్స్ మీట్‌ ఏర్పాటు చేసారు. ఆదివారం ఏర్పాటు చేసిన సరిలేరు నీకెవ్వరు థ్యాంక్స్ మీట్‌ లో యూనిట్ అంతా పాల్గొంది. “తెలుగు సినిమా ఆడియ‌న్స్ కీ, నాన్న‌గారి అభిమానుల‌కీ, నా అభిమానుల‌కీ సిన్సియ‌ర్ గా ధ‌న్య‌వాదాలు. జ‌న‌వ‌రి 11నే సంక్రాంతిని మాకు ఇచ్చారు. ఇవాళ పొద్దున్నే నేను, దిల్‌రాజుగారు, అనిల్ సుంక‌ర క‌లిసి షేర్స్ మాట్లాడుకుంటూ మిరాకిల్స్ ఫీల‌య్యాం. నిజంగా మైండ్ బ్లాక్ అయింది. హ్యాట్సాఫ్ టు తెలుగు సినిమా. టెక్నీషియ‌న్స్ అంద‌రికీ థాంక్స్’’ అన్నారు మహేష్ బాబు.

విజయశాంతి తన ఆనందాన్నిపంచుకున్నారు. “13 ఏళ్ల త‌ర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను. `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌డం చాలా సంతోషాన్నిచ్చింది. అస‌లు సినిమాలే చేయాల‌ని భీష్మించుకు కూర్చున్న నన్ను డైరెక్ట‌ర్ అనిల్ గారు క‌లిసి మంచి పాత్ర మీరు త‌ప్ప‌కుండా చేయాల‌న్నారు. నేను కొంత స‌మ‌యం తీసుకుని ఆలోచించాను. క‌థ విన్నాను. న‌చ్చ‌డంతో ఈ సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను.సినిమా నాకు మంచి అనుభూతినిచ్చిందన్నారు. 

 

హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... 20న ఫస్ట్ లుక్

హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... 20న ఫస్ట్ లుక్

   15 hours ago


పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా

పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా

   21 hours ago


అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!

అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!

   a day ago


అదరగొడుతున్న సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్.. సుస్మిత రెస్పాన్స్

అదరగొడుతున్న సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్.. సుస్మిత రెస్పాన్స్

   07-07-2020


కొత్త భామతో హద్దులు దాటిన వర్మ ముద్దులు

కొత్త భామతో హద్దులు దాటిన వర్మ ముద్దులు

   07-07-2020


రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ డెసిషన్

రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ డెసిషన్

   07-07-2020


 బుల్లితెరపై బ్రహ్మీ.. సినిమాలకు దూరంపై క్లారిటీ

బుల్లితెరపై బ్రహ్మీ.. సినిమాలకు దూరంపై క్లారిటీ

   06-07-2020


బయోపిక్‌కి బ్రేక్...వర్మకు షాకిచ్చిన జూనియర్ పీకె

బయోపిక్‌కి బ్రేక్...వర్మకు షాకిచ్చిన జూనియర్ పీకె

   06-07-2020


మర్డర్ మూవీ...  ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

మర్డర్ మూవీ... ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

   05-07-2020


ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

   04-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle