newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

సంక్రాంతి బరిలో మహేష్.. మేజర్ అజయ్ కృష్ణ లుక్ సూపర్

11-07-201911-07-2019 09:34:22 IST
Updated On 12-07-2019 12:29:33 ISTUpdated On 12-07-20192019-07-11T04:04:22.487Z11-07-2019 2019-07-11T04:04:07.347Z - 2019-07-12T06:59:33.763Z - 12-07-2019

సంక్రాంతి బరిలో మహేష్.. మేజర్ అజయ్ కృష్ణ లుక్ సూపర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహర్షి మూవీ తర్వాత మహేష్ బాబు మంచి దూకుడు మీద ఉన్నాడు. వెంటవెంటనే మూవీస్ చేస్తున్నాడు. తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్, GMB ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా ‘సరిలేరునీకెవ్వరు’ మూవీ రూపొందుతోంది. 

యాక్షన్ కామెడీ కలగలిసిన ఈ ‘సరిలేరునీకెవ్వరు’ మూవీ 2020 సంక్రాంతికి విడుదలకు సిద్ధం అవుతోంది ఈ మూవీ షూటింగ్ కాశ్మీర్లో జరుగుతోంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా మారారు.

ఈమేరకు మూవీ అప్ డేట్స్ గురించి అనిల్ రావిపూడి ట్వీట్ కూడా చేశారు. మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటించే కొన్ని సీన్స్ ను దర్శకుడు కాశ్మీర్ లో తెరకెక్కిస్తారు. , కాశ్మీర్ లో ఆపరేషన్ స్టార్ట్ అయిందని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

బ్లాక్ బస్టర్ మూవీస్ ఒక్కడులో అజయ్ వర్మ, దూకుడు లో అజయ్ కుమార్ గా నటించిన మహేష్ బాబు సరిలేరునీకెవ్వరు మూవీ లో అజయ్ కృష్ణ గా నటించి ఎంతటి సంచలనం సృష్టిస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle