newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

సంక్రాంతికి ఆ మూడు చిత్రాలు ఓవర్సీస్ దుమ్ముదులిపాయా?

20-01-202020-01-2020 19:00:53 IST
Updated On 20-01-2020 19:00:51 ISTUpdated On 20-01-20202020-01-20T13:30:53.441Z20-01-2020 2020-01-20T13:29:28.361Z - 2020-01-20T13:30:51.984Z - 20-01-2020

సంక్రాంతికి ఆ మూడు చిత్రాలు ఓవర్సీస్ దుమ్ముదులిపాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోడిపందాలు.. సంక్రాంతి సరదాలు, సినిమాలు.. ఈ మూడింటికి అవినాభావ సంబంధం ఉంది. సీనియర్ హీరోలతో పాటు యూత్  హీరోలు కూడా సంక్రాంతికి తమ సినిమాలు వుండేలా చూసుకుంటారు. తాజాగా 2020 సంక్రాంతికి విడుదలయిన చిత్రాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. కానీ ఓవర్సీస్ లో  వీటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. రజనీకాంత్ నటించిన 'దర్బార్', మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల..వైకుంఠపురములో' సినిమాల కలెక్షన్స్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. 

స్టార్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం 'దర్బార్'. ఈ మూవీ జనవరి 9న విడుదలయింది. 19 జనవరి వరకు ఈ సినిమా యూఎస్ లో 1.6 మిలియన్ డాలర్స్(11.36 కోట్లు) వసూల్ చేసింది. ఆస్ట్రేలియాలో $489,066 డాలర్స్ (2.39 కోట్లు) వసూల్ చేయగా యూకేలో 316,848 యూరోలు ( 2.93 కోట్లు) వసూల్ చేసింది. న్యూజిలాండ్ లో $61,687 డాలర్స్ (29.01 లక్షలు) వసూల్ చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 19 (ఆదివారం) వరకు ఓవర్సీస్ లో యూఎస్ లో 2 మిలియన్ డాలర్స్ (14.21 కోట్లు), ఆస్ట్రేలియాలో 349,258 డాలర్స్ (1.71 కోట్లు), యూకేలో 96,218 యూరోలు( 88.82 లక్షలు), న్యూజిలాండ్ $35,556 డాలర్స్ (16.73 లక్షలు) వసూల్ చేసింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం 'అల..వైకుంఠపురములో'. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 19 (ఆదివారం) వరకు ఓవర్సీస్ లో యూఎస్ లో 2.7 మిలియన్స్ (19.18 కోట్లు), ఆస్ట్రేలియాలో 455,600 డాలర్స్ (2.23 కోట్లు), యూకేలో 110,160 యూరోలు(1.02 కోట్లు), న్యూజిలాండ్ $16,568 డాలర్స్ (7.79 లక్షలు) వసూల్ చేసింది.

మొత్తం మీద ఇండియాలో ఈ మూవీలు మంచి ఆదరణ చూరగొన్నాయి. సంక్రాంతి చివరలో విడుదలైన కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచి వాడవురా' సినిమాకు ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ దక్కలేదు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle