newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

శంకర్ రూటే సపరేట్..'ఇండియన్-2' కు భారీ బడ్జెట్

08-11-201908-11-2019 15:23:39 IST
2019-11-08T09:53:39.671Z08-11-2019 2019-11-08T08:14:53.900Z - - 19-11-2019

శంకర్ రూటే సపరేట్..'ఇండియన్-2' కు భారీ బడ్జెట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు శంకర్. ఆయన చిత్రాలన్నీ హై బడ్జెట్ తో తెరకెక్కినా పెట్టిన ప్రతి పైసాను వసూల్ చేసే దమ్ము ఆ సినిమాలలో ఉంది. 'జెంటిల్ మాన్; 'ప్రేమికుడు', 'ఇండియన్', 'జీన్స్', 'ఒకే ఒక్కడు', 'బాయ్స్', 'అపరిచితుడు', 'శివాజీ', 'స్నేహితుడు', 'ఐ', రోబో సినిమాలన్నీ సూపర్ హిట్ కావడమే గాక మంచి వసూళ్లను సాధించాయి.

కానీ 2.0 విషయంలో మాత్రం తేడా కొట్టేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకువచ్చింది. నష్టాలతో బాటుగా దర్శకుడు శంకర్ విమర్శలు ఎదురుకోవలసి వచ్చింది. అవసరం లేకపోయినా శంకర్ నిర్మాతల చేత ఖర్చు పెట్టించారని వార్తలు బలంగా వినబడ్డాయి.

ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్-2'. ఇండియన్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న సినిమాకి నిర్మాతలు తక్కువ బడ్జెట్ కేటాయించారని గత కొద్దీ రోజులుగా కోలీవుడ్ వర్గాలలో ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలకు చెక్ పెడుతూ అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి మనకు సమాచారం అందింది. భారతీయుడు  2సినిమాని కూడా హెవీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. 

1996లో సూపర్ సక్సెస్ సాధించిన భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్నఈ చిత్రాన్ని ఇప్పుడు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించబోతున్నారట. బడ్జెట్ విషయంలో ప్రొడ్యూసర్స్ తో కాస్త తేడాలు వస్తున్నా కూడా ఇప్పుడు ఒక్క పైట్ కోసం 40కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉందట మూవీ టీమ్.

ఇప్పటికే రెండు షెడ్యూల్‌లను పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాత షెడ్యూల్ కోసం భోపాల్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసారట. అందులో ఒక్క ఫైట్ కోసం రూ.40కోట్లను ఖర్చు చేస్తున్నారట శంకర్. కమల్‌తో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు , 500మంది ఫైటర్స్ ఇందులో పాల్గొనబోతున్నారు. అయితే, దీనికి నిర్మాతలు ఎంత నచ్చజెప్తున్నా కూడా శంకర్ మాత్రం ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదని చెప్తున్నాడు.

ఇక మరి ఈ ఫైట్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చూడాలి. అంతేకాదు, తాజాగా కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాలో శంకర్ ఎక్కువ మంది స్టార్ క్యాస్టింగ్ ను తీసుకున్నాడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్ధ్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా బడ్జెట్ మరింత పెరిగిందని సమాచారం. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని 2020 సమ్మర్ లో విడుదల చేయనున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle