newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ''వెంకి మామ''...

03-12-201903-12-2019 08:34:36 IST
2019-12-03T03:04:36.796Z03-12-2019 2019-12-03T02:52:05.517Z - - 06-12-2019

వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ''వెంకి మామ''...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్యలు రీల్ లైఫ్ లోనూ అదే పాత్రలలో నటిస్తున్న చిత్రం 'వెంకి మామ'. ఆర్మీ మేజర్ గా నాగ చైతన్య నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ రైస్ మిల్స్ ఓనర్ గా కనబడనున్నాడు. రవితేజతో 'పవర్', పవన్ కళ్యాణ్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్', ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' సినిమాలు తీసిన కెఎస్ రవీంద్ర (బాబీ) ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులయింది.

అక్టోబర్ 2న ఈ సినిమాని విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. కానీ అదే రోజున సైరా వస్తుండటంతో ఈ సినిమా వాయిదా పడింది. అక్కడి నుండి చిత్ర యూనిట్ సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తోంది. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు ఈ సినిమాని డిసెంబర్ 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. డిసెంబర్ 13 వెంకటేష్ పుట్టిన రోజు. ఆ రోజున 'వెంకి మామ' వస్తుండటంతో వెంకీ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన సినిమా పోస్ట‌ర్స్‌, లిరిక‌ల్ వీడియోల‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.

విడుదలకు కేవలం 10 రోజులే సమయం ఉండటంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచనుంది. మిగిలిన పాటలను విడుదల చేయడంతో పాటు ట్రైలర్ ను రిలీజ్ చేయవలసి ఉంది.

వీటితో బాటు ప్రీ రిలీజ్ వేడుకను కూడా చేయవలసి ఉంది. ఈ కొద్దీ సమయంలో చిత్ర యూనిట్ ఎలా ప్లాన్ చేస్తోందో చూడాలి? ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ డిసెంబర్ 20న తెలుగులో మూడు సినిమాలు విడుదల కానున్నాయి.

బాలకృష్ణ 'రూలర్', సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే', కార్తీ 'దొంగ' సినిమాలు విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాలతో బాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్-ప్రభుదేవా కాంబినేషన్ లో తెరకెక్కిన 'దబాంగ్-3' కూడా డిసెంబర్ 20న విడుదల కానుంది. 'దబాంగ్-3' తెలుగు హక్కులను సొంతం చేసుకున్న సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేయనున్నాడు.

ఈ నేపథ్యంలోనే 'వెంకి మామ' సినిమాను డిసెంబర్ 13న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. థియేటర్స్ సమస్య లేకుండా ప్లాన్ చేశారని ఫిలిం వర్గాల సమాచారం. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకాల‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle