newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

వెంకీ మామ సినిమా స్టోరీ ఇదేనా..?

09-12-201909-12-2019 15:52:31 IST
Updated On 11-12-2019 10:55:24 ISTUpdated On 11-12-20192019-12-09T10:22:31.473Z09-12-2019 2019-12-09T10:22:29.241Z - 2019-12-11T05:25:24.166Z - 11-12-2019

వెంకీ మామ సినిమా స్టోరీ ఇదేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాబీ డైరెక్షన్ లో వస్తున్న మామా అల్లుళ్ల సినిమా వెంకీమామ. మామగా వెంకటేష్, అల్లుడుగా నాగ చైతన్యలు నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు.ఈ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ ట్రెండింగ్ వన్ గా నిలిచింది. ఈ సినిమా పాయింట్ కొత్తగా ఉందని, ఖచ్చితంగా మామా అల్లుళ్ల మద్యన సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయని కాన్ఫిడెంట్ గా చెప్తోంది చిత్రయూనిట్. నిజానికి సంక్రాంతి రేస్ లో వెంకీమామ ఉన్నాడు. కానీ సంక్రాంతి కంటే ముందే మార్కెట్ ని షేక్ చేయబోతున్నాడు.

ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని, ఆంధ్రాలో, నైజాంలో సినిమాకి ఫ్యాన్సీ రేట్ దక్కిందని చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మార్కెట్ మాట ఎలా ఉన్నా కంటెంట్ లో దమ్ముంది కాబట్టి ఈ సీజన్ లో ఫస్ట్ హిట్ కొట్టేది వెంకీమామే నో డౌట్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. గత కొద్దీ రోజులుగా ఈ సినిమాకు 'ఎఫ్2' సీన్ రిపీట్ అవుతుందని ఫిలిం వర్గాలలో ప్రచారం జరుగుతోంది.  సంక్రాంతికి వచ్చిన 'ఎఫ్2' సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించినా క్రెడిట్ మొత్తం వెంకీకి వచ్చింది.

అలాగే ఈ సినిమాకు కూడా వెంకటేష్ మొత్తం క్రెడిట్ దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అందుకే వెంకటేష్ కూడా తన పాత్ర కంటే అల్లుడు నాగ చైతన్య పాత్రను పెంచమని దర్శకుడు బాబీకి చెప్పాడని ప్రచారం జరుగుతోంది. 

ట్రైలర్ విడుదలతో ఈ సినిమా కథపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ కథనాల ప్రకారం " మామ అల్లుళ్లు వెంకటేష్-నాగ చైతన్యలు ఆడిందే ఆట పాడిందే పాట అనే చందాన ఉంటారు. తన అల్లుడి కోసం మామ వివాహం కూడా చేసుకోడు. అనుకోకుండా అల్లుడు ప్రేమలో పడతాడు. కానీ వారి ప్రేమ విజయవంతం కావాలంటే మామ అల్లుళ్లు దూరమవ్వాలనే కండిషన్ ను అమ్మాయి తండ్రి పెడతాడు. ఈ కండిషన్ కు మామ ఓకే చెప్పినా అల్లుడు నో చెప్తాడు.

ఆ తరువాత తన మామ కోసం అత్తను వెదికే పనిలో అల్లుడు బిజీ అవుతాడు. ఆ ప్రయత్నంలో అల్లుడు విజయవంతమవుతాడు. ఈ సమయంలో అల్లుడు తన చిన్ననాటి నుండి ఉన్న కోరిక కోసం మిలట్రీ లో జాయిన్ అవుతాడు. మూడు సంవత్సరాలు అయినా తిరిగి రాడు. తన అల్లుడి కోసం మామే బోర్డర్ కి వెళ్తాడు. అక్కడ శత్రువుల చేతిలో చిక్కుకున్న అల్లుడిని విజయవంతంగా తీసుకురావడమే గాక శతృవులనే చంపడమే" ఈ సినిమా కథ అంటూ ప్రచారం జరుగుతోంది.

మామ-అల్లుళ్ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు సూపర్ గా ఈ సినిమాలో ఉన్నాయని సమాచారం. థమన్ తన సంగీతం, నేపధ్య సంగీతంతో సినిమాని మరో లెవెల్ కు తీసుకువెళ్లాడని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. దాదాపు అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle