newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

'వెంకి మామ' ట్రైలర్.. ఏదో తేడా కొడుతోంది మామ

08-12-201908-12-2019 09:13:22 IST
2019-12-08T03:43:22.257Z08-12-2019 2019-12-08T03:40:32.663Z - - 24-01-2020

'వెంకి మామ' ట్రైలర్.. ఏదో తేడా కొడుతోంది మామ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రియల్ లైఫ్ మామ అల్లుళ్లు 'వెంకటేష్-నాగ చైతన్య' లు కలిసి ఫుల్ లెంగ్త్ మూవీ 'వెంకి మామ'. గతంలో నాగ చైతన్య 'ప్రేమమ్' సినిమాలో వెంకటేష్ అతిధి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. పాయల్ రాజపుత్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి కేఎస్ రవీంద్ర దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు. విలేజ్ నేపథ్యంలో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ లో మామపై అల్లుడి ప్రేమ.. అల్లుడిపై మామ ప్రేమని చక్కగా చూపించారు. ఆ తరువాత బార్డర్ సన్నివేశాలు చూపించారు. బార్డర్ కి వెళ్లిన అల్లుడు మూడు సంవత్సరాలు అయినా ఎందుకు తిరిగి రాలేదు? మిస్ అయిన అల్లుడు కోసం మామ  బార్డర్ కు ఎందుకు వెళ్ళాడు? అనే విజువల్స్ తో మామా అల్లుళ్ల మధ్య అనుబంధం సూపర్ గా ఉంది.

వెంకటేష్ చెప్పే వాయిస్ ఓవర్  "మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం" అంటూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. రాశీ ఖన్నాతో చైతన్య లవ్ స్టోరి.. పాయల్ తో వెంకటేష్ సన్నివేశాలను ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు. 

హైపర్ ఆది..వెంకటేష్ తో 'ఎలాగైనా వీడికి ఓ అత్తను ఇవ్వండి' అని చెప్పడం దానికి వెంకటేష్ రియాక్ట్ అయ్యే విధానం చాలా ఫన్నీగా ఉంది. ఆ తరువాత గ్రామంలో కక్షలు-పగలు చూపారు.

వారిని ఎలాగైనా చంపాలని అశుతోష్ రాణా, దాసరి అరుణ్ కుమార్ చెప్పడం ఆసక్తిని పెంచింది. నాజర్ 'వారిని ఎలాగైనా విడదీయాలి" అని చెప్పే డైలాగ్ తో అసలు మామ-అల్లుళ్లపై ఎందుకు కుట్ర చేస్తున్నారనే ఇంట్రస్ట్ కలిగేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఇన్నీ పాయింట్స్ కలవడంతో ఈ ట్రైలర్ చూస్తే ఏ పాయింట్ కూడా ఓ పట్టాన అర్ధం కాదు.

ట్రైలర్ కు డివైడ్ టాక్ వచ్చింది. నాగ చైతన్యను కిడ్నాప్ చేసి వేరే చోట దాచి ఉండటం లాంటి సన్నివేశాలతో బాబీ తీసిన ఈ సినిమా రిస్క్ ప్రాజెక్ట్ అని చెప్పక తప్పదు. థమన్ సంగీతంతో ఈ సినిమా సన్నివేశాలను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ట్రైలర్ అన్నీ జోనర్స్ ని కలిపి ఉన్నా సినిమాపై చిత్ర యూనిట్ మంచి నమ్మకంతో ఉంది.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకాల‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను శనివారం జరిపారు. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని డిసెంబర్ 13న విడుదల కానుంది. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle