newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

వినాయక్ డైరెక్టరే కాదు, ఇక హీరో కూడా!

15-05-201915-05-2019 08:05:03 IST
Updated On 15-05-2019 08:04:11 ISTUpdated On 15-05-20192019-05-15T02:35:03.702Z15-05-2019 2019-05-15T02:33:41.748Z - 2019-05-15T02:34:11.444Z - 15-05-2019

వినాయక్ డైరెక్టరే కాదు, ఇక హీరో కూడా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు వివి వినాయక్ ఈమధ్య చెప్పుకోదగిన విజయాలేవీ అందుకోలేకపోయారు.  ఆయన గత చిత్రం 'ఇంటలిజెంట్' సైతం విఫలమైంది.  ఈమధ్య పలువురి హీరోల కోసం ఆయన కథలు రాస్తున్నారని వార్తలు వెలువడినా వాటిలో  ఏమాత్రం వాస్తవం లేదని తేలిపోయింది.  

ఇప్పటి వరకు తెర వెనక యాక్షన్ చెప్పిన ఆయన త్వరలో మరొకరు యాక్షన్ చెప్తే, యాక్ట్ చెయ్యనున్నాడు. సాధారణంగా సీన్ షూట్ చేసేటప్పుడు హీరోలకు తను నటించి చూపిస్తుంటాడు వినాయక్.. చిరంజీవి ఠాగూర్, ఖైదీ నెం:150 సినిమాల్లో కాసేపు తెరపై తళుక్కుమన్నాడు.

ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా అరంగేట్రం చెయ్యబోతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వినయ్‌ని హీరోగా లాంచ్ చేస్తున్నాడు.  దిల్ రాజు నిర్మాతగా తీసిన మొదటి సినిమా దిల్‌కి డైరెక్టర్ వినాయకే. తనని నిర్మాతగా పరిచయం చేసిన దర్శకుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యనున్నాడు దిల్ రాజు. 

తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం వినాయక్ త్వరలో నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.  'శరభ' ఫేమ్ నరసింహా రావు డైరెక్ట్ చేయనున్న సినిమాలో వినాయక్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారట. గతంలో వినాయక్ రెండు మూడు మూవీస్ లో చిన్నచిన్న పాత్రలు చేశారు.  మరిప్పుడు ఎలాంటి  పాత్రలో కనిపించి మెప్పిస్తారో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle