newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

వినాయక్ చేతిలో లూసిఫర్ ... చిరుతో మరోసారి

31-07-202031-07-2020 12:18:01 IST
Updated On 31-07-2020 15:57:15 ISTUpdated On 31-07-20202020-07-31T06:48:01.512Z31-07-2020 2020-07-31T06:47:55.773Z - 2020-07-31T10:27:15.481Z - 31-07-2020

వినాయక్ చేతిలో లూసిఫర్ ... చిరుతో మరోసారి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘లూసిఫర్’ మూవీ గురించి మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్‌లో కూడా న‌టించేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డైరెక్ట‌ర్ విష‌యంలో ప‌లువురి పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. మొద‌ట సుకుమార్ పేరు వినిపించింది. ఏం జరిగిందో ఏమో మళ్లీ మరో డైరెక్టర్ తెరమీదకు వచ్చాడు. ఆ త‌ర్వాత సుజిత్ పేరు తెచ్చారు.

అయితే డైరెక్టర్ సుజిత్ క‌థ‌తో చిరు సంతృప్తి చెంద‌లేదని, ఈ చిత్రాన్ని అనుభ‌వ‌జ్ఞుడైన డైరెక్ట‌ర్ తో చేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. చిరంజీవి మదిలో మరో స్టార్ డైరెక్టర్ పేరు వచ్చింది. గతంలో ఠాగూర్, ఖైదీ నంబ‌ర్ 150 చిత్రాల‌తో చిరుకు మంచి హిట్స్ అందించిన డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ అయితే బాగుంటుంద‌ని చిరు భావించారు. ఈ వార్తలే నిజమయ్య సంకేతాలు క‌నిపిస్తున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో వినిపిస్తోంది.

చిరంజీవి త్వ‌ర‌లోనే లూసిఫ‌ర్ రీమేక్ బాధ్య‌త‌ల‌ను వివి వినాయ‌క్ కు అప్పగించేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముందో చూడాలి. ఈ చిత్రంలో కీలకమయిన నటీనటులు నటించనున్నారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ హీరోలుగా రూపొందిన లూసిఫర్ మూవీ మలయాళీ భాషలో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమాను రీమేక్ హక్కుల్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ చేజిక్కించుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ మూవీని నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. ఈ ఏడాది చివరల్లో లూసిఫర్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో ఓ ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు కూడా నటిస్తాడనే ప్రచారం వుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle