newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

'వాల్మీకి' వివాదం: ‘గ‌ద్ద‌లకొండ గ‌ణేష్‌’గా టైటిల్ మార్పు

20-09-201920-09-2019 11:36:41 IST
Updated On 20-09-2019 16:15:21 ISTUpdated On 20-09-20192019-09-20T06:06:41.983Z20-09-2019 2019-09-20T06:06:31.886Z - 2019-09-20T10:45:21.754Z - 20-09-2019

'వాల్మీకి' వివాదం: ‘గ‌ద్ద‌లకొండ గ‌ణేష్‌’గా టైటిల్ మార్పు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వాల్మీకి'. 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ  చిత్రంలో పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించింది. తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్ పై గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. 

ఈ సినిమా టైటిల్‌ను మార్చాల‌ని బోయ సంఘం, వాల్మీకి వ‌ర్గం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ పై అభ్యంతరాలు ఉన్నాయంటూ వారు హైకోర్టుకు వెళ్లారు. పిటీషన్ పై చిత్ర యూనిట్ కు హైకోర్టు నోటీసులు జారి చేసింది. కానీ చిత్ర యూనిట్ 'వాల్మీకి' టైటిల్ నే కొనసాగిస్తూ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్పకుండా ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారి చేసింది. దీంతో  ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయ్యింద‌ని అంత అనుకున్నారు. అయితే తిరిగి బోయ‌సంఘంవారు, వాల్మీకి వ‌ర్గంవారు టైటిల్‌లో తుపాకీ ఉంద‌నే అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు.ఈ అభ్యంతరాలతో చిత్ర యూనిట్ 'వాల్మీకి' టైటిల్ లో తుపాకిని తొలగించారు. 

విడుదల నేపథ్యంలో ఈ సినిమా ప్రదర్శనను ఆపేయాలంటూ అనంత‌పురం, క‌ర్నూలు జిల్లా కలెక్టర్లు ఉత్త‌ర్వులు జారి చేశారు. 'బోయ', 'వాల్మీకి' వర్గాలు ఎక్కువ మంది ఈ రెండు జిల్లాలలో ఉండటంతో వారి మనోభావాలు దెబ్బతినకుండా ఈ మేరకు వారు నిర్ణయం తీసుకున్నారు. ఒక వైపు కుల సంఘాల అభ్యంతరం మరో వైపు కోర్టు అభ్యంతరాలతో చిత్ర యూనిట్ కు టైటిల్ మార్చక తప్పలేదు. వాల్మీకి టైటిల్ మారుస్తున్నామని కొత్త టైటిల్ గా "గద్దలకొండ గణేష్" ని పెడుతున్నామని చిత్ర యూనిట్ హైకోర్టుకు తెలిపింది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ "సెన్సార్ బోర్డు అప్రూవ్ చేస్తే.. సినిమా చూడ‌కుండా సినిమాను ఆపే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని సుప్రీమ్‌కోర్టు ఆర్డ‌ర్ ఉంది. అయితే కొంద‌రు వారి సెంటిమెంట్స్‌ను హ‌ర్ట్ చేశామ‌ని అనుకుంటున్నారో వారికి సినిమా చూశాక అర్థ‌మ‌వుతుంది. సెన్సార్ స‌భ్యులు ఎలాంటి అభ్యంత‌రం తెలియ‌జేయ‌లేదు. కానీ కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా టైటిల్ మార్చాల్సి వస్తుంది. మా డిస్ట్రిబ్యూట‌ర్స్, ఎగ్జిబిట‌ర్స్ న‌ష్టపోకూడ‌ద‌ని వెంట‌నే ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నాం" అంటూ ఆయన తెలిపారు.  

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ "వాల్మీకి మహర్షి గొప్పతనం తెలియని వారికి కూడా ఈ సినిమాతో తెలుస్తుందని అనుకున్నాం. కానీ ఏ జిల్లాలో ఈ సినిమాను ఆపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారో దాని వ‌ల్ల అక్క‌డ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ న‌ష్ట‌పోతారు. వారికి ఎలాంటి న‌ష్టం జ‌రగ‌కూడ‌ద‌ని భావించాం. అందుకే టైటిల్ ని మార్చాం" అంటూ తెలిపారు. చివరగా హరీష్ "వాల్మీకి సోద‌రులారా.. బోయ సోద‌రులారా మీరు నా సినిమాను చూడాల‌ని కోరుతున్నాను. సినిమా చూసిన త‌ర్వాత ఏదో మూల నిజ‌మే క‌దా! వాల్మీకి మ‌హర్షిని ఎక్క‌డా త‌ప్పుగా చూపించ‌లేదని మీ అంతరాత్మ‌కు అనిపిస్తే నాకు అదే చాలు. అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరుకుంటున్నాను“ అంటూ విజ్ఞప్తి చేశారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle