newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

వర్మ దెబ్బకు సీక్రెట్స్ లీక్

08-02-201908-02-2019 18:49:50 IST
2019-02-08T13:19:50.289Z08-02-2019 2019-02-08T13:19:18.245Z - - 21-08-2019

వర్మ దెబ్బకు సీక్రెట్స్ లీక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దర్శకుడు బాల అంటే హీరో విక్రమ్‌కి ఎనలేని అభిమానం! ‘శేషు, శివపుత్రుడు’లాంటి బ్రహ్మాండమైన విజయాలు ఇవ్వడంతో... బాల పట్ల తన మనసులో ఒక సుస్థిరస్థానం ఏర్పరుచుకున్నాడు. ఆ ప్రేమతోనే తన తనయుడు ధృవ్ అరంగేట్రానికి దర్శకుడిగా బాలనే ఎంపిక చేశాడు. రీమేక్ సబ్జెక్ట్ అయినప్పటికీ... బాల ట్రాక్ రికార్డ్ దృష్ట్యా అతడైతేనే ధృవ్ ఎంట్రీ అదిరిపోతుందని విక్రమ్ నమ్మాడు.

నిజానికి... విక్రమ్, బాల మధ్య కొంతకాలం నుంచి విభేదాలున్నాయి. అయితే తన కొడుకు ఎంట్రీ విషయంలో విక్రమ్ కాంప్రమైజ్ అయ్యి... బాలకు క్లోజ్ అయ్యాడు. కానీ... టాలీవుడ్‌ కల్ట్ క్లాసిక్‌గా పేరొందిన ‘అర్జున్ రెడ్డి’ని పర్ఫెక్ట్‌గా రీమేక్ చేయడంలో బాల పూర్తిగా విఫలమయ్యాడు. టీజర్ విడుదల అయినప్పుడే ఈ విషయం తెలిసినా... బాలకు ఓ ప్రత్యేకత ఉంది కాబట్టి, తన మార్క్‌కి తగ్గట్టు విభిన్నంగా తీర్చిదిద్దుతాడేమో అనుకున్నారు. విక్రమ్ కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు.

కానీ... బాల వాటిని పెడచెవిన పెట్టి, ఇష్టం వచ్చినట్లు సినిమాను తీసిపడేశాడు. అతడు తీసిన ఫస్ట్ కాపీ చూసి... చిత్రబృందంతో పాటు విక్రమ్ ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి. దీంతో నష్టం వచ్చినా ఫర్వాలేదని, బాలని తొలగించి మరో దర్శకుడితో సినిమా మొత్తం రీ-షూట్ చేద్దామని ఫిక్స్ అయినట్లు తేలింది. బాల లాంటి గొప్ప దర్శకుడు ‘వర్మ’ను ఇంత చెత్తగా తయారు చేయడానికి కారణం... విక్రమ్‌తో ఉన్న విభేదాలేనని ఇప్పుడు కోలీవుడ్ కోడై కూస్తోంది.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle