newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

వర్మా మజాకా.. కెఏ పాల్ చేతుల మీదుగా సెన్సార్ సర్టిఫికెట్?

08-12-201908-12-2019 12:25:54 IST
Updated On 08-12-2019 12:25:40 ISTUpdated On 08-12-20192019-12-08T06:55:54.572Z08-12-2019 2019-12-08T06:54:38.526Z - 2019-12-08T06:55:40.783Z - 08-12-2019

వర్మా మజాకా.. కెఏ పాల్ చేతుల మీదుగా సెన్సార్ సర్టిఫికెట్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏం చేసినా వివాదంతో ప్రారంభమై.. వివాదంతో ముగిసి...సెన్సేషన్ కావడం వర్మకే సాధ్యం. సినిమాల విషయంలోనే కాదు.. కొన్ని స్టేట్ మెంట్ల విషయంలోనూ అదే జరుగుతుంది. తాజాగా ఆయన నిర్మించిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు మూవీ ఎంత వివాదాస్పదం అయిందో అందరికీ తెలుసు. ఈ  మూవీకి తాజాగా సెన్సార్ క్లియరెన్స్ లభించింది. మూవీ టైటిల్ కూడా మారింది.  కమ్మరాజ్యంలో కడపరెడ్లుకు బదులు... అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా మార్చారు. 

Image

రామ్ గోపాల్ వర్మ‌, సిద్ధార్ధ తాతోలు క‌లిసి తెర‌కెక్కించిన చిత్రం ఇది. సినిమా ట్రైలర్ విడుదల కావడంతో నవంబ‌ర్ 29న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావించింది. కానీ కేసుల కారణంగా, సెన్సార్ స‌మ‌స్య‌ల వ‌ల‌న చిత్రం రిలీజ్‌కాలేదు.  ఎట్ట‌కేల‌కి డిసెంబ‌ర్ 12న చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉందని రాంగోపాల్ వర్మే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు.

ఏపీకి చెందిన చంద్రబాబునాయుడు, లోకేష్, కేఏ పాల్, జగన్, పవన్, మోడీ వంటి నేతలను పోలిన వారిని ఈ మూవీలో చూపించారు. అచ్చం చంద్రబాబులా వుండే నటుడు వర్మకు దొరకడం ప్లస్ పాయింట్. ఎక్కడో హోటల్ లో పనిచేసే వ్యక్తి చంద్రబాబులా ఉండడంతో అతన్ని తీసుకొచ్చి శిక్షణ ఇచ్చారు వర్మ.

ఈ సినిమాలో తనను కించపరిచేలా చూపించారని. వ్యంగ్యం ఎక్కువైందని కేఏ పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాని రిలీజ్ చేయోద్ద‌ని కోర్టులో పిటిషన్ వేసిన కేఏ పాల్ నుండి సెన్సార్ స‌ర్టిఫికెట్ అందుకుంటున్న‌ట్టుగా మార్ఫింగ్ ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటో వైరల్ అవుతోంది. అచ్చం నిజమా ఇది అన్నట్టుగా కనికట్టు చేశాడు. రాంగోపాల్ వర్మా మజాకా!

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle