newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

వండర్‌ వుమెన్‌తో అలీ ఫజల్..

19-09-201919-09-2019 18:44:41 IST
Updated On 19-09-2019 18:52:33 ISTUpdated On 19-09-20192019-09-19T13:14:41.258Z19-09-2019 2019-09-19T13:14:38.232Z - 2019-09-19T13:22:33.024Z - 19-09-2019

వండర్‌ వుమెన్‌తో అలీ ఫజల్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పరిచయం అవ్వడమే హాలీవుడ్ మూవీతో అయ్యాడు అలీ ఫజల్. ఆ చిత్రమే ద అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్. అలీ నటుడే కాదు మోడల్ కూడా..ఈ చిత్రం తర్వాత అమెరికన్ టెలివిజన్ లో ప్రసారమైన మినీ సిరీస్ నటించాడు ఈ బాలీవుడ్ యాక్టర్. త్రీ ఇడియట్స్ చిత్రంతో బాలీవుడ్ చిత్రంలో  ముఖ్య మైన పాత్రలో  ప్రేక్షకులని మెప్పించాడు.

ఈ చిత్రం తర్వాత వరుసగా అవకాశాలు అలీని వెతుక్కుంటూ వచ్చాయంటేనే అర్థం అవుతుంది అతని ప్రతిభ. అసలే అందగాడు..దానికి తోడు అసమానమైన నటన ఈ రెండూ ఉంటే చాలు సినిమాల్లో రాణించడానికి. హిందీ..ఇంగ్లీష్ చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా మెప్పించాడీ 34ఏళ్ల హీరో.

ఈ యువ నటుడు విక్టోరియా అండ్‌ అబ్దుల్‌ చిత్రంతో హాలీవుడ్ లో బాగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఈ హీరో హాలీవుడ్‌ను బాగా ఆకర్షించాడు.  అలీ చేసిన మొదటి హాలీవుడ్ చిత్రమే భారీది కావడంతో ఆ సినిమాతో  బాగా గుర్తింపు  తెచ్చుకున్నాడీ నటుడు. ప్రస్తుతం ఈ హీరో  మరో భారీ హాలీవుడ్‌ చిత్రాన్ని దక్కించుకోవడంతో  అలీ గురించి హాట్ టాపిక్ గా మారింది.

వండర్‌ వుమెన్‌గా వసూళ్లలో చరిత్ర సృష్టించిన గాల్‌ గాడోట్‌ కలిసి అలీ ఈ చిత్రంలో నటించబోతున్నాడట. అగాథా క్రిస్టీ నవల డెత్‌ ఆన్‌ ద నైల్‌ ఆధారంగా గాడోట్‌, అలీ సినిమా తెరకెక్కనుంది. ఈ నవలతో  1978వ సంవత్సరంలో  ఒక సినిమా తెరకెక్కగా..ఇప్పుడు మరోసారి డెత్‌ ఆన్‌ ద నైల్‌ మూవీగా రూపొందుతుంది. ఈ చిత్రానికి  కెన్నత్‌ బ్రెగాత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కెన్నత్‌ పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

థోర్‌.. హెవ్లొట్‌..యాజ్‌ యూ లైక్‌ ఇట్‌.. మర్డర్‌ ఆన్‌ ద ఓరియెంట్‌ ఎక్స్ ప్రెస్‌ లాంటి చిత్రాలను తెరకెక్కించి పలు హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడీ డైరెక్టర్. ఇవన్నీ చూస్తే అలీ ఫజల్‌ రెండో హాలీవుడ్‌ చిత్రం భారీ స్థాయిలోనే ఉండబోతుందని అర్థం అవుతుంది.

ఇది ఇలా ఉండగా  తన హాలీవుడ్‌ ప్రయాణంపై అలీ ఫజల్‌ మాట్లాడుతూ..మరో గొప్ప అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. మా అమ్మ అగాథా.. క్రిస్టీ నవలలకు పెద్ద అభిమాని. ఆ రచయిత రచనతో తెరకెక్కిస్తున్న  ఈ చిత్రంలో  నటించడం ఎన్నటికీ మరవులేనని అన్నాడు.  హాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు ఉన్నందుకు తెగ సంబరపడిపోతున్నాడు అలీ.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle