newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

లైంగిక వాంఛలు సవ్యంగా తీరకే అర్రులు చాస్తున్నారా.. రేణు దేశాయ్

02-12-201902-12-2019 11:07:25 IST
2019-12-02T05:37:25.078Z02-12-2019 2019-12-02T05:37:18.275Z - - 07-12-2019

లైంగిక వాంఛలు సవ్యంగా తీరకే అర్రులు చాస్తున్నారా.. రేణు దేశాయ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బిడ్డకు పాలందించే భాగాలను కూడా అపవిత్రంగా, చెడు దృష్టితో చూసే హీన పరిస్థితి దేశంలో అలుముకుందని, పురుషుల లైంగిక వాంఛలు సవ్యంగా తీరకే అత్యాచారాలు వంటి దారుణ చర్యలకు పూనుకుంటున్నారేమో అనిపిస్తోందని ప్రముఖ నటి రేణు దేశాయ్ సందేహం వెలిబుచ్చారు. సెక్స్ అనే అంశం పట్ల మనం కళ్లు మూసేసుకున్నాం, రొమ్ములు, యోని అనేవి చెడ్డ పదాలైపోయాయి. అపవిత్రమైన అంశాలైపోయాయి. బిడ్డకు పాలందించే భాగాలను కూడా అలాగే చూసే పరిస్థితి. తాము ఎక్కడినుంచి వచ్చామో అదే భాగాలపై దాడులు చేసే పరిస్థితి నెలకొనడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఒక యువ డాక్టర్‌పై అత్యాచారం చేసి సజీవ దహనం చేయడం. రాంచీలో 25 ఏళ్ల విద్యార్థినిపై 12 పురుషులు సామూహిక అత్యాచారం చేయడం, తమిళనాడులో ఒక బాలికపై సామూహిక అత్యాచారం చేయడం, చత్తీస్‌గడ్‌లో ఒక బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేయడం కేవలం రెండు రోజుల్లో దేశమంతటా అత్యాచారాల వార్తలతో రేణూ దేశాయ్ తల్లడిల్లిపోయారు. 

ఒక పౌరురాలిగా నేను చేయగలిగిన అతి పెద్ద పని.. సోషల్ మీడియాలో పోస్టు చేసి హ్యాష్‌ట్యాగ్‌లతో ఆగ్రహం వెలిబుచ్చటం మాత్రమేనా. ఒక తల్లిగా నేను చేయగలిగింది.. నా కూతురును నిరంతరం భయంతో పెంచటం మాత్రమేనా. ఆమెకు నాట్యసంగీతాలు నేర్పించటానికి బదులు.. ఆమెకు నేను ఆత్మరక్షణ నేర్పించాల్సి ఉంటుంది. ఓ అందమైన, సున్నితమైన బాలికకు జన్మనిచ్చినందుకు సంతోషించటానికి బదులు.. ఆమె భద్రత గురించి దిగులు పడుతూ నేను రాత్రిళ్లు జాగారం చేయాలి. నా రక్తం నిస్సహాయతతో రగిలిపోతోంది అని రేణు స్పందించారు. 

ఒక ఆవును చంపిన ఆరోపణతోనే ఒక పురుషుడిని మన దేశంలో ఒక గుంపు కొట్టి చంపింది. కానీ ఒక మహిళను కిరాతకంగా అత్యాచారం చేసి హత్యచేస్తే కేవలం అంతులేని చర్చలు జరుగుతాయి. సత్వర విచారణలు, శిక్షలు తక్కువ. నేరస్తులు భయపడే వాతావరణం లేదు. నేరం చేయాలంటే భయపడే పరిస్థితులు ఉండాలి. దేవుళ్ల గదిలో లక్ష్మీదేవికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసే పురుషులు ఆమె మానవ రూపం మీద అకృత్యాలు జరుపడం ఏం న్యాయం అని రేణూదేశాయ్ ప్రశ్నించారు.

ఆడపిల్లను కాపాడటం గురించి, చదువు చెప్పించటం గురించి మన ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ పనిచేసే మహిళలకు కనీస రక్షణ కల్పించటంలో ఎందుకు విఫలమవుతోంది. బాగా చదువుకున్న తరువాత ఒక మహిళ ఏం చేస్తుంది భయంతో ఇంటి దగ్గర కూర్చుంటుందా లేక బయటకు వెళ్లి కిరాతకంగా అత్యాచారానికి, హత్యకు గురయ్యే ప్రమాదంలో పడుతుందా రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ముందూ వెనుకా చూసుకోవాల్సిన పరిస్తితి తలెత్తడమే సరైంది కాదని రేణు పేర్కొన్నారు.

మహిళల మీద అకృత్యాల పైన ధర్మయుద్ధాన్ని మగాళ్లు చేపట్టనిదే.. ఇది కేవలం మరొక వ్యాసంగా, మరొక హ్యాష్‌ట్యాగ్ మిగులుతుంది! తర్వాతి బాధితురాలు తమ సొంత వారు కావచ్చుననే కఠోర వాస్తవాన్ని తండ్రులు, అన్నలు, తమ్ముళ్లు, మగ బంధువులు తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది. చేసిన నేరాలకు సత్వర విచారణ జరిగి శిక్షలు వేగంగా పడేలా వ్యవస్థలో మార్పులు తేవాలని డిమాండ్ చేయాల్సిన సయమం ఆసన్నమైంది.

ప్రతి అమాయక బాధితురాలూ కేవలం ఒక హ్యాష్‌ ట్యాగ్. మనం అందరమూ ఒక సమాజంగా విఫలమవుతున్నాం. ఒక సమాజంగా పురోగమించటానికి బదులు తిరోగమిస్తున్నాం. బాలికకు చదువు చెప్పించినంత మాత్రాన ఆమెకు భద్రత లభించదు. ఒక స్త్రీ కేవలం ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భార్య మాత్రమే కాదని.. ఆమెకు ఆమెగా ఒక వ్యక్తి అని పురుషులకు వివరించాల్సి ఉంది. వినియోగించుకోవటానికి, దుర్వినియోగం చేయటానికి ఆమె ఒక వినియోగ వస్తువు కాదని చెప్పాలని రేణు పేర్కొన్నారు.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle