newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

'లవ్ స్టోరీ'తో అఖిల్ హిట్ కొట్టడం ఖాయం..

11-01-202011-01-2020 08:45:16 IST
2020-01-11T03:15:16.452Z11-01-2020 2020-01-11T03:10:08.660Z - - 13-08-2020

'లవ్ స్టోరీ'తో అఖిల్ హిట్ కొట్టడం ఖాయం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అక్కినేని నట వారసుడు అఖిల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కెరీర్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలలో నటించిన అఖిల్ కు విజయం పలకరించలేదు. వినాయక్ దర్శకత్వంలో నటించిన 'అఖిల్' సినిమా దారుణ పరాజయాన్ని చవి చూసింది. 'మనం' లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన 'హలో' సినిమాని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్న అఖిల్ 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమా చేశాడు. పెర్ఫామెన్స్ గా మిస్టర్ మజ్ను సినిమాలో బాగా ఇంప్రూవ్ అయిన అఖిల్ కు మాత్రం హిట్ రాలేదు. ఈ సినిమా ఎవరేజ్ గా నిలిచింది. వరుసగా చిత్రాలు ఆశించిన మేరకు విజయాన్ని సాదించకపోవడంతో అఖిల్ డీలా పడిపోయాడు.

దీంతో నాగార్జున తన కొడుకు బాధ్యతను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతిలో పెట్టాడు. అల్లు అరవింద్ ఎన్నో కథలు విని అఖిల్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథను ఓకే చేశాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. 

ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రీసంట్ గా ఈ సినిమాలో ఒక సాంగ్ ని షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. నటిస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో తీసిన లవ్ సీన్స్ వాటి మధ్యన జరిగే ఒక మోంటాజ్ సాంగ్ ని షూట్ చేశారట.

అంతేకాదు,ఈ లవ్ సీన్స్ చాలా బాగా వచ్చాయట. ఈ సీన్స్ సినిమాలోనే హైలెట్ గా ఉండబోతున్నాయని కూడా అంటున్నారు. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఈ సినిమా లవ్ స్టోరీ కూడా ఎంతో ప్రత్యేకం అని చెప్తోంది చిత్రయూనిట్.  దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాపై అక్కినేని కుర్రాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

పెర్ఫామెన్స్ గా మిస్టర్ మజ్ను సినిమాలో బాగా ఇంప్రూవ్ అయిన అఖిల్ ఈసారి ఖచ్చితంగా చెప్పినట్లుగానే హిట్ కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. అక్కినేని అఖిల్ ఈసారి హిట్ కొడతాను రాస్కోండి బ్రదర్స్ అంటున్నాడు. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అంటే సినిమా అంత బాగా వస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అఖిల్ ఈ సినిమాతో హిట్ కొడతాడా లేదా అనే విషయం సమ్మర్ లో తేలనుంది. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle